సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మీ ప్రొఫైల్‌ను భద్రంగా ఉంచే ప్రక్రియను సులభతరం చేయనుంది. ఇప్పుడు కొత్త ఫీచర్‌ను ప్రవేశ పెట్టింది. దీని ద్వారా మీరు మీ ప్రొఫైల్‌ను లాక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. దీంతో మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్ మరింతగా మీ నియంత్రణలో ఉంటుంది. ప్రొఫైల్‌ను లాక్ చేయడం అంటే మీరు మల్టిపుల్ ఎగ్జిస్టింగ్ ప్రైవసీ సెట్టింగ్స్ అందుబాటులో ఉంటాయి.

వ్యక్తిగత వివరాలు చూడకుండా..
పేస్‌బుక్ యూజర్లకు ప్రొఫైల్ సెక్యూరిటీకి సంబంధించి ఈ సరికొత్త ఫీచర్ ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగా ఫ్రెండ్స్ లిస్టులో లేని వ్యక్తులు వ్యక్తిగత వివరాలను చూడకుండా యూజర్లు తమ ప్రొఫైల్‌ను లాక్ చేసుకోవచ్చు. ఇందుకు ప్రైవసీ సెట్టింగ్స్‌లో కొద్దిపాటి మార్పులు చేస్తే సరిపోతుందని సోషల్ మీడియా దిగ్గజం తెలిపింది. రెండు వారాల్లో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పింది.

.. ప్రొఫైల్ లాక్డ్ అని వస్తుంది
ఫేస్‌బుక్ అకౌంట్ కలిగినవారు ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేస్తే మీ ఫ్రెండ్స్ లిస్టులో లేని వ్యక్తులు తెలుసుకునే అవకాశం ఉండదు. వ్యక్తిగత వివరాలకు సెక్యూరిటీ ఉంటుంది. మీ ప్రొఫైల్ వివరాలు, కవర్ ఫోటోలు డౌన్ లోడ్ చేయడం, వాటిని షేర్ చేయడం, మీ అకౌంట్‌లోని ఫోటోలు చూడటం, మీ టైమ్ లైన్‌లో పోస్టులు చేయడం వంటివి అవతలి వారికి సాధ్యం కాదు. మీరు ప్రొఫైల్ లాక్ చేస్తే మీ ప్రొఫైల్ లాక్డ్ అని వస్తుంది.

ప్రొఫైల్ లాక్ ఇలా చేయండి...
- మీ ప్రొఫైల్‌లోకి వెళ్లండి.
- ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో మీ పేరు కింద More ఆప్షన్ ఉంటుంది.
- ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే Lock Profile ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- కన్ఫర్మేషన్ పేజ్ పైన లాక్ యువర్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయాలి.
- ఒకవేళ మీరు మీ ప్రొఫైల్‌ను అన్ లాక్ చేయాలనుకుంటే.. Your Profile is Locked పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత కన్ఫర్మేషన్ పేజ్ పైన అన్ లాక్ యువర్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయాలి.

అందుకే ఈ కొత్త ఫీచర్
ఫేస్‌బుక్ యూజర్ల వ్యక్తిగత భద్రతకు సంబంధించి మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని, ఇండియాలో ఎక్కువమంది, ముఖ్యంగా మహిళలు తమ పర్సనల్ సమాచారం గోప్యతకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. దీనిని మరింత మెరుగుపరుస్తామని వెల్లడించింది.


Click it and Unblock the Notifications