UPI Payments: పొరపాటున వేరే నంబర్‎కు యూపీఐ చేశారా.. అయితే ఈ పని చేయండి..!

దేశంలో యూపీఐ వినియోగం భారీగా పెరిగింది. చిన్న కిరాణా షాప్ నుంచి పెద్ద షాపింగ్ మాళ్ల వరకు యూపీఐ పేమెంట్ చేస్తున్నారు. ప్రపంచంలోనే భారత దేశంలో యూపీఐ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే, భీమ్, క్రెడ్ తో పాటు చాలా రకాల యూపీఐ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో యూపీఐ లావాదేవీల సంఖ్య భారీగా పెరిగింది. మారుమూల ప్రాంతాల్లో కూడా యూపీఏ లావాదేవీలు కొనసాగుతోన్నాయి. ఏదైనా షాప్ కు వెళ్లి చిల్లర లేవంటే.. ఫోన్ చేయు, గూగుల్ పే చేయు అని చెబుతున్నారు. యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు కొన్నిసార్లు తప్పులు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఫోన్ నెంబర్ తో యూపీఐ పేమెంట్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఇతర నెంబర్లకు డబ్బులు పంపడం జరుగుతుంది.

ఓ వ్యక్తి కరీంనగర్ నుంచి కారు మాట్లాడుకుని హైదరాబాద్ నాచారం ఈఎస్ఐ ఆస్పత్రికి వచ్చాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి కారు డ్రైవర్ కు యూపీఐ చేయాలని నంబర్ అడిగాడు. దీంతో కారు డ్రైవర్ నెంబర్ చెప్పాడు. ఆ నెంబర్ ను గూగుల్ పేలో టైప్ చేసి రూ.5 వేలు సెండ్ చేశాడు. అయితే డ్రైవర్ కు డబ్బులు రాలేదు. ఏమైందని చూస్తే ఒక్క నంబర్ తప్పు కొట్టడంతో మరో వ్యక్తికి డబ్బులు వెళ్లాయి. వెంటనే అతనికి ఫోన్ చేస్తే తనకు డబ్బులు రాలేదని చెప్పాడు. దీంతో సదరు వ్యక్తి మరో రూ.5 వేలు కారు డ్రైవర్ కు పంపాడు.

UPI Payments

అయితే ఇలా తప్పుడు నంబర్ కు యూపీఐ చేస్తే ఆ డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. తప్పుడు లావాదేవీ జరిగిన వెంటనే మొదటి 24 నుంచి 48 గంటల్లోకా ఫిర్యాదు చేయాలి. ఆర్బీఐ నగదు రికవరీ కోసం బ్యాంకులు, ఎన్‌పీసీఐ ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాయి. మీరు రాంగ్ యూపీఐ పేమెంట్ చేసిన వెంటనే మీరు వాడుతున్న పేమెంట్ యాప్ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంలో 'Help' లేదా 'Report a Problem' సెక్షన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత వెంటనే మీ బ్యాంకును సంప్రదించాలి. వీలైతే డైరెక్ట్ గా హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి మేనేజర్‌ను కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు చేస్తే బెటర్.

అప్పటికీ మీ పరిష్కారం కాకపోతే.. నేరుగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పోర్టల్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. వెబ్‌సైట్‌లోని Dispute Redressal Mechanismలోకి వెళ్లి.. మీరు చేసిన తప్పుడు లావాదేవీ వివరాలను ఇవ్వాలి. అలాగే ఎన్‌పీసీఐ వారి టోల్ ఫ్రీ నంబర్ 1800-120-1740 కు కాల్ చేసి కూడా మీ సమస్య గురించి కంప్లెయింట్ రైజ్ చేయవచ్చు. మీరు కంప్లెయింట్ ఇచ్చిన 30 రోజుల వరకు బ్యాంకు నుంచి సరైన సమాధానం రాకపోతే ఆర్బీఐని కూడా సంప్రదించవచ్చు. అంతే కాదు ఆర్బీఐ ఒక కొత్త నిబంధన కూడా తీసుకువచ్చు అవకాశం. యూపీఐ ద్వారా రూ.10 వేల ఎక్కువ లావాదేవీ జరిపినప్పుడు.. కొంత సమయం తర్వాత ఆ డబ్బు జమ అవుతుంది. మీరు ఒకవేళ రాంగ్ నంబర్ కు యూపీఐ చేస్తే దాన్ని వెంటనే రద్దు చేసుకోవచ్చు.

తప్పుడు లావాదేవీ జరిగితే ఫోన్ చేయవల్సిన నంబర్లు
ఫోన్ పే: 08068727374, 02268727374
గూగుల్ పే: 18004190157
పేటీఎం: 1204456456
భీమ్: 18001201740

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+