సాధారణంగా పిల్లలు పెరిగి పెద్దాయక ఆస్తుల గురించి చర్చలు జరుగుతుంటాయి. ఒకోసారి ఆస్తులు సొంతం చేసుకోవాలనే ఆశలు కూడా ఇందుకు ఆజ్యం పోస్తాయి. మన దేశంలో సంప్రదాయంగ వస్తున్న పద్ధతి తండ్రి ఆస్థి కొడుకుకి చెందుతుందని, కానీ ఒకవేళా కొడుకుతో పాటు కూతురు ఉంటే ఆస్థి సమానంగా కుర్ధురికి కూడా చెందుతుందా అనే సందేహం అందరి మదిలో ఉండే ప్రశ్నే. అయితే ఆస్తుల కోసం వివాదాలు, మనస్పర్థలు, గొడవలు ఇలా విడిపోయేవరకు దారి ఇస్తాయి. నేటి కాలంలో తండ్రి ఆస్థి కొడుకుకి చెందకపోతే పిల్లలు ఉన్న కోడళ్ళు కూడా విడిపోతున్నారు. అయితే తండ్రి ఆస్థి నిజంగా ఎవరికీ చెందాలి.. కూతురికి కూడా ఇందులో సగం వాటా హక్కు ఉంటుందా... చట్టంలో ఎం వ్రాసి ఉంది..?
తండ్రి ఆస్థి కొడుకుకి మాత్రమే హక్కు ఉంటుందని కూతురికి ఉండదని ఏదైనా చట్టంలో ఉందా అనేదానికి తండ్రి ఆస్తులన్నిటికి కొడుకుకి హక్కు ఉంటుంది అనేది దశాబ్దాలుగా మన సమాజంలో వస్తుంది. ఇప్పటికి కూడా అదే కొనసాగుతుంది. అయితే ఒకవేళ తండ్రికి కొడుకులు లేకుండా కూతుళ్లు ఉంటే తండ్రి ఆస్తిలో వాటా కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ వీలునామాలో కూతుళ్ళకే చెందాలని వ్రాసి ఉంటే అందుకు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే కొన్నిసార్లు తండ్రి తరువాత తన ఆస్తులన్నిటికి కూతురే వారసురాలు అని రాసిస్తే అలంటి సందర్భాల్లో కూడా ఆమెకి హక్కు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తండ్రి ఆస్తిలో వాటాను కొడుకులతో పాటు కూతుళ్ళకు కూడా హక్కు కల్పిస్తారు.

భారత రాజ్యాంగంలోని హిందూ వారసత్వ చట్టం 2005 ప్రకారం తండ్రి ఆస్తిలో కొడుకుతో పాటు కూతురికి కూడా సమన హక్కు ఉంటుంది. కూతురు అవివాహితురాలైతే తండ్రి ఆస్తిలో కుమార్తెకు సమాన వాటా క్లెయిమ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా కూతురికి పెళ్లయినా కూడా తండ్రి ఆస్తిలో కూతురు సమాన వాటాను క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ తండ్రి మరణ వాంగ్మూలంలో తన ఆస్తులు కొడుకుకి మాత్రమే చెందాలని వ్రాసి ఉంటె కూతురికి హక్కు ఉండదాని గమనించాలి. ఒకవేళ తండ్రి ఆస్థి వీలునామా కొడుకుకి చెందిన కూతురి ఆస్తిలో వట కోసం క్లెయిమ్ చేయలేరు. ఒకవేళ కూతురు తండ్రి వీలునామా లేదా మరణవాంగ్మూలంని నిరాకరించినట్లయితే అలంటి సమయంలో ఆమె కోర్టుని ఆశ్రయించి న్యాయపరమైన చర్యలు కొనసాగించవచ్చు. ఆస్థివీలునామా అనేది తన తరువాత తన ఆస్తులన్ని ఎవరికీ పూర్తిగా చెందుతాయి ఎవరికీ పూర్తి హక్కులు ఉంటాయి అనేది నిర్ణయించడం జరుగుతుంది.


Click it and Unblock the Notifications