లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్‌లను పొందేందుకు మంచి CIBIL స్కోర్‌ను నిర్వహించడం చాలా కీలకం. కొన్ని నెలల్లోనే మెరుగైన సిబిల్ స్కోర్ నిర్మించుకోవటానికి అవసరమైన కీలక అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం..
క్రెడిట్ నివేదికను తనిఖీ చేయటం:
CIBIL వెబ్‌సైట్ నుంచి మీ క్రెడిట్ నివేదికను పొందడం ద్వారా ముందుగా ప్రయాణాన్ని ప్రారంభించండి. రిపోర్టులో ఏవైనా లోపాలు లేదా వ్యత్యాసాలను పరిశీలించటం ముందుగా ముఖ్యమైన అంశం. ఈ క్రమంలో ఏదైనా తప్పులు ఉన్నట్లు గమనిస్తే వాటిని సరిదిద్దుకోవటానికి సిబిల్ వద్ద వివాదాన్ని లేవనెత్తొచ్చు.
మీ బిల్లులను సకాలంలో చెల్లించండి:
సిబిల్ బిల్డింగ్ లో అన్నింటి కంటే ముఖ్యమైనది సకాలంలో బిల్లుల చెల్లింపు. మీరు గడువు తేదీలో చెల్లింపులు చేయటం ఎప్పటికీ కోల్పోకుండా చూసుకోవడానికి రిమైండర్‌లను సెట్ చేయండి లేదా చెల్లింపులను ఆటోమేట్ చేయండి. ఇందులో క్రెడిట్ కార్డ్ బిల్లులు, లోన్ EMIలు, యుటిలిటీ బిల్లులు ఉంటాయి.

రుణాలను తగ్గించుకోండి:
ఇప్పటికే ఉన్న అప్పులను వీలైనంత త్వరగా చెల్లించడానికి ప్రయత్నించండి. అధిక బకాయిలు మీ స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ముందుగా అధిక వడ్డీ రుణాలను క్లియర్ చేయడంపై దృష్టి పెట్టడం క్రెడిట్ స్కోర్ మెరుగుపరుచుకోవటంలో కీలకమైన అంశమని గుర్తుంచుకోండి.
క్రెడిట్ వినియోగాన్ని అందుపులో ఉంచటం:
విచ్చలవిడిగా క్రెడిట్ వినియోగం సిబిల్ స్కోర్ ను భారీగా డ్యామేజ్ చేస్తుందని గుర్తుంచుకోండి. అందువల్ల క్రెడిట్ కార్డుల్లోని మెుత్తం అందించబడిన పరిమితిలో 30% కంటే తక్కువ వినియోగించటాన్ని లక్ష్యంగా పెట్టుకోండి. అంటే మీకు అందుబాటులో ఉన్న క్రెడిట్ లిమిట్‌లో 30% కంటే తక్కువగా ఉపయోగించడం సిబిల్ మెరుగుపరచటానికి ఉపయోగపడుతుంది.
అధిక రుణ దరఖాస్తులు వద్దు:
తక్కువ కాలంలోనే రుణాల కోసం అనేక ఆర్థిక సంస్థలను సంప్రదించటం లేదా క్రెడిట్ కార్డ్‌ల కోసం దరఖాస్తు చేయడం సిబిల్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది. ప్రతి అప్లికేషన్ మీ స్కోర్‌ను తగ్గించగల కఠినమైన విచారణకు దారి తీస్తుందని గుర్తుంచుకోండి.
ఆరోగ్యకరమైన క్రెడిట్ మిక్స్ ముఖ్యం:
సెక్యూర్డ్ అండ్ అన్‌సెక్యూర్డ్ లోన్‌ల మిక్స్ స్కోర్‌ను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. ఒక రకమైన క్రెడిట్‌పై మాత్రమే ఆధారపడకుండా ఉండటం సిబిల్ నిర్వహణలో పరిగణించే ఒక అంశమని గుర్తుంచుకోండి.
పాత ఖాతాలను తెరిచి ఉంచండి:
మీ క్రెడిట్ హిస్టరీ ముఖ్యమైనది. మీరు వాటిని తరచుగా ఉపయోగించకపోయినా, పాత ఖాతాలను తెరిచి యాక్టివ్‌గా ఉంచండి. ఇది సుదీర్ఘ క్రెడిట్ హిస్టరీని నిర్మించడంలో సహాయపడుతుంది.
క్రమం తప్పకుండా పర్యవేక్షించండి:
సిబిల్ పురోగతిని ట్రాక్ చేయడానికి స్కోర్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. ఏవైనా మార్పుల గురించి తెలుసుకుని, వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో పర్యవేక్షణ దోహదపడుతుందని గుర్తుంచుకోండి. పైన పేర్కొన్న అన్ని దశలను విజయవంతంగా నిర్వహించటం ద్వారా CIBIL స్కోర్‌ను నెలల వ్యవధిలో మెరుగుపరుచుకోవటానికి సహాయపడుతుంది. ఇది ఆర్థిక సంస్థల నుంచి సరసమైన వడ్డీ రేట్లకు రుణాలు, ఉత్తమ క్రెడిట్ కార్డులను పొందటంలో సహాయకారిగా నిలుస్తుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications