Postal scheme: రూ.14 లక్షలు కావాలా.. రోజూ కేవలం రూ.95 డిపాజిట్ చేస్తే చాలు..!
Gram Sumangal Scheme: రిస్క్ లేకుండా పొదుపు మంత్రాన్ని పాటించే వారి సంఖ్య భారతదేశంలో ఎక్కువేనని చెప్పుకోవాలి. అలాంటి వారికోసం ఎల్లప్పుడూ తపాలా శాఖ ఆకర్షనీయమైన స్కీమ్స్ ప్రవేశపెడుతూనే ఉంది. అందుకే తక్కువ ఖర్చుతో మంచి రక్షణను అందించే గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్టాఫీసు గ్రామ సుమంగళ్ స్కీమ్..
కరోనా తర్వాత ఇన్సూరెన్స్ చాలా మంది ప్రారంభిస్తున్నారు. అయితే తక్కువ ఖర్చులో గ్రామీణులకు అందుబాటులో ఉన్న పోస్టల్ స్కీమ్ సమాచారాన్ని చూద్దాం. ఇందులో రోజుకు కేవలం రూ.95 చెల్లింపుతో ఏకంగా రూ.14 లక్షలను పొందొచ్చు. ఇదొక మనీ బ్యాక్ ప్లాన్ కావటం విశేషం. అందుకే గ్రామీణ ప్రజల్లో ఇది మంచి ఆదరణ పొందుతోంది.

మహిళలకు ప్రయోజనం..
ఈ స్కీమ్ ద్వారా మహిళలు ఆర్థిక సహాయం పొందవచ్చు. గ్రామీణ
ప్రాంతాల్లోని ప్రజలు మాత్రమే ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు అర్హులు. ఎలాంటి ఇన్సూరెన్స్ స్కీమ్స్ కింద కవరేజ్ పొందని వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. పైగా ప్రజల సొమ్ముకు ప్రభుత్వ హామీ ఉన్నందున ఈ పథకంలో పెట్టుబడులు పెట్టడం పూర్తిగా సురక్షితమైనది.

స్కీమ్ ప్రయోజనాలు..
* స్కీమ్ లోని అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే పాలసీదారులు మెచ్చూరిటీకి ముందుగా మరణిస్తే నామినీకి హామీ మెుత్తం చెల్లించబడుతుంది.
* ఈ స్కీమ్ కింద పెట్టుబడి పెట్టటానికి 19 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులు అర్హులు.
* 1995లో ప్రారంభమైన స్కీమ్ లో 15 లేదా 20 ఏళ్ల కాలానికి పెట్టుబడి పెట్టవచ్చు

పెట్టుబడిపై రాబడి..
ఎవరైనా పాలసీదారు 15 ఏళ్ల టర్మ్‌తో పాలసీ తీసుకున్నట్లయితే.. వారు 6, 9, 12 ఏళ్ల పాలసీ టర్మ్స్‌లో 20 శాతం చొప్పున డబ్బు తిరిగి పొందుతారు. మిగిలిన 40 శాతం డబ్బులు మెచ్యూరిటీ సమయంలో పాలసీదారులు అందుకుంటారు. అదే 20 ఏళ్ల కాల పరిమితితో పాలసీ తీసుకుంటే.. 8, 12, 16 ఏళ్లలో పాలసీ డబ్బులు 20 శాతం, మిగతా 40 శాతం డబ్బులు మెచ్యూరిటీ సమయంలో అందుకుంటారు.

25 ఏళ్ల వయస్సులో..
ఉదాహరణకు ఎవరైనా పాలసీదారుడు ఈ స్కీమ్ కింద తన 25వ ఏట నమోదు చేసుకున్నట్లయితే. అతని పాలసీ హామీ మెుత్తం లక్ష రూపాయలతో 20 ఏళ్ల కాలానికైతే అతను రూ.14 లక్షలు పొందుతాడు. ఈ లెక్కల అతను పాలసీ కాలంలో నెలకు రూ.2,853 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అంటే రోజుకు సుమారు రూ.95 అన్నమాట. ఈ మెుత్తంలో 60 శాతం డబ్బు మనీ బ్యాక్ రూపంలో ఇవ్వబడుతుంది.


Click it and Unblock the Notifications