EPFO: మీ జీతంలో పీఎఫ్ ఎంత కట్ అవుతుంది.. అందులో పెన్షన్‎కు ఎంత వెళ్తుంది..!

ఉద్యోగం చేసే దాదాపు అందరికి పీఎఫ్ ఖాతా ఉంటుంది. పీఎఫ్ ఖాతా ఉన్నవారు వారి జీతంలో నెలకు రూ. 3 వేల వరకు చందాగా చెల్లించాల్సి ఉంటుంది. జీతం రూ.25 వేలు ఆ పైన ఉంటే జీతంలో రూ.3 వేలు పీఎఫ్ చందగా వెళ్తోంది. అంటే జీతంలో అది 12 శాతానికి సమానం. మరో 12 శాతం యాజమాన్యం పీఎఫ్ ఖాతాలో జమ చేయాలి. కానీ చాలా వరకు కంపెనీలు ఉద్యోగుల జీతం నుంచి డబ్బులు కట్ చేస్తారు. అయితే జీతం నుంచి కట్ చేసే 12 శాతం సొమ్మును పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. యాజమాన్యం చెల్లించే 12 శాతం సొమ్ములో 3.67 శాతం పీఎఫ్ ఖాతాకు మిగతా 8.33 శాతం ఈపీఎస్ అంటే ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ కు వెళ్తోంది.

పెన్షన్ స్కీమ్ వెళ్లే మొత్తాన్ని అడ్వాన్స్ గా డ్రా చేసుకోలేరు. అంటే పూర్తి ఉద్యోగం మానేస్తే పెన్షన్ సొమ్మును కూడా విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే 10 ఏళ్లు లోపు సర్వీస్ ఉండి పూర్తి ఉద్యోగం మానేస్తేనే పెన్షన్ మొత్తాన్ని తీసుకోవచ్చు. మీ సర్వీస్ 10 ఏళ్లు దాటి, పీఎఫ్ కంట్రిబ్యూషన్ కూడా 10 ఏళ్లకు పైగా ఉండి ఉద్యోగం మానేస్తే పెన్షన్ డబ్బను విత్ డ్రా చేసుకోలేరు. మీకు 58 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీకున్న సొమ్మును బట్టి నెలకు కొంత మొత్తంలో పెన్షన్ రూపంలో వస్తుంది. ప్రస్తుతం పీఎఫ్ ఖాతాలో జమ అయ్యే మొత్తానికి 8.25 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. ఎలాంటి విత్ డ్రా లేకుండా ఉంటే దీర్ఘకాలంలో భారీగా సొమ్ము వచ్చే అవకాశం ఉంటుంది.

EPFO

గతంలో కనీస వేతనం రూ.15 వేలు ఉన్నప్పుడు అందులో పీఎఫ్ చందా 12 శాతంగా ఉండేది. అంటే రూ.1800 కట్ అయ్యేది. అయితే కనీస వేతనం రూ.25 వేలకు పెంచడంతో ఇందులో 12 శాతం పీఎఫ్ చందాగా కట్ అవుతుంది. అంటే రూ.3 వేలు జీతంలో కట్ అవుతాయి. అయితే చాలా వరకు డబుల్ పీఎఫ్ ఉద్యోగి ఖాత నుంచి కట్ చేస్తారు కాబట్టి... జీతంలో మొత్తం రూ.6 వేలు కట్ కానుంది. గ్రాట్యూటీ ఉంటే దానికి రూ.1000 వరకు కట్ అవుతుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ రూ.200 దీంతో అక్టోబర్ నుంచి ఉద్యోగి జీతంలో దాదాపు రూ.7,200 కట్ అయింది. ఇక నుంచి ఇదే స్థాయిలో జీతంలో డబ్బులు కట్ కానున్నాయి.

ఉదాహరణకు ఒక ఉద్యోగి జీతం రూ.45 వేలు అనుకుంటే.. డబుల్ ఫీఎఫ్ ఉద్యోగి జీతం నుంచి కట్ చేస్తే.. అతనికి గ్రాట్యుటీ ఉంటే.. రూ.45 వేలకు చేతికి రూ.37,200 వచ్చే అవకాశం ఉంది. మీరు మీ పీఎఫ్ చందాగురించి తెలుసుకోవాలంటే వాట్సాప్ కు వెళ్లి తెలుసుకోవచ్చు. వాట్సాప్ లో మీ రిజిస్ట్రర్డ్ మొబైల్ నంబర్ నుంచి 8796441800 కు హాయ్ లేదా హాల్లో అని సెండ్ చేయాలి. అప్పుడు మీకు చూస్ లాంగ్వేజ్ అని వస్తుంది. అప్పుడు లాంగ్వేజ్ సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత మెన్ ఓపెన్ అవుతుంది. దానిపై క్లి చేయాలి. అప్పుడు మీకు పీఎఫ్ బ్యాలెన్స్, చివరి 5 లావాదేవీలు, పాస్ డౌన్ లోడ్ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో ఒకటి సెలక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీ మొబైల్ నంబర్ టెక్స్ట్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే పీఎఫ్ బ్యాలెన్స్, చివరి ఐదు లావాదేవీలు, పాస్ బుక్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+