Loans: స్వల్పకాలిక రుణం తీసుకుంటే బెటరా లేకుంటే దీర్ఘకాలిక రుణమా..!
జీవితంలో ఒక్కసారి అయిన బ్యాంకులో రుణం తీసుకునే వారు ఉంటారు. అది పర్సనల్ లోన్ కావొచ్చు లేదా హోం లోన్, బంగారం లోన్, మట్గెజ్ లోన్, క్రాఫ్ లోన్, వాహన లోన్ కావొచ్చు. ఏదో ఒక లోను తీసుకునే ఉంటారు. అయితే ఇందులో స్వల్పకాలిక రుణాలు ఉంటాయి, దీర్ఘకాలిక రుణాలు ఉంటాయి . అయితే హోం లోన్ దాదాపు ఎప్పుడైనా దీర్ఘకాలిక లోన్ గా ఉంటుంది. మిగతా లోన్లు మాత్రం స్వల్పకాలిక లోన్లుగా ఉంటాయి. ఈ స్వల్ప కాలిక రుణాల్లో కూడా తక్కువ టైమ్ పీరియడ్, ఎక్కువ టైమ్ పీరియడ్ ఉంటుంది.
అయితే మనం లోన్ తీసుకునేటప్పుడు వడ్డీ రేట్ ఎలా ఉందో చూసుకోవాలి. ఏ బ్యాంక్ తక్కువ వడ్డీకి రుణం ఇస్తే ఆ బ్యాంకులో లోన్ తీసుకోవడం బెటర్. ఆ తర్వాత తీసుకున్న లోన్ ను ఎన్ని రోజుల్లు తీర్చాలో మీరే నిర్ణయించుకోవాలి. మీకు వస్తున్న ఆదాయం, పిల్లల చదువు, అద్దె, ఆర్థిక పరిస్థితిని బట్టి లోన్ చెల్లింపు కాల పరిమితిని ఎంచుకోవాలి. రుణ చెల్లింపు కాల వ్యవధిని ఎంచుకునే ముందు రెండు 2 విషయాలు తప్పుకూడా గుర్తుంచుకోవాలి.

మీరు దీర్ఘకాలిక రుణాన్ని ఎంచుకుంటే.. నెలకు కట్టాల్సిన ఈఎంఐ తక్కువగా వస్తుంది. కాబట్టి ప్రతి నెలా పెద్దగా భారం అనిపించదు. కానీ మీరు చెల్లించాల్సిన వడ్డీ మాత్రం పెరుగుతుంది. మీరు స్వల్పకాలిక రుణాన్ని ఎంచుకుంటే నెలకు కట్టాల్సిన ఈఎంఐ మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మీరు చెల్లించే వడ్డీ తక్కువగా ఉంటుంది. రుణం తీసుకునే ముందు మీ భవిష్యత్తు లక్ష్యాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే కొంత మంది పర్సనల్ లోన తీసుకుని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇది చాలా రిస్క్ తో కూడుకున్నది. ఒక మన అంచనా ప్రకారం మార్కెట్ లేకపోయిన.. మీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ సరిగా పని చేయకపోయినా నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది.
అత్యవసరం ఉంటేనే పర్సనల్ లోన్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎవరైనా ఆర్థిక స్వేచ్ఛను సాధించాలనుకుంటే మాత్రం కాస్త కష్టమైనా సరే స్వల్పకాలిక రుణం ఎంచుకోవడమే మంచిదని చెబుతున్నారు. అయితే మీరు సంపాదించే డబ్బులో ఎక్కువ భాగాన్ని ఇతర పెట్టుబడుల వైపు మళ్లించి, ఆ పెట్టుబడుల ద్వారా ఈ లోన్ వడ్డీ కంటే ఎక్కువ రాబడులు సాధించగలరనే నమ్మకం మీకు ఉంటే.. తక్కువ ఈఎంఐతో దీర్ఘకాలిక రుణం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. కానీ ఇందులో రిస్క్ ఉంటుందని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
ఒకవేళ మీ వద్ద బంగారం ఉంటే.. బంగారంపై రుణం తీసుకోవడం మంచిది. ఎక్కడైనా బంగారం రుణం తీసుకుంటే వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. కాగా బంగారం రుణం అనేది స్వల్పకాలిక రుణం అని గుర్తుంచుకోవాలి.


Click it and Unblock the Notifications