EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వాట్సాప్ ద్వారా పీఎఫ్ సేవలు..!
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన 74వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నవంబర్ 1 ఆదివారం నాడు న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ కార్యక్రమాలను కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రారంభించనున్నారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇటీవల విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో వివరించిన సంగతి తెలిసిందే. అర్హులైన చందాదారులకు ప్రావిడెంట్ ఫండ్ సేవలను మరింత అందుబాటులోకి సౌకర్యవంతంగా తీసుకురావడానికి సంస్థ చేస్తున్న ప్రయత్నాలలో ఈ కార్యక్రమానికి ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
రూ.1,000 వరకు నిల్వలు ఉన్న అర్హతగల నిష్క్రియాత్మక EPF ఖాతాల ఆటోమేటిక్ సెటిల్మెంట్, అలాగే వాట్సాప్ ద్వారా EPFO సేవలను ప్రవేశపెట్టడం వంటి వాటిపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ప్రతిపాదిత ఆటోమేటిక్ సెటిల్మెంట్ కార్యక్రమంలో రూ.1,000 వరకు నిల్వలు ఉన్న అర్హతగల నిష్క్రియాత్మక EPF ఖాతాలు ఆటోమేటిక్‌గా సెటిల్ చేయనున్నారు. అర్హులైన సభ్యులు ఎక్కువ సమయం పట్టే ప్రత్యేక పరిష్కార ప్రక్రియ ద్వారా వెళ్ళవలసిన అవసరం లేకుండా, చిన్న, నిష్క్రియ ఖాతా బ్యాలెన్స్‌లు క్లియర్ అయ్యేలా చూడటంలో ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడనుంది.

సభ్యులు పీఎఫ్ సేవలను సులభంగా ఈపీఎఫ్ఓ వాట్సాప్ ద్వారా కూడా సేవలను ప్రవేశపెట్టనుంది. తమ సేవలను మరింత సౌకర్యవంతంగా మార్చడానికి ఈ చర్యలు చేపట్టింది. మంత్రిత్వ శాఖ పత్రికా ప్రకటనలో వివరణాత్మక అర్హత ప్రమాణాలను లేదా వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉన్న సేవల పూర్తి జాబితాను పేర్కొనలేదు. వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో భవిష్య నిధి అవార్డ్స్ 2026 ప్రదానం కూడా ఉంటుంది. ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాలు, జోనల్ కార్యాలయాలు, అధికారులు, ఉద్యోగుల అత్యుత్తమ సేవలను మాండవియా గుర్తించి అభినందిస్తారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications