Saving Scheme: రోజుకు రూ. 400 పొదుపు చేస్తే రూ. 80 లక్షలు మీ సొంతం..!
ఖచ్చితమైన రాబడి, సురక్షితమైన పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి చాలా పథకాలు ఉన్నాయి. అందులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) ఒకటి.
ఇందులో మంచి వడ్డీ రేటు కూడా ఉంటుంది. ప్రస్తుతం పీపీఎఫ్ లో 7.1 శాతం వడ్డి చెల్లిస్తున్నారు. ప్రతి నెల 5 నుంచి 30 తేదీ మధ్య మీ సొమ్ముపై వడ్డీ లెక్కించి జమ చేస్తారు. అయితే పీపీఎఫ్ ఖాతా ఎలా ఓపెన్ చేయాలి. ఎక్కడ ఓపెన్ చేయాలి. కావాల్సిన పత్రాలు ఏమిటి. మెచ్యూరిటీ సమయం ఎన్ని సంవత్సరాలో తెలుసుకుందాం.
పీపీఎఫ్ ఖాతను పోస్టాఫీస్ లేదా బ్యాంకుల్లో ఓపెన్ చేయవచ్చు. అయితే ఒకరి పేరు మీద ఒకే ఖాతా మాత్రం తెరిచేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకు మీరు మీ ఆధార్, బ్యాంక్ పాస్ బుక్, ఫొటో, నామినీ వివరాలు అందించాల్సి ఉంటుంది. ఇక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మెచ్యూరిటీ 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు లాగిన్ పీరియడ్ ఉంటుంది. మీరు విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం లేదు. కానీ మీరు జమ చేసిన సొమ్ముపై తక్కువ శాతం వడ్డీతో లోన్ తీసుకోవచ్చు. కాగా ఈ పథకంలో సంవత్సరానికి కనీసం రూ.500 పెట్టుబడి పెట్టాలి. గరిష్టంగా రూ.1,50,000 వేలకు పెట్టుబడి పెట్టవచ్చు. మీరు పీపీఎఫ్ లో క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే మంచి రాబడి ఉంటుంది.

మీరు నెలకు రూ.12,500 పెట్టుబడి పెడితే సంవత్సరానికి రూ.1,50,000 చెల్లించినట్లు. ఇలా 15 సంవత్సరాలు పొదుపు చేస్తే రూ.22,50,000 పెట్టుబడి పెట్టినట్లు అవుతుంది. 7.1 శాతం వడ్డీతో మీకు వడ్డీ రూ.18,18,209 వస్తుంది. మొత్తంగా రూ.40,68,209 మెచ్యూరిటీ డబ్బులు మీ ఖాతాలో జమ అవుతాయి. అయితే చాలా మంది మెచ్యూరిటీ పూర్తి కాగానే డబ్బులు విత్ డ్రా చేసుకుంటారు. కానీ మీరు మీ ఖాతాను 5 సంవత్సరాల పొడిగించుకుంటూ వేళ్తే భారీ మొత్తం మీ సొంత అయ్యే అవకాశం ఉంది. ఇలా 20 ఏళ్లు, 25 ఏళ్లు, 30 ఏళ్లు పథకాన్ని కొనసాగించవచ్చు.
పీపీఎఫ్ ఖాతాలో జమ చేసే మొత్తానికి సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే వడ్డీకి కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. మీరు ఐదేళ్ల చొప్పున ఖాతాను పొడిగిస్తే భారీ మొత్తం వస్తుంది. 15 సంవత్సరాలకు మెచ్యూరిటీ మొత్తం రూ.40,68,209 వస్తే.. దీన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తే అంటే 20 ఏళ్లకు రూ.57,32,586 వస్తాయి. వీటిని మరో ఐదేళ్లు 25 ఏళ్ల వరకు కొనసాగిస్తే రూ.80,77,889 వస్తాయి.


Click it and Unblock the Notifications