కరోనా నిబంధనలతో... హైదరాబాద్, విశాఖపట్నం సహా HDFC మొబైల్ ఏటీఎంలు
కరోనా లాక్‌డౌన్, ఆంక్షల కారణంగా నగదు లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఖాతాదారులకు HDFC ఇటీవల మొబైల్ ఏటీఎం సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్, విజయవాడ సహా దేశవ్యాప్తంగా 50 నగరాల్లో ఈ మొబైల్ ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ముంబై, బెంగళూరు నగరాలు ఉన్నాయి. తొలి విడతలో భాగంగా హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి తదితర నగరాల్లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ మొబైల్ ఏటీఎం ప్రతి రోజు మూడు నుండి నాలుగు ప్రాంతాలను కవర్ చేస్తుంది. ఈ ఈటీఎంలలో 15 ట్రాన్సాక్షన్స్ జరుపుకోవచ్చు.

మొబైల్ ఏటీఎం
ఈ మొబైల్ ఏటీఎంలు ఇప్పటికే ప్రస్తుతం చెన్నై, ముంబై, ఢిల్లీ/గురుగ్రామ్, డెహ్రాడూన్, కటక్, లుథియానా, లక్నో, భువనేశ్వర్, చండీగఢ్, తిరువనంతపురం, నోయిడా, బెంగళూరు, మైసూరు, జైపూర్, పానిపట్, అంబాలా, జమ్ము, నాసిక్, రేవారీ, పాట్నా తదితర నగరాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. జూన్ మొదటి వారం నుండి పుదుచ్చేరి, విశాఖ, రాజమండ్రి, మధురై, తిరునల్వేలి, హైదరాబాద్, కొచ్చి, థానే, కోల్‌కతాలో అందుబాటులోకి వచ్చాయి.

కరోనా నిబంధనలకు అనుగుణంగా
కస్టమర్లు ఈ మొబైల్ ఏటీఎం ద్వారా 15 ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకోవచ్చు. రోజుకు మూడు నుండి నాలుగు చోట్ల ఈ మొబైల్ ఏటీఎం సేవలు అందిస్తుంది. ఈ మొబైల్ ఏటీఎం సేవలు కరోనా నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. ఏటీఎం నుండి నగదు తీసుకునే సమయంలో సామాజిక దూరం పాటించడం వంటివి ఉంటాయి. ఉద్యోగులు, కస్టమర్ల భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకున్నారు.

ఎంతగానో ఉపయోగపడతాయి
ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో బ్యాంకులో నగదు ఉండి, చేతిలో లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఈ మొబైల్ ఏటీఎం సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని, బ్యాంకు గ్రూప్ హెడ్ (లయబిలిటీ ప్రోడక్ట్స్, థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్, నాన్ రెసిడెంట్ బిజినెస్) సంపత్ కుమార్ అన్నారు.


Click it and Unblock the Notifications