మీ ఇంట్లో ల్యాండ్ లైన్ ఉందా? ల్యాండ్ లైన్ నుండి మొబైల్ నెంబర్‌కు ఫోన్ చేస్తున్నారా? అయితే జనవరి 1, 2021 నుండి ఫోన్ నెంబర్ డయల్ చేయడానికి ముందు సున్నాను కలపవలసి ఉంటుంది. వచ్చే ఏడాది నుండి ఈ మేరకు సౌకర్యం అందుబాటులోకి తీసుకు రావాలని టెలికం డిపార్టుమెంట్... టెల్కోలకు సూచనలు జారీచేసింది. ఈ కొత్త విధానంలోకి మారాలని తెలిపింది. టెలికం డిపార్టుమెంట్ (DoT) ఈ మేరకు ఈ విధానానికి పచ్చజెండా ఊపింది.

జీరో జత చేయడానికి అంగీకారం
టెలికం రెగ్యులేటర్ ట్రాయ్(టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) సిఫార్సుకు టెలికం డిపార్టుమెంట్ ఆమోదం తెలిపింది. జనవరి 1వ తేదీ నుడి మొబైల్స్‌కు కాల్స్ చేసేటప్పుడు సున్నాను జత చేయాలని ట్రాయ్ చేసిన సూచనకు ఒకే చెప్పింది. టెలికం సంస్థలు కూడా ఈ కొత్త విధానంలో నెంబర్లు జారీ చేసేందుకు వీలవ్వడంతో అంగీకారం తెలిపాయి.

ఇటీవలే ఉత్తర్వులు
ల్యాండ్ లైన్ ఫోన్ల నుండి సెల్యూలార్ మొబైల్ నెంబర్ల డయలింగ్ ప్యాట్రన్‌లో మార్పులు చేయాలని, మొబైల్ నెంబర్ల ముందు సున్నాను జోడించి డయల్ చేయాలని, ఇందుకు అవసరమైన టెక్నాలజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రావాలని నవంబర్ 20వ తేదీన ట్రాయ్ ఉత్తర్వులు జారీ చేసింది. ల్యాండ్ లైన్ కస్టమర్లకు సున్నా డయలింగ్ సౌకర్యం కల్పించాలని పేర్కొంది. దీంతో ఇప్పుడు ఉన్న పది అంకెలకు ముందు సున్నాను జత చేయాలి.

2544 మిలియన్ల నెంబర్లు అదనంగా..
డయలింగ్ ప్యాట్రన్ మార్చడం వల్ల భవిష్యత్తు అవసరాల కోసం 2544 మిలియన్ల నెంబర్లు అదనంగా లభించనున్నాయి. ట్రాయ్ మే 29, 2020న సిఫార్సు చేయగా, డిపార్టుమెంటు దీనికి ఓకే చెప్పింది. అయితే ముందు జీరో యాడ్ చేయడం నేపథ్యంలో ఫోన్ నెంబర్ల అంకెలను పెంచడం కాదని తెలిపింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications