దొంగ ఎవరో కాదు బ్యాంకు ఉద్యోగే... కస్టమర్ అకౌంట్లోంచి 3 కోట్ల స్వాహా.. తిప్పికొట్టిన ప్లాన్..
సాధారణంగా ఓటీపీ స్కాం ద్వారా లేదంటే ఈమెయిల్ లింక్స్ ద్వారా ఫిషింగ్ టాక్స్ జరుగుతుంటాయి లేదంటే కస్టమర్ల అకౌంట్ నుండి హ్యాకర్లు మాల్వేర్ ద్వారా డబ్బులు కాజేస్తుంటారు. అంతేకాదు బ్యాంక్ కస్టమర్లే లక్ష్యంగా కొత్త కొత్త పద్థతుల్లో కస్టమర్లను దోచేస్తుంటారు. వీటిని సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఎన్నో ఫిర్యాదులు కూడా అందాయి. కానీ ముంబైలో మాత్రం కోతేమ్ వెరైటీగా ఒక సంఘటన జరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన ఓ ఉద్యోగి కస్టమర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి రూ.3 కోట్లు దోచుకున్న ఘటన తాజగా సంచలనం రేపింది.
ముంబైకి చెందిన మీనాక్షి కపూర్ అనే 53 ఏళ్ల మహిళ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ తెరిచి మూడు కోట్ల డిపాజిట్ చేసింది. బ్యాంక్‌లో ఆమె రిలేషన్ షిప్ మేనేజర్‌గా పనిచేస్తున్న పాయల్ కొఠారి అనే 27 ఏళ్ల మహిళ ఆ మూడు కోట్లను తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసింది. ఈ విషయమై మీనాక్షి కపురియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసులు పాయల్ కొఠారిని అరెస్ట్ చేయకుండా సెటిల్ చేసేందుకు ప్రయత్నించారు. దీని తర్వాత మీనాక్షి కపూర్ బాంబే హైకోర్టులో కేసు వేశారు. అప్పుడే పాయల్ కొఠారి చేసిన అక్రమాలన్నీ వెలుగులోకి వచ్చాయి.
పాయల్ కొఠారి మీనాక్షి కపూర్ అకౌంటుకి లింక్ చేసిన మొబైల్ నంబర్ అలాగే ఇమెయిల్ అడ్రసుతో సహా మార్చింది. దీని తర్వాత ఆమె అకౌంట్ నుంచి మరో అకౌంటుక్కు రూ.3 కోట్లు తరువాత ఆ అకౌంట్ నుంచి తన అకౌంటుకు ట్రాన్స్ఫర్ చేసింది. ఇది మీనాక్షి కపూర్‌కి తెలియకూడదని మని ట్రాన్స్ఫర్ సంబంధించిన మెసేజ్ ఆమెకు వెళ్లకూడదని ముందుగానే మొబైల్ నంబర్‌ను, ఈమెయిల్‌ను మార్చేసింది. కేసు కోర్టుకు చేరడంతో పోలీసులు పాయల్ కొఠారీని అరెస్ట్ చేశారు.
బాంబే హైకోర్టులో కేసు విచారణకు రాగా, బాధితురాలు కోర్టుకు వచ్చిన తర్వాతే అరెస్టులు చేస్తున్నారంటూ పోలీసుల చర్యపై న్యాయమూర్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌ను కూడా వారు ఆదేశించారు. అంతే కాకుండా ఈ కేసుకు సంబంధించి వివరణ ఇవ్వాలని హెచ్‌డిఎఫ్‌సి, ఆర్‌బిఐకి నోటీసులు పంపాయి.
ప్రజలు డబ్బు డిపాజిట్ చేయడానికి బ్యాంకును నమ్మితే ఆ బ్యాంకింగ్ వ్యవస్థలోని వ్యక్తి ఆ డబ్బును దొంగిలించినప్పుడు, ప్రజలు ఎవరిని నమ్ముతారు అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, ఈ వ్యవహారంలో బ్యాంకు యాజమాన్యానికి కూడా ప్రమేయం ఉందా ఇంకా ఎవరికైనా ఇందులో ఎవరిదైనా ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ జరిపించాలని న్యాయమూర్తులు సూచించారు. ఒక వృద్ధ మహిళ తన పదవీ రిటైర్మెంట్ డబ్బులను బ్యాంకుకు అప్పగించగా, బ్యాంకు యాజమాన్యం ఆమెను మోసం చేసిందని, దీంతో న్యాయమూర్తులు కేసును డిసెంబర్ 13కి వాయిదా వేశారు. ఈ కేసులో అలసత్వం వహించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.


Click it and Unblock the Notifications