EPFO News: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మారిన పీఎఫ్ విత్‌డ్రా రూల్స్.. ఎంతంటే..??
EPFO Rules: ప్రస్తుత కాలంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు పీఎఫ్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఉద్యోగుల భవిష్య నిధిలో భవిష్యత్తు కోసం దాచుకున్న సొమ్ము ఉపసంహరణకు సంబంధించిన రూల్స్ ప్రస్తుతం మారాయి.
వివరాల్లోకి వెళితే.. EPFO తాజా నిర్ణయం ఉద్యోగులకు పెద్ద ఉపశమనాన్ని అందిస్తోంది. పీఎఫ్ సొమ్ము ఉపసంహరణ నిబంధనలను ఈపీఎఫ్‌వో మార్చింది. దీంతో ఇప్పుడు ఈపీఎఫ్ విత్ డ్రా పరిమితి రెట్టింపు అయ్యింది. భవిష్య నిధి సంస్థ వైద్య సంబంధిత అడ్వాన్సుల ఉపసంహరణ నిబంధనలను మార్చింది. గతంలో వైద్య అవసరాల కోసం నిధి నుంచి క్లెయిమ్ పరిమితి రూ.50,000గా మాత్రమే ఉండేది. అయితే ఏప్రిల్ 16న చేసిన సర్క్యులర్ ప్రకారం ఈ విత్ డ్రా పరిమితి రూ.లక్షకు పెంచబడిందని ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది.

అంటే EPFO జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం చందాదారులు ఇప్పుడు రూ.లక్ష విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌వో ఫారమ్ 31లోని పారా 68J కింద ఉపసంహరణ పరిమితిని రెట్టింపు చేసింది. ఫారమ్ 31 పాక్షిక ఉపసంహరణ కోసం వినియోగిస్తారు. అనేక కారణాల వల్ల ముందస్తు ఉపసంహరణ కోసం ఈ ఫారమ్ ఉపయోగించబడుతుంది. ఇందులో ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు కొనడానికి, పెళ్లి చేసుకోవడానికి, వైద్యం చేయించుకోవడానికి డబ్బును తీసుకోవచ్చు. అనారోగ్య సమస్యలకు చికిత్స కోసం చందాదారులు తమ పీఎఫ్ మెుత్తం నుంచి ఫారమ్ 31 కింద ఇకపై పెంచబడిన పరిమితుల ప్రకారం రూ.లక్షను విత్ డ్రా చేసుకోవచ్చనే వార్త చాలా మందికి పెద్ద ఊరటను కలిగిస్తోంది.
EPFO ప్రకారం ఖాతాదారులు ఈ డబ్బును ప్రాణాంతక వ్యాధులకు మాత్రమే ఉపయోగించగలరు. ఉద్యోగి లేదా అతని రోగి ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగి తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రిలో లేదా ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న ఏదైనా ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాలి. అదే సమయంలో రోగిని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్లయితే.. మొదట అతన్ని పరీక్షించి ఆపై పీఎం సొమ్మును క్లెయిమ్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications