Retirement Planning: రూ.10 కోట్లు రిటైర్మెంట్ కార్పస్ కావాలా? ఇదే సరైన ప్రణాళిక..
Retirement Fund: నేటి కాలం యువత ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా ఉరుకులు పరుగుల సంపాదన జీవితానికి స్వస్థి పలకాలని అనుకుంటున్నారు. దీంతో చాలా మంది తమ రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకుంటున్నారు. చిన్న వయస్సులోనే తమ అవసరాలకు సరిపడా దాచుకుని జీవితాన్ని ప్రశాంతంగా సాఫీగా గడపాలని నేటితరం యువత భావిస్తోంది.
ముందస్తుగా పదవీ విరమణను ఎంచుకునే ముందు తగినంత మొత్తాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. మనిషి బ్రతికే జీవితకాలం 85 ఏళ్లుగా పరిగణిస్తే.. మీరు రిటైర్మెంట్ ప్లాన్ 33-35 ఏళ్ల కోసం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కనీసం రూ.10 కోట్ల కార్పస్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. పదవీ విరమణ కోసం ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల పోర్ట్ ఫోలియో ఇక్కడి నుంచి సంవత్సరానికి 12 శాతం రాబడిని అందించేందిగా ఉండాలి. అప్పుడు పెట్టుబడి విలువ 50 ఏళ్ల వయస్సులో రూ.3.78 కోట్లు, 52 ఏళ్ల వయస్సు నాటికి రూ.4.75 కోట్లకు చేరుకోవాలి.

అదే విధంగా EPF మొత్తం ఏడాదికి 7% రాబడి వద్ద 50 ఏళ్ల వయస్సులో రూ.1.71 కోట్లు, 52 ఏళ్ల వయస్సు నాటికి రూ.1.96 కోట్లు ఉండాలి. కాబట్టి EPF నుంచి పొందై ఫైనల్ మెుత్తం పైన పేర్కొన్న సంఖ్యల కంటే ఎక్కువగా ఉండాలి. రూ.10 కోట్ల కార్పస్ లక్ష్యాన్ని చేరుకోవటానికి ఒక వ్యక్తి నెలకు కనీసం రూ.1.30 లక్షలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇది 50 ఏళ్ల వయస్సులో రూ.2.02 కోట్లు, 52 ఏళ్ల వయస్సులో రూ.2.88 కోట్ల అదనపు కార్పస్ నిర్మాణానికి దోహదపడుతుంది. ఈ మెుత్తాన్ని ఏడాదికి 12 శాతం లేదా అంతకంటే ఎక్కువ రాబడిని అందించే ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో ఉంచాలి. ఈలెక్కన మెుత్తం పెట్టుబడి 50 ఏళ్ల వయస్సులో రూ.7.52 కోట్లు, 52 ఏళ్ల వయస్సులో రూ.9.60 కోట్లకు చేరుకుంటుంది.
కాబట్టి ప్రస్తుత EPFలో మీ నెలవారీ పెట్టుబడి పైన పేర్కొన్న మొత్తానికి మరింత జోడిస్తుంది కాబట్టి మీరు ముందస్తు పదవీ విరమణ వయస్సు 52 కోసం ప్లాన్ చేసుకోవచ్చు. మీరు మీ కార్పస్‌ను నిర్మించడానికి నెలవారీ ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడానికి మరింత అనుకూలమైన మార్గం.


Click it and Unblock the Notifications