ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం (EPS) పెన్షనర్లకు ప్రత్యేక నెంబర్ లేదా కోడ్ ఇస్తుంది. ఇది పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందేందుకు సహాయపడేలా ఉంటుంది. అలాంటి కోడ్ లేదా సంఖ్యను పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (PPO) అంటారు. దీనిని EPFO ఏ సంస్థకు చెందిన ఉద్యోగికైనా కేటాయిస్తుంది.

PPO నెంబర్ మరిచిపోతే..
తన పదవీ విరమణ తర్వాత EPFO ఉద్యోగులకు ఓ లేఖ పంపిస్తుంది. అందులో ఉద్యోగికి సంబంధించిన PPO, ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ పంపిణీ వివరాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా PPO నెంబర్‌ను మరిచిపోతే.. దానిని మీ బ్యాంక్ ఖాతా నెంబర్ నుండి లేదా మీ నెంబర్ ఐడీని ఉపయోగించి సులభంగా పొందవచ్చు. మరిచిపోయిన PPO నెంబర్‌ను ఇలా పొందవచ్చు.

ఇలా చేయండి..
- తొలుత EPFO వెబ్ సైట్‌లోకి వెళ్లాలి. www.epfindia.gov.in
- పేజీలో ఎడమ వైపున ఆన్‌లైన్ సర్వీసెస్‌లోని Pensioners Portal పైన క్లిక్ చేయాలి.

మరో పేజీ ఓపెన్ అయ్యాక...
- మరో పేజీలో.. వెల్‌కం టు పెన్షనర్స్ పేజీ అని కనిపిస్తుంది. అక్కడ Know your PPO No పైన క్లిక్ చేయాలి.
- అక్కడ మీ పెన్షన్‌తో లింక్ అయి ఉన్న బ్యాంకు అకౌంట్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి.
- తర్వాత సబ్‌మిట్ చేయాలి. అప్పుడు మీకు PPO నెంబర్, మెంబర్ ఐడీ, పెన్షన్ విధానం వివరాలు కనిపిస్తాయి.

ఇలా కూడా తెలుసుకోవచ్చు
- లేదంటే నేరుగా https://mis.epfindia.gov.in/PensionPaymentEnquiry/ లింక్ పైన PPO వివరాలు పొందవచ్చు.
- ఇందులో జీవన్ ప్రమాణ్ ఎంక్వయిరీ, నో యవర్ PPO నెంబర్, PPO ఈక్విటీ/పేమెంట్ ఈక్విటీ, నో యువర్ పెన్షన్ స్టేటస్ వంటి వివరాలు తెలుసుకోవచ్చు.

అలా పెన్షన్ డబ్బులు ఆలస్యమయ్యే ఛాన్స్
పెన్షన్లు వారి PPO నెంబర్‌ను బ్యాంకులు పాస్‌బుక్‌లో రికార్డ్ చేశాయా లేదో చూసుకోవాలి. ఒకవేళ బ్యాంకులు పీపీవో నెంబర్‌ను అప్ డేట్ చేయకుంటే అప్పుడు పెన్షనర్లు చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పెన్షన్ డబ్బులు ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి.

అలా ఆలస్యం కావొచ్చు..
పెన్షన్ ఖాతాను ఒక బ్యాంకు ఖాతా నుంచి లేదా ఒక బ్రాంచీ నుంచి మరో బ్యాంకుకు లేదా మరో బ్రాంచీకి బదలీ చేసే సమయంలో PPO నెంబర్‌ను పాస్‌బుక్‌లో అప్ డేట్ చేయకుంటే పెన్షన్ ఆలస్యం కావొచ్చు. ఒరిజినల్ PPO మిస్ అయితే డూప్లికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా ఆలస్యం కావొచ్చు.

PPO నెంబర్ కలిగి ఉంటే
PPO నెంబర్ కలిగి ఉంటే ఈపీఎఫ్ఓకు ఫిర్యాదు చేయడం కూడా సులభం. సమస్య పరిష్కారం కోసం UAN లేదా PPO నెంబర్ అవసరమవుతాయి. పెన్షన్ స్టేటస్ ఆన్ లైన్ ద్వారా తెలుసుకునేందుకు కూడా PPO అవసరం. బ్యాంకు అకౌంట్ ఉపయోగించి PPO నెంబర్ పొందడం పెన్షనర్లకు సులభం. అలాగే దీంతో పెన్షన్ తీసుకోవడంలో ఆలస్యాన్ని కూడా నివారించవచ్చు.


Click it and Unblock the Notifications