నిద్రలో కోట్లు చిటికెలో ట్రాన్స్ఫర్..చూసేసరికి షాక్..ఎంత ట్రాన్స్ఫర్ అయ్యిందంటే..?
జర్మనీలోని ఓ బ్యాంకులో 2012లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. అలసిపోయిన ఓ ఉద్యోగి పనిలో నిద్రపోయాడు. దింతో అతని వేలు కీబోర్డుపై నంబర్లను నొక్కుతూనే ఉంది. ఈ కారణంగా, 64.20 యూరోలకు బదులుగా 222,222,222.22 యూరోలు (సుమారు 222 మిలియన్ యూరోలు) ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఈ తప్పిదం మొత్తం విలువ దాదాపు రూ.2,000 కోట్లు. అదే టైంలో మరో ఉద్యోగి సకాలంలో పస్పందించి డబ్బు ట్రాన్స్ఫర్ పూర్తి కాకముందే ఆగిపోయెలా చేసాడు. ఇది ఈ పాత కథ ఆయిన ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది. క్లర్క్ సూపర్‌వైజర్ ఈ పొరపాటు లావాదేవీని అంగీకరించారు. చివరకు ఆ బ్యాంకు అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో కోర్టులో న్యాయపోరాటం మొదలైంది.
హెస్సీ రాష్ట్రంలోని లేబర్ కోర్ట్ ఇప్పుడు సూపర్‌వైజర్‌ను తిరిగి నియమిస్తూ తీర్పునిచ్చింది. అలాగే తప్పు చేసిన సూపర్‌వైజర్‌ను ఉద్యోగం నుంచి తొలగించడం సరికాదని తెలిపింది. అంతేకాదు ప్రతిరోజూ వందలాది ట్రాన్సక్షన్స్ చూసుకోవాల్సి వస్తుంటుంది, పని ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు అతను 812 డాకుమెంట్స్ చెక్ చేసాడు, ఒక్కోదానికి కొన్ని సెకన్లు మాత్రమే తీసుకున్నాడు ఇంత తక్కువ సమయంలో పూర్తి ఇన్వెస్టిగేషన్ జరపడం కష్టం అని తెలిపింది.

సూపర్‌వైజర్‌కు అనుకూలంగా కోర్టు
సూపర్‌వైజర్ ఉద్దేశపూర్వకంగా లేదా నిర్లక్ష్యంగా తప్పు చేయలేదని కోర్టు పేర్కొంది. అతడిని తొలగించే బదులు వార్నింగ్ ఇచ్చి ఉండాల్సింది. అతడిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని కోర్టు బ్యాంకును ఆదేశించింది. బ్యాంకు అంచనాలు ఆచరణ సాధ్యం కాదని కోర్టు పేర్కొంది. ఆటోమేటెడ్ ఎర్రర్-డిటెక్షన్ సిస్టమ్ లేకపోవడం వల్ల కూడా ఈ పొరపాటు జరిగిందని వెల్లడించింది.
ఈ ఘటన బ్యాంకు లోపాలను బట్టబయలు చేసింది. మెరుగైన భద్రతా చర్యలు ఇటువంటి పొరపాట్లను నిరోధించవచ్చని ఆన్‌లైన్ యూజర్స్ వ్యక్తం చేస్తున్నారు. ఆటోమేటెడ్ ఫ్లాగింగ్ సిస్టమ్ ద్వారా ఇంత భారీ మొత్తాలకు సంబంధించిన లావాదేవీలు గుర్తించవచ్చు. దీనికి అదనపు వెరిఫికేషన్ అవసరం కూడా.
సూపర్‌వైజర్‌పై అన్ని నిందలు
సూపర్‌వైజర్‌పైనే నిందలు వేయడంపై ప్రజలు కూడా ప్రశ్నలు కురిపోయించారు. చాలా ట్రాన్సక్షన్ చూసుకోవాల్సి వస్తుంటుంది అలాగే బ్యాంకు పని తీరు, భద్రతా చర్యలు లేకపోవడం కూడా కారణమని అన్నారు. కొందరు సూపర్‌వైజర్‌పై విమర్శలు గుప్పించారు. ఇలాంటి తప్పులను పట్టుకోవడమే అతని పని అని అనగా మరికొందరు అతని పని ఒత్తిడిని చూసి సానుభూతి వ్యక్తం చేశారు. ఇతర దేశాల బ్యాంకులకు పెద్ద మొత్తంలో క్యాష్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒకరి ఆమోదం అవసరమని పలువురు తెలిపారు.
విసిగి పోయిన గుమస్తా పొరపాటు కారణంగా ఈ ఘటన మొదలైంది. కానీ బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను బయటపెట్టింది. అంతేకాదు సూపర్‌వైజర్‌ను తొలగించి తిరిగి విధుల్లోకి తీసుకోవడం చర్చకు దారితీసింది. ఇది కేవలం మానవ తప్పిదమా? లేక వ్యవస్థలో కూడా లోపాలున్నాయా? ఆటోమేషన్ అండ్ మెరుగైన భద్రతా చర్యల అవసరాన్నీ నొక్కిచెప్పారు. ఈ ఘటన ఒక గుణపాఠం. చిన్న పొరపాటు పెద్ద పరిణామాలను కలిగిస్తుందని ఇది చూపిస్తుంది. ఇలాంటి పొరపాట్లు జరగకుండా వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టెక్నాలజీ ఉపయోగించడం, పనిభారాన్ని తగ్గించడం ద్వారా మానవ తప్పిదాలను తగ్గించవచ్చు. దీనివల్ల కస్టమర్ల డబ్బు సురక్షితంగా ఉండడమే కాకుండా ఉద్యోగులపై అనవసర ఒత్తిడి ఉండదు.


Click it and Unblock the Notifications