ఇదెక్కడి టి అండి బాబు.. కప్పు సాసర్ టికి లక్ష బిల్.. జీవితంలో చూసి ఉండరు..
మీరు చాలా రకాల టీలు తాగి ఉంటారు. గ్రీన్ టీ, స్ట్రాంగ్ టీ, లేమన్ టి, జింజర్ టి ఇలా ఎన్నో రకాల టి మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. భారతీయులు పొద్దున్న లేవగానే అలాగే సాధారణంగా కూడా టి తాగేందుకు ఎక్కువగా ఇష్టపడతరు. టి తాగడం వల్ల మన శరీరానికి కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
.కానీ దుబాయ్‌లో లక్ష రూపాయలకు దొరుకుతున్న టీ ఒకటి ఉందని మీకు తెలుసా. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో దర్శనం ఇస్తుంది, అందులో ఒక ఫుడ్ వ్లాగర్ కేఫ్-రెస్టారెంట్ అత్యంత ఖరీదైన టీ గురించి చెబుతుంటుంది. ఈ టీ పేరు గోల్డెన్ టి.

ఈ గోల్డ్ టీ చాలా ప్రత్యేకం. ఈ వైరల్ వీడియోలో ఫుడ్ వ్లాగర్ ఈ టీని స్వచ్ఛమైన వెండి టి కప్పు, సాసర్ లో అందిస్తారని ఇంకా పఫ్ పై గోల్డ్ డస్ట్ అండ్ టి పై లైట్ గోల్డ్ పేపర్ ఉంటుందని చెప్పారు. అలాగే గోల్డ్ డస్ట్ క్రోసెంట్‌తో వస్తుంది. ఇవన్నీ మీరు తన ఇంస్టాగ్రామ్ వీడియోలో చూడవచ్చు.
ఇంకా ఈ వీడియోలో ఒక అమ్మాయి కేఫ్‌లో కూర్చుని టీ తాగుతుంటుంది. ఆమె తాగుతున్న టీ పేరు 'గోల్డ్ కడక్' దీని ధర 5000 AED అంటే మనకు భారతీయ కరెన్సీలో రూ. 1 లక్ష 14 వేల 750కి లభిస్తుంది. టీ తాగిన తర్వాత టి కప్పును మనతో పాటు ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఆ అమ్మాయి ఈ టీ గురించి మాట్లాడుతు ఈ కేఫ్-రెస్టారెంట్ పేరు బోహో కేఫ్. ఈ టీని స్వచ్ఛమైన వెండి కప్పుల్లో మీ అందిస్తారు. అయితే టీ పైభాగంలో 24 క్యారెట్ల బంగారంతో కూడిన పేపర్ షీట్ ఉన్నందున టీ కూడా చాలా వెరైటీగా, కొత్తగా ఉంటుంది. వీడియోలో టీ తాగిన తర్వాత ఈ వెండి కప్పు-సాసర్ ను కూడా మన వెంట తీసుకెళ్లవచ్చని ఆ అమ్మాయి చెబుతుంది.
సోషల్ మీడియాలో ఈ వీడియోపై జనాలు స్పందిస్తున్నారు ఇంకా వందల మంది ఈ వీడియోను చూడగా వీడియోకి 800పైగా లైక్స్ ఇంకా దీనిపై కామెంట్స్ చేసారు. కామెంట్స్ లో ఒకరు 'నా కలలో కూడా నేను టీ తాగడానికి EMI అప్షన్ తీసుకోవాల్సి ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు,' అని మరొకరు 'టీ తాగడం కేవలం డబ్బు వృధా' అంటూ పోస్ట్ చేసారు.


Click it and Unblock the Notifications