EPFO: ఈపీఎస్‌లో పెన్షన్ ఎలా లెక్కిస్తారు.. ఎన్ని ఏళ్ల సర్వీస్ ఉంటే పెన్షన్ వస్తుంది..!
ఉద్యోగం చేసే దాదాపు అందెకి పీఎఫ్ ఖాతా ఉంటుంది. ఈ ఫీఎఫ్ ఖాతాలోకి నెలనెలా కొంత మొత్తం జమ అవుతుంది. పీఎఫ్ ఖాతాలో జమ అయ్యే మొత్తంలో ఉద్యోగి నుంచి 50 శాతం, యాజమాన్యం నుంచి 50 శాతం ఉంటుంది. ఉద్యోగి చెల్లించే మొత్తం ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్తోంది. యాజమాన్యం చెల్లించే మొత్తంలో 8.33 శాతం ఈపీఎస్ కు వెళ్తుంది. మిగతాది ఈపీఎఫ్ కు వెళ్తోంది. ఇక్కడ ఈపీఎస్ అంటే ఎంప్లాయి పెన్షన్ స్కీం. అయితే చాలా మంది ఈపీఎస్ గురించి తెలియదు. కొంత మంది మందికి ఈపీఎస్ ఉంటే పెన్షన్ వస్తుందని తెలుసు. కానీ పెన్షన్ రావడానికి కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారమే పెన్షన్ వస్తుంది.
ఒక ఉద్యోగికి పెన్షన్ రావాలంటే.. అతను కనీసం 10 ఏళ్ల పాటు పెన్షనబుల్ సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. అంటే 10 ఏళ్ల పాటు మీ యాజమాన్యం మీ పెన్షన్ ఖాతాకు డబ్బులు జమ చేసి ఉండాలి. ఒకవేళ మీరు మధ్యలో ఉద్యోగం మారినా పాత పీఎఫ్ ఖాతాను కొత్త కంపెనీకి బదిలీ చేసుకుంటే ఆ సర్వీస్ కాలం కూడా లెక్కిస్తారు. ఉద్యోగికి వయసు 58 ఏళ్లు నిండిన తర్వాత పెన్షన్ వస్తుంది. 10 ఏళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ 58 ఏళ్లు నిండిన తర్వాతే పూర్తి పెన్షన్ వస్తుందని గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీరు 50 ఏళ్లు నిండి 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉంటే ఎర్లీ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని నిబంధనలుచెబుతున్నాయి.

అయితే 58 ఏళ్ల కంటే ముందుగా పెన్షన్ తీసుకుంటే.. ప్రతి ఏడాదికి 4% చొప్పున పెన్షన్ మొత్తంలో కోత విధిస్తారు. 58 ఏళ్ల పింఛన్ తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీ సర్వీస్ 10 ఏళ్ల కంటే తక్కువ ఉంటే మీకు లైఫ్ టైమ్ పెన్షన్ రాదని గుర్తుంచుకోవాలి. అటువంటి సందర్భంలో మీరు ఉద్యోగం మానేసినప్పుడు పెన్షన్ ఖాతాలో ఉన్న సొమ్మును విత్ డ్రా చేసుకోవచ్చు లేదా 'స్కీమ్ సర్టిఫికేట్' తీసుకుని భవిష్యత్తులో మరేదైనా ఉద్యోగంలో చేరినప్పుడు ఆ సర్వీస్‌ను కలుపుకోవచ్చు. ఈపీఎస్ లో వచ్చే పింఛన్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మీ సర్వీస్ ను బట్టి పెన్షన్ వస్తుంది.
నెలలవారీ పింఛన్=అర్హత గల జీతం× పింఛను అర్హత గల సర్వీసు ÷ 70 ఆధారంగా లెక్కిస్తారు. ప్రస్తుతం పింఛన్‌కు అర్హత గల గరిష్ట జీతం నెలకు రూ.15 వేలుగా ఉంది. మీ పెన్షన్ అర్హత జీతం రూ.15 వేలుగా ఉండి 15 ఏళ్ల పాటు సర్వీస్ పూర్తి చేస్తే నెలకు రూ.3214 పెన్షన్ లభిస్తుంది. అంటే ఏడాదికి రూ.38,568 పెన్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అదే 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేస్తే రూ.2140 అందుతుంది. అయితే పీఎఫ్ కనీస వేతన పరిమితి పెంపుతో పెన్షన్ మొత్తం పెరిగే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications