ఇటీవల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన కెనరా బ్యాంకు తాజాగా, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను కూడా తగ్గించింది. రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై ఆగస్ట్ 10వ తేదీ నుండి సవరిస్తున్నట్లు తెలిపింది. ఇటీవల వివిధ కాలపరిమితులపై ఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్లను 30 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. ఇవి ఆగస్ట్ 7వ తేదీ నుండి అమలులోకి వచ్చాయి. ఇప్పుడు FD రేట్లు తగ్గించింది.

ఆయా కాలపరిమితులపై FD వడ్డీ రేట్లు ఇలా
- 7-45 రోజుల మెచ్యూరిటీ కలిగిన టర్మ్ డిపాజిట్లపై కెనరా బ్యాంకు 3 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
- 46 నుండి 90 రోజుల మెచ్యూరిటీ కలిగిన డిపాజిట్లపై 4 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
- 91 నుండి 179 రోజుల మెచ్యూరిటీ కలిగిన డిపాజిట్లపై 4.05 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
- 180 నుండి ఏడాది లోపు మెచ్యూరిటీ కలిగిన డిపాజిట్లపై 4.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
- ఏడాది కాలపరిమితిపై వడ్డీ రేటు 5.40 శాతం.
- ఏడాది నుండి మూడేళ్ల మెచ్యూరిటీ కలిగిన డిపాజిట్స్ పైన 5.35 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
- మూడేళ్ల నుండి పదేళ్ల కాలపరిమితిపై 5.3 శాతం వడ్డీ రేటును ఇస్తోంది.

సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు
సాధారణ కస్టమర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు 180 రోజుల నుండి పదేళ్ల కాలపరిమితిపై 50 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉంటుంది. ఏడు రోజుల నుండి పదళ్ల కాలపరిమితి డిపాజిట్లపై వాటి ఆధారంగా 3 శాతం నుండి 5.9 శాతం మధ్య వడ్డీ రేటు ఉంది. సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేట్లు...
- 7 రోజుల నుండి 45 రోజుల వరకు -3%
- 46 రోజుల నుండి 90 రోజుల వరకు - 4%
- 91 రోజుల నుండి 179 రోజుల వరకు - 4.05%
- 180 రోజుల నుండి ఏడాది లోపు వరకు - 5%
- 1 ఏడాది కాలపరిమితిపై - 5.90%
- 1 ఏడాది నుండి రెండేళ్ల లోపు కాలపరిమితిపై - 5.85%
- రెండేళ్ల నుండి మూడేళ్ల లోపు డిపాజిట్లపై - 5.85%
- మూడేళ్ల నుండి ఐదేళ్లలోపు కాలపరిమితి డిపాజిట్లపై - 5.80%
- ఐదేళ్ల కాలపరిమితి నుండి 10 ఏళ్ల లోపు డిపాజిట్లపై - 5.80%

ఇటీవల రుణాలపై వడ్డీ రేటు తగ్గింపు
కెనరా బ్యాంకు ఇటీవల రుణాలపై వడ్డీ రేట్లను కూడా తగ్గించిన విషయం తెలిసిందే. 30 బేసిస్ పాయింట్ల మేర తగ్గింది.
- ఓవర్ నైట్ MCLR - 7.00%
- ఒక నెల MCLR - 7.00%
- మూడు నెలలు MCLR - 7.15%
- ఆరు నెలల కాలపరిమితి MCLR- 7.40%
- ఏడాది కాలపరిమితి MCLR- 7.45%


Click it and Unblock the Notifications