కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్మెంట్ తరువాత పెన్షన్ లభిస్తుంది. పెన్షన్ అనేది పదవి విరమణ తరువాత ప్రభుత్వ ఉద్యోగులకి గవర్నమెంట్ అందించే ప్రతినెల మొత్తం. ఈ పెన్షన్ ఉద్యోగులకి ఆసరాగా నిలుస్తుంది. పెన్షన్ కి సంబంధించి కోన్ని రూల్స్, రేగులేషన్స్ కూడా ఉన్నాయి. అలాగే పెన్షన్ ప్రతి ఏడాది పొందేందుకు మీరు చేయవల్సిన కొన్ని పనులు కూడా ఉన్నాయి.
ప్రతినెలలాగే పెన్షన్ పొందడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం నవంబర్ చివరిలోగా పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడం ఇప్పుడు చాలా ఈజీ. పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడానికి 3 అప్షన్స్ ఉన్నాయి. అవి పర్సనల్, ఆన్‌లైన్ లేదా డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ద్వారా

లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి కావాల్సినవి
ppo నంబర్
ఆధార్ నంబర్
బ్యాంకు అకౌంట్ వివరాలు
ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్
చివరి రోజు
80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ అక్టోబర్ 1, 2024 నుండి సబ్మిట్ చేయవచ్చు, మరికొందరికి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే ప్రక్రియ నవంబర్ 1 నుండి మొదలవుతుంది. సాధారణంగా సబ్మిట్ చేయడానికి చివరి తేదీ నవంబర్ 30.
లెట్ చేస్తే ఎం జరుగుతుంది?
నవంబర్ 30లోగా లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయకపోతే మీ పెన్షన్ ఆగిపోవచ్చు. తరువాత లైఫ్ సర్టిఫికేట్ సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్ (CPPC)కి అందిన తర్వాత మాత్రమే డబ్బు రిలీజ్ చేస్తారు.
డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపైన్
రిటైర్మెంట్ అయినా వారిని డిజిటల్‌గా ట్రాన్స్ఫామ్ చేయడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (DLC) క్యాంపైన్ 3.0ని ప్రారంభించింది. జీవన్ ప్రమాణ్ అని కూడా పిలువబడే ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ మొదటిసారిగా 2014లో ప్రకటించారు. 2021లో ఫెస్ అతేంటికేషన్ కూడా ఇందులో చేర్చారు. 1,900 క్యాంపులు, 1,100 నోడల్ అధికారుల సహాయంతో DLC క్యాంపెయిన్ 3.0 నవంబర్ 1 నుండి 30 2024 వరకు 800 భారతీయ నగరాలు, పట్టణాలలో అమలు చేస్తున్నారు. రిటైర్డ్ వ్యక్తులందరూ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB), పెన్షన్ డిస్బర్స్‌మెంట్ బ్యాంక్‌ల ద్వారా లేదా హోం ఫెసిలిటీ ద్వారా ఈజీగా సబ్మిట్ చేయవచ్చని అధికారిక ప్రకటనలో తెలిపింది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications