ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) వివిధ రకాల హోమ్ లోన్స్‌ను అందిస్తోంది. ఇందులో రెగ్యులర్ హోమ్ లోన్, ఎస్బీఐ ప్రివిలేజ్ హోమ్ లోన్(ప్రభుత్వ ఉద్యోగులకు), ఎస్బీఐ మ్యాక్స్ గెయిన్ హోమ్ లోన్, ఎస్బీఐ స్మార్ట్ హోమ్, టాపప్ లోన్(ఎగ్జిస్టింగ్ కస్టమర్), ఎస్బీఐ ఎన్నారై హోమ్ లోన్, ఎస్బీఐ ఫ్లెక్సీ పే హోమ్ లోన్ (అత్యధిక హోమ్ లోన్), ఎస్బీఐ హర్ ఘర్ హోమ్ లోన్(మహిళలకు) ఉన్నాయి.
కస్టమర్లు ఎవరైనా ఆన్ లైన్ ద్వారా లేదా యోనో ప్లాట్ ఫామ్ ద్వారా కూడా హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటీవలే SBI తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. హోమ్ లోన్ వడ్డీ రేటును 6.7 శాతానికి ఇస్తున్నట్లు ప్రకటించింది. క్రెడిట్ స్కోర్ ఆధారంగా కస్టమర్లు ఈ ఆఫర్‌ను పొందవచ్చు. అలాగే, ఆఫర్ కింద ప్రాసెసింగ్ ఫీజును కూడా తొలగించినట్లు బ్యాంకు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

ఫీచర్స్, డాక్యుమెంట్స్
ఎస్బీఐ హోమ్ లోన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్లు, ఇతర ఫీచర్స్ ఇక్కడ చూద్దాం
- హోమ్ లోన్ కాలపరిమితి - 3-30 ఏళ్లు
వడ్డీ రేటు - ఎస్బీఐ క్రెడిట్ స్కోర్ లింక్డ్ హోమ్ లోన్ వడ్డీ రేటును 6.70 శాతానికే అందిస్తోంది. రుణం మొత్తం ఎంత, ఏ రంగం అనేదాంతో సంబంధం లేకుండా వడ్డీ రేటు ఒకేలా ఉంటుంది.
ప్రాసెసింగ్ ఫీజు - జీరో శాతం
- హిడెన్ లేదా అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు లేవు.
- మహిళా రుణ గ్రహీతలకు వడ్డీ రేటులో తగ్గింపు.
- క్రెడిట్ స్కోర్ లింక్డ్ హోమ్ లోన్స్.
- ప్రీపేమెంట్ పెనాల్టీ లేదు.
- రోజువారీ తగ్గుదల బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీ రేటు లెక్కింపు
- ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం

ఎలా దరఖాస్తు చేయాలి?
కస్టమర్లు ఆన్ లైన్ ద్వారా లేదా యోనో యాప్ ద్వారా హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేయవచ్చు.
క్రింది లింక్ పైన క్లిక్ చేయడం ద్వారా హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
https://onlineapply.sbi.co.in/personal-banking/home-loan?se=SBI-Microsite&cp=Homeloan&Ag=SBI-Microsite
యోనో యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- తొలుత యోనో అకౌంట్‌లోకి లాక్-ఇన్ కావాలి.
- హోమ్ పేజీలో మెనూ పైన క్లిక్ చేయాలి.
- లోన్స్ పైన క్లిక్ చేయాలి.
- హోమ్ లోన్ పైన క్లిక్ చేయాలి.
- మీ వయస్సు వివరాలు అందించి క్విక్ ఎలిజిబులిటీ తెలుసుకోవాలి.
- ఆదాయ వివరాలు అందించాలి.
- ఆ తర్వాత మీ నెల వారి ఆదాయం వివరాలు ఇవ్వాలి.
- ఇతర రుణాలు ఏమైనా ఉంటే వాటి వివరాలు అందించాలి.
- మీ లోన్ ఎలిజిబులిటీ చెక్ చేసుకొని, ప్రొసీడ్ కావాలి.
- ఇతర వివరాలు నింపి, సబ్‌మిట్ పైన క్లిక్ చేయాలి.
- మీకు రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ తర్వాత ఎస్బీఐ ఎగ్జిక్యూటివ్ నుండి మీకు కాల్ వస్తుంది.

కావాల్సిన డాక్యుమెంట్స్
- కంపెనీ ఇచ్చిన గుర్తింపు కార్డు.
- లోన్ అప్లికేషన్. మూడు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో కూడిన దరఖాస్తు.
- ఏదైనా ఐడీ ప్రూఫ్. ( పాన్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, వోటర్ ఐడీ)
- రెసిడెన్స్ ప్రూఫ్ (ఇందుకోసం టెలిఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు, పైప్ గ్యాస్ బిల్లు లేదా పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు).
- ఉద్యోగి శాలరీ స్లిప్. మూడు నెలల శాలరీ సర్టిఫికెట్ అవసరం. రెండేళ్ల ఫామ్ 16 కాపీ. రెండేళ్ల ఐటీ రిటర్న్స్.
- నాన్ శాలరైడ్ అయితే బిజినెస్ అడ్రస్ ప్రూఫ్. మూడేళ్ల ఐటీ ప్రూఫ్స్. బ్యాలెన్స్ షీట్, మూడేళ్ల ప్రాఫిట్ లేదా లాస్ అకౌంట్. బిజినెస్ లైసెన్స్ వివరాలు. టీడీఎస్ సర్టిఫికెట్. క్వాలిఫికేషన్ సర్టిఫికెట్.

ప్రాపర్టీ పేపర్స్
- నిర్మాణం కోసం అవసరమైన అనుమతి పత్రాలు.
- ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (రెడీ టు మూవ్ ప్రాపర్టీ అయితే)
- అప్రూవ్డ్ ప్లాన్ కాపీ.
- పేమెంట్ రిసిప్ట్ లేదా బ్యాంకు అకౌంట్ స్టేట్‌మెంట్.
- ఆరు నెలల బ్యాంకు అకౌంట్ స్టేట్‌మెంట్.
- ఇదివరకు కూడా రుణాలు తీసుకొని ఉంటే, లోన్ అకౌంట్ ఏడాది స్టేట్‌మెంట్.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications