రైతులకు HDFC గుడ్‌న్యూస్: ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే మీ ఇంటికి సేవలు
ప్రముఖ ప్రయివేటురంగ బ్యాంకు HDFC ఎక్కువమంది కస్టమర్లకు చేరువయ్యేలా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. వినూత్న కార్యక్రమాలు, కొత్త సర్వీసులు ప్రారంభిస్తోంది. తాజాగా ఈ బ్యాంకు కొత్త సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ బ్యాంకు వారం రోజుల క్రితం హర్ గావ్ హమరా పేరుతో ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (IVR) టోల్ ఫ్రీ నెంబర్‌ను తీసుకు వచ్చింది.

ఇంటి వద్దనే సేవలు.. టోల్ ఫ్రీ నెంబర్ ఇదే
హర్ గావ్ హమరా సేవల్లో భాగంగా కస్టమర్లకు బ్యాంకు మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందిస్తుంది. అయితే మొబైల్ సేవలు పొందడం కాదు. ఓ ఫోన్ కాల్‌తో ఎంక్వయిరీతో పాటు ఇంటి వద్దనే బ్యాంకింగ్ సేవలు పొందవచ్చు. ఇందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1800 120 9655ను జనవరి 6న లాంచ్ చేసింది.

ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఎవరికంటే?
ఈ టోల్ ఫ్రీ నెంబర్ కేవలం రైతులు, వ్యవసాయం చేసే వారికి మాత్రమే. గ్రామీణ ప్రాంతాల్లోని అన్నదాతలు బ్యాంకుకు ఫోన్ చేసి బ్యాంకింగ్ సేవలు ఇంటి వద్దనే పొందవచ్చు. రైతులు పై టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి బ్యాంకు సేవలు అందుకోవచ్చు.

పిన్ నెంబర్ షేర్ చేస్తే చాలు..
వ్యవసాయ రంగంతో అనుసంధానమై ఉండాలనే లక్ష్యంతో ఈ బ్యాంకు టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసింది. అందువల్ల రైతులు, వ్యవసాయ రంగానికి చెందిన వారు బ్యాంకు సేవలను ఉపయోగించుకోవచ్చు. 1800 120 9655 నెంబర్‌కు కాల్ చేసి పిన్ కోడ్ నెంబర్‌ను షేర్ చేయడం చేసి సేవలు పొందవచ్చు. పిన్ కోడ్ చేసి వివరాలు ఇస్తే సమీప బ్యాంకుకు చెందిన అధికారులు సదరు రైతు వద్దకు చేరుకుంటారు. అధికారులు వచ్చి మీకు సేవలు అందిస్తారు.

గ్రామీణులకూ చేరువయ్యేలా..
గ్రామీణ ప్రాంతాలకు కూడా బ్యాంకు సేవలను విస్తరించాలనే లక్ష్యంతో ఈ బ్యాంకు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామాల్లోని ప్రజలకు కూడా బ్యాంకు తన డిజిటల్, ఫైనాన్షియల్ ఉత్పత్తులు సహా ఇతర పథకాల గురించి తెలియజేసే ఉద్దేశ్యంలో భాగంగా ఈ టోల్ ఫ్రీ నెంబర్ తెచ్చింది.

పట్టణ-గ్రామీణ విభజన తగ్గించేందుకు..
భారతదేశంలోని జనాభాలో ముడింట రెండొంతులు గ్రామాల్లోనే ఉన్నారు. వారికి బ్యాంకింగ్ సేవలు తక్కువగా అందుతున్నాయి. ఈ నేపథ్యంలో పట్టణ-గ్రామీణ విభజనను తగ్గించేందుకు HDFC ఈ ప్రయత్నాలు చేస్తోంది.

ఆర్థిక వ్యవస్థ బలోపేతం
దేశంలో ప్రతి రైతు ఇంటి వద్దకు బ్యాంకింగ్ సేవలు తీసుకు వెళ్లడం కోసం దీనిని లాంచ్ చేశామని, టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తమ బ్యాంకు సేవలు పొందవచ్చునని, తమ కార్యక్రమం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని విశ్వసిస్తున్నానని, తమ ఉత్పత్తులకు ఈ ప్రాంతాల్లోను అవకాశాలు ఉంటాయని భావిస్తున్నామని HDFC బ్యాంకు రూరల్ బ్యాంకింగ్ గ్రూప్ బిజినెస్ హెడ్ రాజిందర్ బబ్బర్ అన్నారు.


Click it and Unblock the Notifications