2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF)పై వడ్డీ రేటును 8.5 శాతం ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌పై 8.5 శాతం చొప్పున వడ్డీ జమ చేయాలని ఈ ఏడాది మార్చిలో EPFO నిర్ణయ మండలి కేంద్ర ధర్మకర్తల బోర్డు ప్రతిపాదించింది. ఇందుకు కార్మిక శాఖ సమ్మతించింది. తాజాగా ఈ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ నుండి ఆమోదం లభించినట్లుగా చెబుతున్నారు. దీంతో 6 కోట్లకు పైగా ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు ప్రయోజనం చేకూరుతుంది. దీపావళి సమయంలో పీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు ఇది గుడ్‌న్యూస్. అయితే ఈ పీఎఫ్‌ను వివిధ మార్గాల్లో చెక్ చేసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాం.

ఉమాంగ్ యాప్ ద్వారా
మొబైల్ ఫోన్‌లోని ఉమాంగ్ యాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ మొత్తాన్ని చెక్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా వివిధ ప్రభుత్వ పథకాలు, సేవలకు యాక్సెస్ కావొచ్చు. అంటే ప్రభుత్వ పథకాలకు అన్నింటికి ఒకే ప్లాట్‍ఫాం ఉమాంగ్. ఇందులో ఈపీఎప్ పాస్‌బుక్‌ను చూడవచ్చు. ఈపీఎఫ్ క్లెయిమ్స్‌ను రెయిజ్ చేయవచ్చు, ట్రాక్ చేయవచ్చు. ఉమాంగ్ యాప్‌ను డౌన్ లోడ్ చేసిన తర్వాత ఈపీఎఫ్ మెంబర్స్ వన్ టైమ్ పాస్ వర్డ్ రిజిస్ట్రేషన్ అవసరం.
ఈ యాప్‌లోని ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్ విభాగంలోకి వెళ్లి 'వ్యూ పాస్‌బుక్‌ను క్లిక్ చేయాలి. మీ UAN నెంబర్‌తో పాటు మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. అప్పుడు కనిపించే మెంబర్ ఐడీని క్లిక్ చేయడం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్‌ను పొందొచ్చు. అయితే, మీ పీఎఫ్ ఖాతాతో మొబైల్ నెంబర్ ముందే జత చేసి ఉండాలి.

ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా
EPFO సభ్యత్వ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న మెంబర్స్ epfindia.gov.in/site_en/index.php వెబ్‌సైట్‌కు వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అందులో 'Our Services'లోకి వెళ్లి, For Employees పైన క్లిక్ చేయాలి. 'Member Passbook' under 'Services' విభాగంలోకి నెళ్లాలి. అప్పుడు UAN నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయడం కోసం మరో పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. వివరాలు ఎంటర్ చేసి, మీ ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు.

ఎస్సెమ్మెస్ ద్వారా
UAN యాక్టివేట్ చేసుకున్న సబ్‌స్క్రైబర్లు ఈపీఎఫ్ రిజిస్టర్డ్ మొబైల్ ద్వారా 'EPFOHO UAN' అని టైప్ చేసి 77382 99899 నెంబర్‌కు ఎస్సెమ్మెస్ పంపించాలి. ఈ సదుపాయం పది ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంది. తెలుగులో కావాలంటే EPFOHO UAN TEL అని ఎస్సెమ్మెస్ పంపించాలి. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, పంజాబీ, గుజరాతి, మరాఠీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, బెంగాళీ భాషల్లో ఉంది.

మిస్డ్ కాల్ ద్వారా
EPFO రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. మీరు మిస్డ్ కాల్ ఇచ్చాక ఓ రింగ్ అయి కట్ అవుతుంది. కాసేపటికి మీ బ్యాలెన్స్ ఎస్సెమ్మెస్ రూపంలో వస్తుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications