Aadhaar: ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేది, జెండర్, అడ్రస్, మొబైల్ నంబర్ ఎన్నిసార్లు అప్డేట్ చేసుకోవచ్చు..!
ఇప్పుడు దేశంలో ఏ చిన్న అవసరానికి అయినా ఆధార్ అడుగుతున్నారు. మొబైల్ సిమ్ నుంచి బ్యాంక్ ఖాతా ఓపెన్, ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరి అయింది. అయితే ఈ ఆధార్ తప్పుల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా ఆధార్ పుట్టిన తేదీ, పేరు, జెండర్ తప్పుగా పడుతుంటుంది. అయితే వాటిని సరిచేయించుకునేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉడాయ్ అవకాశం కల్పించింది. అయితే ఇష్టమొచ్చినట్లు ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు వీలు లేదు. పలు అప్డేట్లకు లిమిట్ విధించింది. ఆధార్ లో పేరు మార్పు రెండు సార్లు మాత్రమే అప్డేట్ చేసుకోవచ్చు. అంటే ఆధార్ తీసుకున్న తర్వాత జీవిత కాలంలో రెండు సార్లు మాత్రమే పేరును అప్డేట్ అవకాశం కల్పించారు.
ఇక జెండర్ కు సంబంధించి ఆధార్ ఒక్కసారి మాత్రమే అప్టేడ్ చేసుకోవచ్చు. పుట్టిన తేదీకి సంబంధించి ఆధార్ అప్డేట్ రెండు కంటే ఎక్కువ సార్లు చేసుకోవచ్చు. అడ్రస్, ఫోన్ నంబర్, మెయిల్ ఇష్టమొచ్చినసార్లు మార్చుకోవచ్చు. కానీ దాని కోసం ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఉడాయ్ ఈ మధ్య కాలంలో కొన్ని కీలక మార్పులు తీసుకొచ్చింది. కొత్త ప్రామాణిక విధానాన్ని (SOP) ప్రవేశపెట్టింది. ఇందులో ఆధార్ కార్డులో పేరులో చిన్న చిన్న తప్పులు ఉంటే వాటిని సరిచేసుకునే అవకాశం కల్పించింది. పేరులో అక్షర దోషాలు, స్పెల్లింగ్ తప్పులు ఉంటే సరిచేయడం, మధ్య పేరును లేదా ఇంటిపేరును చేర్చడం, తొలగించడం వంటివి ఈ విభాగంలోకి వస్తాయని ఉడాయ్ పేర్కొంది.

పేరులోని పదాల క్రమాన్ని మార్చడం, పేరులోని మొదటి అక్షరాలను పూర్తిగా రాయడం లేదా అవసరం లేని చుక్కలను తొలగించడం కూడా చిన్న మార్పుల కిందకు రానున్నాయి. C.H. Renuka పేరు ఉంటే దాన్ని CH. Renuka గా మార్చుకోవచ్చు. అలాగే SrINivas అని పేరు వాస్తే దాన్ని Srinivas గా మార్చుకోవచ్చు. ఇలాంటి ఆధార్ ఆప్డేట్ కు సంబంధించి ఆధార్ కేంద్రానికి ఫామ్ పూరించి.. అందుకు సంబంధించి ఆధార పత్రాన్ని జత చేయాలి. ఆ తర్వాత నేము అప్డేట్ అయిపోతుంది. చాలా మంది మహిళలు పెళ్లి భర్త ఇంటి పేరును ఆధార్ లో చేర్చుతారు. దీని కోసం మ్యారేజ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.
అలాగే పెళ్లైన తర్వాత భర్త ఇంటి పేరు వచ్చింది. తర్వాత ఆమె విడాకులు తీసుకుంటే అప్పుడు కూడా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు. గుర్తింపు పత్రంతో పాటు అనెక్సర్ D (Annexure D) అనే అఫిడవిట్‌ను కూడా సమర్పించాల్సి ఉంటుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications