ప్రభుత్వ, ప్రయివేట్ రంగంలోని బ్యాంకులు తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు వినూత్న సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. వీటి వల్ల అటు కస్టమర్లకు, ఇటు బ్యాంకులకు ప్రయోజనం ఉంటుంది. అయితే ఈ సదుపాయాన్ని వినియోగించుకోవడంలో ఉన్న పరిమితులు, చార్జీలు, ప్రయోజనాలు కూడా తెలుసుకోవడం ఎంతైనా ఉపయోగకరమే. ఆ వివరాలు మీకు అందిస్తున్నాం..

ఎస్బీఐ నుంచి...
ఏటీఎం నుంచి నగదు తీసుకోవాలంటే ఏ బ్యాంకు కష్టమర్లకైనా మొబైల్ ఫోన్ తప్పని సరిగా అవసరం ఉంటుంది. కార్డు లేకుండానే ఏటీఎం నుంచి నగదును ఉపసంహరించుకునే సదుపాయాన్ని తొలుత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందుబాటులోకి తెచ్చింది. దీనిని తన మొబైల్ యాప్ యోనో ను వినియోగించుకునే వారు వాడుకోవచ్చు. అయితే ఎంపిక చేసిన ఏటీఎం లలో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.

ఐసీఐసీఐ బ్యాంక్
ఈ బ్యాంక్ గత జనవరిలో కార్డ్ లెస్ విత్ డ్రాయల్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. తన మొబైల్ బ్యాంకింగ్ కస్టమర్లకు ఇది అందుబాటులో ఉంది. దాదాపు 15 వేల ఏటీఎం లలో ఈ సదుపాయాన్ని బ్యాంక్ అందుబాటులోకి తెచ్చింది.

ఏంచేయాలంటే...
* కార్డ్ లేకుండా ఏటీఎం నుంచి నగదు తీసుకోవాలంటే కొన్ని సులభమైన పద్దతులను పాటించాల్సి ఉంటుంది. వేమిటంటే...
* ముందుగా కస్టమర్లు తమ మొబైల్ బ్యాంకింగ్ యాప్ లోకి లాగిన్ అయి ఎంత సొమ్మునైతే ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకోవలనుకుంటున్నామో అందుకు సంబందించిన క్యాష్ రిక్వెస్ట్ ను జనరేట్ చేయాలి. అంతే కాకుండా ఒక తాత్కాలిక పిన్ ను కూడా జనరేట్ చేయాలి.
* రెండంచెల వెరిఫికేషన్ లో భాగంగా బ్యాంక్ మీ మొబైల్ నెంబర్ కు ఎస్ ఎం ఎస్ ద్వారా వన్ టైం పాస్వర్డ్ ను పంపుతుంది.
* ఐ సీ ఐ సీ ఐ బ్యాంక్ ఏటీ ఎం లో అయితే క్యాష్ విత్ డ్రాయల్ ఆప్షన్ ను, ఎస్ బీ ఐ కస్టమర్లు అయితే యోనో క్యాష్ ఆప్షన్ ను ఎంచుకొని అమౌంట్ ను టెంపరరీ పిన్ ను, ఓటీపీ ని ఎంటర్ చేసి నగదు తీసుకోవచ్చు.

చార్జీలు...
ఈ సదుపాయానికి బ్యాంకులు ఎలాంటి చార్జీలను వసూలు చేయవు. అయితే ఏటీఎం లలో మాదిరిగా ఉచిత లావాదేవీల పరిమితి ముగిసిన తర్వాత చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. అయితే అపరిమిత ఉచిత ఏటీఎం లావాదేవీలు పొందే అవకాశం ఉన్న సేవింగ్స్ ఖాతా కస్టమర్లు చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
లావాదేవీలపై పరిమితి...
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రోజువారీ లావాదేవీ పరిమితి 20,000 రూపాయలు
* ఒక్కో లావాదేవీ పరిమితి 10,000 రూపాయలు
* ఐసీఐసీఐ బ్యాంక్ రోజువారీ లావాదేవీ పరిమితి, రోజువారీ పరిమితి 20,000 రూపాయలు.


Click it and Unblock the Notifications