For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Amazon Pay ద్వారా బంగారం ఎలా కొనుగోలు/అమ్మకాలు జరపాలి..?

|

బంగారంలో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారా.. అయితే బంగారంపై ఎలా ఇన్వెస్ట్ చేయాలి.. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునేవారు లేదా ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ముందుగా డిజిటల్ బంగారం వైపు మొగ్గు చూపాలని విశ్లేషకులు చెబుతున్నారు. భారత దేశంలో పసిడికి ఉన్న ప్రాముఖ్యతే వేరు. ఎందుకంటే బంగారం పై ఇన్వెస్ట్ చేస్తే ఆశించిన స్థాయిలో లాభాలు తప్పకుండా వస్తాయి. ప్రస్తుతం బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు పలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే పసిడిపై పెట్టుబడి నిర్ణయం తీసుకునేముందు పన్నులు తదితర అంశాలను ఓసారి చూసుకోవాలి.

అమెజాన్ పే పై బంగారం ఎలా కొనుగోలు చేయాలి

బంగారంను డిజిటల్ ప్లాట్‌ఫాంపై కొనుగోలు లేదా అమ్మకం చేయొచ్చు. ఇందుకోసం ఏదైనా ఒక డిజిటల్ గోల్డ్ యాప్‌ను ముందుగా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు అమెజాన్ పే ఇన్స్‌టాల్ చేసుకుంటే ఈ యాప్ ద్వారా బంగారంను ఎలా కొనుగోలు చేయాలి ఎలా అమ్మకాలు చేపట్టాలి అనేది తెలుసుకుందాం. అమెజాన్ పే యాప్ ద్వారా బంగారం కొనుగోలు ఎలా చేయాలో తెలుసుకుందాం.

How to buy and sell Gold on Amazon Pay,Know the details here

స్టెప్ 1: ముందుగా అమెజాన్ యాప్ ఓపెన్ చేయండి

స్టెప్ 2: డ్రాప్ డౌన్ మెనూలో అమెజాన్ పేను సెలెక్ట్ చేసుకోండి

స్టెప్ 3: కిందకు కాస్త స్క్రోల్ చేస్తూ Gold Vault కనిపిస్తుంది

స్టెప్ 4: Buy Gold టాబ్ కింద డబ్బులు ఎంటర్ చేయండి

నోట్: అమౌంట్ ఎంటర్ చేయగానే మీరు ఎంటర్ చేసిన డబ్బులకు సమానంగా గ్రాముల విలువ చూపిస్తుంది. ఏ రోజుకు ఆ రోజు 24 క్యారెట్ల బంగారం ధర ఎలా ఉందో కనిపిస్తుంది. కనీసం రూ.5 ఎంటర్ చేయాల్సి ఉంటుంది

స్టెప్ 5: టర్మ్స్ అండ్ కండీషన్స్ పై ఒప్పుకుంటున్నట్లుగా క్లిక్ చేయండి

స్టెప్ 6: Proceed to Buy అనే దానిపై క్లిక్ చేయండి

నోట్: అమెజాన్ పే ఆప్షన్ ఇంకా అందుబాటులో లేదు

స్టెప్ 7: పేమెంట్ ఆప్షన్ ఎంపిక చేసుకోండి- డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు మరియు యూపీఐ ద్వారా చెల్లింపులు చేపట్టండి

స్టెప్ 8: ఒకవేళ యూపీఐ ద్వారా చెల్లింపులు చేపడుతున్నట్లయితే పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి

వెంటనే ఎంత అమౌంట్ ఎంటర్ చేశారు ఎన్ని గ్రాములు కొనుగోలు చేశారనే వివరాలు మీ వాల్ట్‌లో అప్‌డేట్ అవుతాయి.

ఇక అమెజాన్ పే ఉపయోగించి బంగారంను ఎలా అమ్మాలి..?

బంగారం అమ్మాలనుకున్నప్పుడు జీఎస్టీ లేకుండా అమ్మాల్సి ఉంటుంది.

స్టెప్ 1: sell gold పై క్లిక్ చేయండి

స్టెప్ 2: ఎన్ని గ్రాములు అమ్మాలనుకుంటున్నారో ఎంటర్ చేయండి. అప్పుడు జీఎస్టీ తీసేసి ఎంతకు అమ్ముడుపోతుందో ఆ విలువ చూపిస్తుంది

స్టెప్ 3: continue పై క్లిక్ చేయండి

స్టెప్ 4: పేమెంట్ ఆప్షన్‌నెు ఎంపిక చేసుకోండి

స్టెప్ 5: పేమెంట్ ఆప్షన్‌ను నిర్థారిస్తే చాలు.. వెంటనే మీ ఖాతాలో డబ్బులు చేరిపోతాయి.

డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసేముందు ఈ విషయాలు తెలుసుకోవాలి

1: డిజిటల్ పద్ధతిలో బంగారం కొనుగోలు చేసే సమయంలో 3శాతం జీఎస్టీ చెల్లించాలి

2. బంగారం డెలివరీని కూడా చేయడం డిజిటల్ గోల్డ్‌లో ఉన్న స్పెషాలిటీ.అయితే డెలివరీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

3. డిజిటల్ గోల్డ్ పద్ధతి ద్వారా కొనుగోలు చేసిన బంగారం ఒక సమయం వరకు మాత్రమే ఉంటుంది. ఆ గడవు ముగిశాక బంగారంను అమ్మడమన్నా చేయాలి లేదా ఇంటికి డెలివరీ చేయించుకోవాలి

4.డిజిటల్ గోల్డ్ పై రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ లేకపోవడం కాస్త ఆందోళన కలిగించే విషయం

5. ఒకవేళ డిజిటల్ గోల్డ్‌ను ఒక వస్తువు రూపంలో పొందాలనుకుంటే అందుకు మార్పిడి రుసుంను చెల్లించాల్సి ఉంటుంది.

అన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ పై బంగారం కొనుగోలు లేదా అమ్మకం ఒకేలా ఉంటుంది. ఇందులో ఎలాంటి తేడా కనిపించదు. అమెజాన్ పే, పేటీఎం, గ్రో, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్, జీ-పే, మోతీలాల్ ఓస్వాల్ యాప్‌లపై డిజిటల్ పద్ధతిన బంగారు కొనుగోలు అమ్మకాలు ఒకే విధానం అవలంబిస్తున్నాయి.

English summary

Amazon Pay ద్వారా బంగారం ఎలా కొనుగోలు/అమ్మకాలు జరపాలి..? | How to buy and sell Gold on Amazon Pay,Know the details here

One of the newest ways to invest in gold is to buy digital gold.Amazon pay also allows you to buy and sell gold on its platform.
Story first published: Saturday, March 13, 2021, 18:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X