EPFO: ఉద్యోగం మారారా.. అయితే వెంటనే పీఎఫ్ ఖాతా మెర్జ్ చేసుకోండిలా..!
ఉద్యోగం చేస్తున్న దాదాపు అందరికి పీఎఫ్ ఖాతా ఉంటుంది. ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న వారికి ఒకటే పీఎఫ్ ఖాతా ఉంటుంది. కానీ ప్రైవేట్ ఉద్యోగులు చేస్తున్నవారు.. కంపెనీలు మారాల్సి ఉంటుంది. అప్పుడు పీఎఫ్ ఖాతా నంబర్ కూడా మారుతుంది. యూఏఎన్ ఒక్కటే ఉన్నప్పటికీ.. కంపెనీలు మారితే పీఎఫ్ ఖాతా నంబర్ మారుతుంది. ఇలా అనేక పీఎఫ్ ఖాతాలు ఉండడం వల్ల పలు ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మల్టీపుల్ పీఎఫ్ ఖాతాలు ఉన్నవారు వారి డబ్బంతా ఒకే ఖాతాలోకి మార్చుకోవచ్చని వివరిస్తున్నారు. ఉద్యోగులకు ఎవరికైనా మల్టీపుల్ పీఎఫ్ ఖాతాలు ఉంటే.. వెంటనే మెర్జ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఆన్ లైన్ లో ఖాతాలను ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. ఇందుకోసం ముందుగా EPFO మెంబర్ సేవా పోర్టల్ ఓపెన్ చేసి UAN నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. అనంతరం అందులో వన్ మెంబర్-వన్ ఈపీఎఫ్ అకౌంట్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అక్కడ మీ వ్యక్తిగత వివరాలు స్క్రీన్‌పై డిస్ప్లే అవుతాయి. వాటిని కన్ఫార్మ్ చేసుకోవాలి. మీ పాత అకౌంట్స్ అన్నీ ఒకే చోట చేర్చేందుకు యూఏఎన్ ఐడీ నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ మొబైల్‌కు వచ్చే వన్‌టైమ్ పాస్‌వర్డ్(OTP) ఎంటర్ చేస్తే వెరిఫికేషన్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. మీ నుంచి వెళ్లిన రిక్వెస్ట్ ప్రస్తుత ఎంప్లాయర్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఆమోదం పొందిన తర్వాత EPFO మీ రిక్వెస్ట్‌ను ప్రాసెస్ చేస్తుంది. ఒకసారి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక పాత ఖాతాల్లో ఉన్న నగదు కూడా ఒకే అకౌంట్లో జమ అవుతుంది.

ఉద్యోగం మారినప్పుడు పాత పీఎఫ్ అకౌంట్ లోని డబ్బులను కొత్త ఖాతాలోకి మార్చుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ రిటైర్మెంట్ పొదుపు అంతా ఒకేచోట సురక్షితంగా కనిపిస్తుంది. విత్‌డ్రా చేసుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. PF నిబంధనల ప్రకారం ఉద్యోగం మారినా సర్వీస్ కంటిన్యూటీ(5 ఏళ్లు) ఉండేలా చూసుకోవాలి. పాత బ్యాలెన్స్‌ను కొత్త అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మీ సర్వీస్ హిస్టరీ కంటిన్యూ అవుతుంది. 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి కాకముందే పీఎఫ్ డ్రా చేస్తే మూలం వద్ద పన్ను కోత (TDS) పడుతుందని గుర్తుంచుకోవాలి. మెర్జ్ వల్ల ట్యాక్స్ మినహాయింపు లభించనుంది. రిటైర్మెంట్ సమయంలో పీఎఫ్ మనీ విత్‌డ్రా చేయాలంటే నిధులు ఒకచోట ఉంటే తీసుకోవడం సింపులుగా ఉంటుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
