Vehicle Insurance: వాహనదారులకు షాక్, ఇన్సురెన్స్ ప్రీమియం ధరలు ప్రియం
వాహన బీమా కవరేజీ మరింత పెరగనుంది. ఈ మేరకు థర్డ్ పార్టీ మోటార్ ఇన్సురెన్స్ ప్రీమియం పెంపుకు సంబంధించి ఇన్సురెన్స్ అండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా డ్రాఫ్ట్ ప్రీమియం రేట్లను సవరిస్తూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ధరలు వస్తున్నాయి. కోవిడ్ 19 నేపథ్యంలో 2020 నుండి మారటోరియం అనంతరం సవరించిన థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ ప్రీమియం రెట్లు ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి వస్తాయని తెలుస్తోంది.

డిస్కౌంట్
గతంలో ఇన్సురెన్స్ రెగ్యులేటర్ IRDAI టీడీ రేట్లను నోటీఫై చేసేది. తొలిసారి ఐఆర్‌డీఏఐతో సంప్రదించిన అనంతరం రోడ్డు రవాణా శాఖ ఈసారి నోటీఫై చేయనుంది. డ్రాఫ్ట్ నోటీఫికేషన్ ప్రకారం ఎలక్ట్రిక్ ప్రయివేటు కార్లు, ఎలక్ట్రిక్ టూవీలర్లు, ఎలక్ట్రిక్ రవాణా వాణిజ్య వాహనాలు, ప్రయాణీకులను చేరవేసే ఎలక్ట్రిక్ వాహనాలకు ఇన్సూరెన్స్ ప్రీమియంలో 15 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు.
వాహనానికి స్వంతంగా చేసుకునే డ్యామేజ్ మినహా మిగతా డ్యామేజీలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవర్ లభిస్తుంది. దీనిని తప్పనిసరిగా తీసుకోవాలి. స్వంత డ్యామేజ్ కవర్ కోసం వాహన యజమాని బీమా సాధనాన్ని కొనుగోలు చేయాలి. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై మార్చి 14వ తేదీలోగా ప్రభావిత వ్యక్తుల సూచనలను మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది.

ఫోర్ వీలర్ కొత్త ధరలు
కొత్త ధరల ప్రకారం ప్రయివేటు కార్లు 1000-CC అయితే ప్రీమియం రూ.2094. 1500-CC అయితే రూ.3416. 1500-CC పైన అయితే ప్రీమియం రూ.7897.

టూ-వీలర్ కొత్త ధరలు
టూవీలర్ ధరల విషయానికి వస్తే 150-CC నుండి 350-CC వరకు ప్రీమియం రూ.1366. 350-CC కంటే పైన టూవీలర్ అయితే రూ.2804.

కమర్షియల్ వెహికిల్ ధరలు
పబ్లిక్ కమర్షియల్ వెహికిల్స్ క్యారియింగ్ గూడ్స్ ప్రీమియం రూ.16,049 నుండి రూ.44,242 వరకు ఉంది. అంటే గ్రాస్ వెహికిల్ వెయిట్ ఆధారంగా ఉంటుంది. ప్రయివేటు అయితే ప్రీమియం రూ.8510 నుండి రూ.25,038 మధ్య ఉంది.

లాంగ్ టర్మ్ ఇన్సురెన్స్
కొత్త కార్లకు త్రీ-ఇయర్ సింగిల్ ప్రీమియం అయితే ఆకర్షణీయ ప్రీమియం ధర రూ.6521 నుండి రూ.24,596 మధ్య ఉంది. కొత్త టూవీలర్స్ ఫైవ్-ఇయర్ సింగిల్ ప్రీమియం అయితే రూ.2901 నుండి రూ.15,117 మధ్య ఉంది.


Click it and Unblock the Notifications