For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Cylinder Customers Alert: ఇండేన్ గ్యాస్ బుకింగ్ నెంబర్ మారిపోయింది..

|

ఇండేన్ గ్యాస్ బుకింగ్ నెంబర్ మారింది. నవంబర్ 1వ తేదీ నుండి కొత్త నెంబర్ అమలులోకి వచ్చింది. పాత నెంబర్ ద్వారా గ్యాస్‌ను బుక్ చేయలేరు. కస్టమర్ సౌలభ్యం కోసం ఇండియన్ ఆయిల్ దేశవ్యాప్తంగా ఇండేన్ ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ కోసం ఒక కామన్ నెంబర్‌ను ప్రారంభించింది. ఈ కామన్ బుకింగ్ నెంబర్ 7718955555. దేశానికి అంతటికీ ఇదే నెంబర్ వర్తిస్తుంది. కస్టమర్లకు 24x7 ఈ నెంబర్ అందుబాటులో ఉంటుంది.

<strong>వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ ఊరట, కమర్షియల్ సిలిండర్ ధర పెంపు</strong>వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ ఊరట, కమర్షియల్ సిలిండర్ ధర పెంపు

ఇండేన్ ఎల్పీజీ గ్యాస్ రీఫిల్ కొత్త నెంబర్ ఇదే

ఇండేన్ ఎల్పీజీ గ్యాస్ రీఫిల్ కొత్త నెంబర్ ఇదే

ఇండెన్ ఎల్పీజీ గ్యాస్ రీఫిల్ కోసం టెలికం సర్కిల్ నిర్దిష్ట ఫోన్ నెంబర్ వ్యవస్థను 31-01-2020 అర్ధరాత్రి తర్వాత నిలిపివేయబడిందని, ఎల్పీజీ రీఫిల్స్ కోసం కామన్ బుకింగ్ నెంబర్ 7718955555 అమల్లోకి వచ్చినట్లు మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచరల్ గ్యాస్ ప్రకటించింది.

కస్టమర్లకు ఊరట

కస్టమర్లకు ఊరట

కామన్ గ్యాస్ రీఫిల్ బుకింగ్ ఫోన్ నెంబర్ ద్వారా కస్టమర్లకు ఎంతో ప్రయోజనం ఉంది. కస్టమర్ ఓ టెలికం సర్కిల్ నుండి మరొక ప్రాంతానికి వెళ్లినప్పుడు ఇండేన్ రీఫిల్ బుకింగ్ ఫోన్ నెంబర్ యథాతథంగా ఉంటుంది. ఇండెన్ ఎల్పీజీ బుకింగ్ కస్టమర్ రిజిస్టర్ నెంబర్‌ను మాత్రమే ఉపయోగించి చేయాలి.

ఈ నెల నుండే ఓటీపీ విధానం

ఈ నెల నుండే ఓటీపీ విధానం

ఇదిలా ఉండగా, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(LPG) హోమ్ డెలివరీ సిస్టమ్‌లో నవంబర్ 1వ తేదీ నుండి మార్పు చోటు చేసుకుంది. మీ గ్యాస్ సిలిండర్ మీ ఇంటి వద్దనే డెలివరీ చేయడానికి వన్ టైమ్ పాస్‌వర్డ్(OTP) అవసరం. దొంగతనాలు అరికట్టేందుకు, వాస్తవ వినియోగదారుడిని గుర్తించడానికి చమురు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ కొత్త సిస్టమ్‌ను డెలివరీ అథెంటికేషన్ కోడ్(DAC)గా పేర్కొంటున్నారు.

దీనిని చమురు రంగ కంపెనీలతో పాటు వినియోగదారుడి ప్రయోజనంకోసం ప్రవేశ పెట్టారు. ఇది కేవలం గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. కమర్షియల్ సిలిండర్లకు వర్తించదు. ఈ విధానంలో వినియోగదారు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది ఎల్పీజీ సిలిండర్ డెలివరీ చేసేవారికి ఈ ఓటీపీ చూపించాలి. వినియోగదారు మొబైల్ నెంబర్ అప్ డేట్ చేయకపోతే డెలివరీ చేసే వ్యక్తి రియల్ టైమ్ అఫ్లికేషన్ ద్వారా అప్ డేట్ చేయవచ్చు. కోడ్‌ను జనరేట్ చేయవచ్చు. తప్పుడు వివరాలు ఉంటే ఎల్పీజీ సిలిండర్ హోమ్ డెలివరీ కాదు.

English summary

Cylinder Customers Alert: ఇండేన్ గ్యాస్ బుకింగ్ నెంబర్ మారిపోయింది.. | Common phone number for Indane LPG refill bookings

Indane Gas booking number will be changed from today (November 1) as the old numbers will not be acceptable. Indian Oil has started one common number for Indane LPG refill booking across the country for customer convenience.
Story first published: Tuesday, November 3, 2020, 10:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X