క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించలేదా? అయితే మీరు క్రిమినల్ ఛార్జెస్ ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. SBI కార్డ్స్ ఐపీవో ప్రాస్పెస్ట్స్ డేటా ప్రకారం నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 138 కింద 19,201 కేసులు, పేమెంట్ అండ్ సెటిల్మెంట్ యాక్ట్ 2007లోని సెక్షన్ 25 ప్రకారం 14,174 కేసులు నమోదయ్యాయి. సరైన ఫండ్ మొత్తం లేకుండా.. చెక్ బౌన్స్ అయిన సందర్భాల్లో సెక్షన్ 138 కింద కేసు ఫైల్ చేస్తారు. సాధారణంగా చెక్ బౌన్స్ అంటుంటాం. అదే సమయంలో సరైన బ్యాలెన్స్ లేని సమయంలో ఎలక్ట్రానిక్ పేమెంట్ ఫెయిల్ అయినప్పుడు పేమెంట్ అండ్ సెటిల్మెంట్ యాక్ట్ 2007 కింద కేసు నమోదు చేస్తారు. బిల్లు చెల్లింపుల కోసం ఆటో డెబిట్ అంశాలు కూడా ఉండవచ్చు.

క్రిమినల్ కేసులు ఎదుర్కొనే అవకాశం...
ఆసక్తికర విషయం ఏమంటే ఈ రెండు కేసుల్లో కలిపి రావాల్సిన మొత్తం వరుసగా రూ.25.52 కోట్లు, 72.6 కోట్లు. అంటే సరాసరిగా ఒక్కో కేసులో రావాల్సిన మొత్తం రూ.13,290, రూ.51,220. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే మీరు తీసుకున్న రుణ మొత్తం చాలా ఎంతైనా కావొచ్చు. కానీ డెబిట్ మొత్తాన్ని చెల్లించని పక్షంలో క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అర్థమవుతోంది.

ఆ తర్వాత రికవరీ కోసం..
ఫుట్‌నోట్ ప్రకారం... నిర్ణీత గడువులోగా పేమెంట్స్ చెల్లించని పక్షంలో ఎస్బీఐ కార్డ్స్ కస్టమర్ అకౌంట్‌ను బ్లాక్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో అకౌంట్ బ్లాక్ తాత్కాలికం కావొచ్చు లేదా శాశ్వతంగాను ఉండవచ్చు. అపరాద దశ, డిఫాల్ట్ పొటెన్షియల్, పేమెంట్ హిస్టరీ ఆధారంగా ఇది ఉంటుంది. దాదాపు ఆరు నెలల తర్వాత క్రెడిట్ కార్డు అకౌంట్ రికవరీ డిపార్టుమెంట్‌కు చేరుతుంది.

చెల్లించకుంటే చట్టపరమైన ప్రాసెస్..
చెల్లింపుల గడువు తేదీ 191 రోజులు పూర్తయినా చెల్లించని పక్షంలో అది రికవరీ పూల్ లేదా పోస్ట్ చార్జ్ ఆఫ్ బకెట్‌కు వెళ్తుంది. ఇలాంటి సందర్భంలో క్రెడిట్ కార్డు కంపెనీ చట్టపరమైన సాధనాలపై దృష్టి సారిస్తుంది. ఫుట్ నోట్ ప్రకారం.. మధ్యవర్తిత్వం, సయోధ్య, లీగల్ నోటీసు, ప్రివిలేజ్ పోలీసు కంప్లయింట్, లోక్ అదాలత్ వంటి ప్రత్యామ్నాయ వివాద పరిష్కార మార్గాలను ఆశ్రయిస్తుంది.
నెగోషియబుల్ ఇన్స్టుమెంట్ యాక్ట్ సెక్షన్ 138 ప్రకారం పాక్షిక-చట్టపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.

రెండేళ్ల వరకు జైలు శిక్ష
పైన పేర్కొన్న విభాగాల్లో శిక్ష పడితే రెండేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. అంతేకాదు, జరిమానా కట్టాల్సిన దాని కంటే రెండింతలు చెల్లించవలసి ఉంటుంది.

30 రోజుల్లో చెల్లించకుంటే...
క్రెడిట్ బిల్లు పేమెంట్ చెక్ బౌన్స్ అయినప్పుడు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం ఓ కేసు ఫైల్ చేస్తారు. అలాగే, ఎలక్ట్రానిక్ ట్రాన్సుఫర్ (ఆటో డెబిట్) బౌన్స్ అయితే పేమెంట్ అండ్ సెటిల్మెంట్ యాక్ట్ ప్రకారం ఉంటుంది. రెండు సందర్భాలలోను క్రెడిట్ కార్డు కంపెనీ మీకు నోటీసులు పంపిస్తుంది. 30 రోజుల్లో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాలని పేర్కొంటుంది. నోటీసు పంపించిన తర్వాత గడువు అనంతరం 15 రోజుల్లోగా చెల్లించకుంటే పైన పేర్కొన్న సెక్షన్ల కింద కేసు నమోదు అవుతుంది.

ఆ తర్వాత చెల్లించినా ప్రమాదం..
క్రెడిట్ కార్డు డిఫాల్ట్ మిమ్మల్ని సిబిల్ వంటి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు బ్లాక్ లిస్టులో పెట్టే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిణామాలు ఎదుర్కొన్న తర్వాత రుణాలు చెల్లించినప్పటికీ భవిష్యత్తులో రుణాలు లేదా క్రెడిట్ కార్డులు పొందటం కష్టతరం అవుతుంది. భారతదేశంలో సుమారు 3.6 కోట్ల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఇందులో ఎస్బీఐ కార్డు వాటా 83 లక్షలతో 23 శాతంగా ఉంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications