మీరు గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా..? 50 లక్షల వరకు ఫ్రీ ఇన్సూరెన్స్ ఉంటుందని మీకు తెలుసా? ఎలా అంటే..?
రేషన్ కార్డు ఆధారంగా ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ అందిస్తుంది. అందులో అర్హులైన వారికీ సబ్సిడీ కూడా ఇస్తుంది. సిలిండర్ ప్రమాదాలు ఎక్కడ, ఎలా జరుగుతాయో చెప్పాల్సిన పనిలేదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా, తెలియకుండానే చిన్న పొరపాటు వల్ల జరిగిపోతుంటుంది. ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించొచ్చు. ముఖ్యంగా వంటగదిలో ఎల్‌పిజి సిలిండర్‌కు సంబంధించి చాలా భద్రతా చర్యలు పాటించాలి. అయితే LPG ప్రమాదాలు బీమా పరిధిలోకి వస్తాయని చాలా మందికి తెలియదు. LPG ప్రమాదాల విషయంలో మీరు రూ. 50 లక్షల వరకు బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ బీమాను ఎలా క్లెయిమ్ చేయాలి? ఏదైనా ప్రమాదం జరిగితే ఎంత పరిహారం లభిస్తుంది ? అనేదానిపై చాలా మందికి ఆలోచన కూడా లేదు.
తాజాగా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎల్‌పీజీ సిలిండర్ కస్టమర్ల సంఖ్య పెరిగింది. LPG సిలిండర్లను ఉపయోగిస్తున్నప్పుడు భద్రతా చర్యలను మర్చిపోకూడదు. ఒక్కోసారి మనకు తెలియకుండానే ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ విషయంలో గ్యాస్ కంపెనీల నుంచి బీమా(ఇన్సూరెన్సు) పరిహారం భారీగా వస్తుందన్న విషయం అందరికి తెలియదు.

LPG సిలిండర్ కస్టమర్లు ప్రత్యేకంగా బీమా పాలసీ కొనాల్సిన అవసరం లేదు. మీరు ఇండేన్, హెచ్‌పి, భారత్ మొదలైన ప్రభుత్వ-యాజమాన్య గ్యాస్ కంపెనీలతో అధికారికంగా LPG కనెక్షన్ రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీకు ఇన్సూరెన్స్ ఆటోమేటిక్ గా లభిస్తుంది. దీనికి సంబంధించిన ప్రీమియం కంపెనీలే చెల్లిస్తాయి. బీమా కోసం కస్టమర్లు ప్రత్యేక చార్జెస్ చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎల్‌పీజీ వల్ల ప్రమాదం జరిగినా, ఆస్తినష్టం జరిగినా, ప్రాణ నష్టం జరిగినా బీమా క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే వంటగ్యాస్ వల్లే ప్రమాదం జరిగిందని ఖచ్చితం చేసుకోవాలి. ఏదైనా ఇతర కారణాల వల్ల ప్రమాదం జరిగితే బీమా కవర్ కాదు. దేనికి ఎంత పరిహారం లభిస్తుంది అంటే ఎల్‌పీజీ ప్రమాదంలో మరణిస్తే ఒక్కొక్కరికి రూ.6 లక్షల వరకు పరిహారం ఉంటుంది. ఒక్కో ప్రమాదానికి రూ.30 లక్షల వరకు వైద్య బీమా, ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు, తక్షణ వైద్య పరిహారంగా రూ.25 వేలు లభిస్తుంది.
ఎలా క్లెయిమ్ చేయాలి? : LPG ప్రమాదం జరిగినప్పుడు డీలర్ లేదా డిస్ట్రిబ్యూటర్‌కు ముఖ్యంగా వ్రాతపూర్వకంగా తెలియజేయాలి. అలాగే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. తరువాత జిల్లా అధికారి విచారణ చేపడతారు. LPG ప్రమాదం జరిగితే LPG డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ / ఏరియా ఆఫీస్ భీమా సంస్థ స్థానిక కార్యాలయానికి తెలియజేస్తుంది. ఆ తర్వాత సంబంధిత బీమా కంపెనీకి క్లెయిమ్ చేయబడుతుంది.


Click it and Unblock the Notifications