నేషనల్ పెన్షన్ సిస్టం(NPS) నుండి పాక్షిక ఉపసంహరణ కోసం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) పలు మార్పులు చేసింది. రిటైర్మెంట్ అనంతరం మీకు మరింత ఆకర్షణీయ రిటైర్మెంట్ సేవింగ్ స్కీంగా మార్చేందుకు NPS నిబంధనల్లో మార్పులు తెచ్చింది. ఇదివరకు పెన్షన్ ఫండ్ నుండి పాక్షిక ఉపసంహరణకు NPS నిబంధనలు అనుమతించేవి కావు. తాజాగా మార్చిన నిబంధనల ద్వారా పెన్షన్ ఫండ్ నుండి పాక్షిక ఉపసంహరణకు NPS సభ్యులకు అవకాశం కల్పిస్తుంది. NPS పాక్షిక ఉపసంహరణ కూడా మరింత సులభతరం అవుతోంది. అయితే ఉపసంహరణకు కొన్ని ముందస్తు షరతులు ఉంటాయి.

ఉపసంహరణకు నిబంధనలు
NPS సభ్యులకు మూడేళ్ల తర్వాత మాత్రమే పాక్షిక ఉపసంహరణకు అవకాశం లభిస్తుంది.
ఎంత ఉపసంహరించుకోవాలనే అంశానికి సంబంధించి పరిమితి ఉంది.
ప్రతి సబ్‌స్క్రైబర్ తన కాంట్రిబ్యుషన్‌లో 25 శాతం వరకు ఉపసంహరణ చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకు రూ.6 లక్షల కార్పస్ ఫండ్ ఉంటే అందులో రూ.1.5 లక్షలు ఉపసంహరించుకోవచ్చు.
ఇదివరకు NPS సబ్‌స్క్రైబర్లకు పాక్షిక ఉపసంహరణకు అవకాశం లేదు. అయితే ఇప్పుడు ఉపసంహరణకు అవకాశం ఉన్నప్పటికీ, ప్రత్యేక సందర్భాలు, షరతులు ఉంటాయి.

ఎన్నిసార్లు తీసుకోవచ్చు
ప్రత్యేక పరిస్థితులుంటే అత్యవసర సందర్భాల్లో ఉపసంహరించుకోవచ్చు. ఉదాహరణకు పిల్లల పెళ్లి, పిల్లల చదువులు, ఆస్తుల కొనుగోలు, కొత్త వెంచర్ ప్రారంభం, అనారోగ్యం, వైకల్యం వంటివి కలిగిన సందర్భాలలో తీసుకోవచ్చు. అమౌంట్ ఎంత మొత్తం తీసుకోవాలనే పరిమితితో పాటు ఎన్నిసార్లు తీసుకోవాలనే పరిమితులు కూడా ఉన్నాయి. టెన్యూర్ మొత్తంలో మూడుసార్లు తీసుకోవచ్చు. అలాగే, ప్రతి రెండు ఉపసంహరణల మధ్య కనీసం అయిదేళ్ల కాలపరిమితి ఉండాలి. అయితే అనారోగ్యం, ట్రీట్మెంట్ వంటి ప్రత్యేక సందర్భాల్లో ఈ కాలపరిమితి నుండి మినహాయింపు ఉంటుంది.

ఉపసంహరణ ఇలా
NPS నుండి పాక్షిక ఉపసంహరణ కోసం సంబంధిత సబ్‌స్క్రైబర్ ఒక నోడల్ ఆఫీసర్ ముందు తాను పాక్షికంగా NPS నిధులను తీసుకోవడానికి గల కారణాలు వెల్లడిస్తూ పత్రాలు సమర్పించాలి. ఇప్పుడు ఈ NPS వెబ్‌సైట్‌లో లాగిన్ కావడంతోపాటు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఉపసంహరణ విజ్ఞప్తి పంపిన అయిదు రోజుల్లో సంబంధిత సబ్‌స్క్రైబర్ బ్యాంకు ఖాతాలోకి ఆ మొత్తం జమ అవుతుంది.

పన్ను మినహాయింపులు
NPS నుండి పాక్షిక నగదు ఉపసంహరణ పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే అరవై ఏళ్ల లోపు సబ్‌స్క్రైబర్ NPS నుండి శాశ్వతంగా వైదొలగాలి. గడువుకు ముందు సబ్‌స్క్రైబర్ NPS నుండి వైదొలిగితే కార్పస్ ఫండ్‌లో 20 శాతం ఉపసంహరించుకోవచ్చు. మిగతా 80 శాతం నిధిని యాన్యుటీ ఫండ్స్ కొనుగోలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. భారీగా ఉపసంహరణ చేసినా పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే యాన్యుటీ ఆదాయంపై స్లాబ్ ప్రకారం పన్ను వర్తిస్తుంది. కార్పస్ ఫండ్ రూ.1 లక్ష లోపు ఉంటే అది మొత్తం సభ్యుడికి చెల్లించినా పన్ను మినహాయింపు వర్తిస్తుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications