For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విద్యా రుణాలు తగ్గుతున్నాయ్... కారణాలు ఏమిటో తెలుసా?

|

ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాన్ని సాధించాలని అందరికి ఉంటుంది. కానీ అందుకు తగిన స్థాయిలో డబ్బులు లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకొనే బ్యాంకులు విద్యా రుణాలు అందిస్తున్నాయి. ఈ రుణాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉండటమే కాకుండా నెలవారీ వాయిదాల్లో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించే సదుపాయాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి. దీనివల్ల ఎంతో మంది ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఏర్పడుతోంది. అయితే ఈ మధ్య కాలంలో విద్యా రుణాలు తగ్గుతున్నాయి. బ్యాంకులు ఈ రుణాలు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నాయి.

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్: కొద్ది రోజుల్లో PM Kisan నిధులుతెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్: కొద్ది రోజుల్లో PM Kisan నిధులు

మూడేళ్ళ కనిష్ట స్థాయిలో...

మూడేళ్ళ కనిష్ట స్థాయిలో...

* బ్యాంకులు జారీ చేసే విద్యా రుణాలు గణనీయంగా తగ్గిపోయాయి. భారత రిజర్వ్ బ్యాంక్ వెల్లడించిన గణాంకాల ద్వారా ఈ విషయం స్పష్టం అవుతోంది. విద్యా రుణాలు ప్రాధాన్య రుణాల జాబితాలో ఉన్నాయి. కానీ వీటికి ఈ మధ్య కాలంలో ప్రాధాన్యం తగ్గిపోయింది. గత నవంబర్ నెలలో అంతకు ముందు నవంబర్ నెలతో పోల్చితే విద్యా రుణాలు 5.6 శాతం మేర తగ్గాయి. గత మూడేళ్ళ కాలంలో ఇదే అత్యధికం కావడం గమనార్హం.

2016 సంవత్సరం నుంచి ఈ రుణాల్లో వృద్ధి లేదు

2016 సంవత్సరం నుంచి ఈ రుణాల్లో వృద్ధి లేదు

* 2017 సంవత్సరంతో పోల్చితే 2018 సంవత్సరంలో విద్య రుణాల్లో 4. 7 శాతం క్షీణత నమోదయింది. 2016 తో పోల్చితే 2017 సంవత్సరంలో 3.3 శాతం క్షీణత ఉంది. 2016 సంవత్సరంలో మాత్రం అంతకు ముందు ఏడాదితో పోల్చితే 2.4 శాతం వృద్ధి నమోదు అయింది.

ఒత్తిడి వల్లనే...

ఒత్తిడి వల్లనే...

* కార్పొరేట్ రుణాల్లో మొండి పద్దులు పెరిగిపోవడం వల్ల బ్యాంకులు వాటిని వసూలు చేసుకోవడానికి నానా కష్టాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేట్ రుణాలను తగ్గించుకొని రిటైల్ రుణాలను ఎక్కువగా జారీ చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. వీటిలో గృహ, వాహన, విద్యా, వ్యక్తిగత రుణాలు ఉంటాయి. వీటిలో మొండి పద్దులు తక్కువగా ఉంటాయి. వడ్డీ ఎక్కువ గిట్టుబాటు అవుతుంది. అయితే విద్యా రుణాలు ఎక్కువగా ఇచ్చిన బ్యాంకులు మారిన పరిణామాల నేపథ్యంలో తగ్గించడం మొదలు పెట్టాయి. 2017 నుంచి విద్యా రుణాలకు సంభందించిన ఒత్తిడి పెరిగి పోవడంతో అప్పటి నుంచి ఈ రుణాలను తగ్గించడంపై బ్యాంకులు దృష్టి పెట్టాయి. అన్ని బ్యాంకులు ఇదే ధోరణిని అవలంభిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విభాగంలో పరిస్థితి ఆందోళన కరంగా ఉందని బ్యాంకింగ్ వర్గాలు అంటున్నాయంటే పరిణామాలు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

వేల కోట్ల బకాయిలు..

వేల కోట్ల బకాయిలు..

* విద్యా రుణాల్లో బకాయిలు భారీగా పెరిగిపోతున్నాయి. వీటి పట్ల బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. 2016-17 సంవత్సరంలో విద్యా రుణ బకాయిలు 67,685.59 కోట్ల రూపాయలు ఉంటే ఈ ఏడాది సెప్టెంబర్ నాటికీ 75,450.68 కోట్ల రూపాయలకు చేరాయి.

కారణాలు ఇవే...

కారణాలు ఇవే...

* మంచి ఉద్యోగం లభిస్తే తీసుకున్న రుణాన్ని చాలా సులభంగా తీర్చి వేయవచ్చని అనేక మంది విద్యార్థులు విద్యా రుణాలు తీసుకున్నారు. అయితే తమ విద్యాబ్యాసం పూర్తయిన తర్వాత అనుకున్న స్థాయిలో ఉద్యోగం లభించకపోవడం, లేదా తక్కువ వేతనాలు ఉండటం వల్ల నెలవారీ వాయిదాలు చెల్లించడంలో ఇబ్బందులు పడుతున్నారు.

* ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉండటం, ఎంట్రీ లెవల్ లో వేతనాలు తక్కువగా ఉండటం వంటి పరిణామాలు నెలకొన్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

* గత మూడేళ్ల కాలంలో ఉద్యోగాలు పొందిన వారిలో చాలా మంది ఎంట్రీ లెవల్ వేతనాలు 15,000-20,000 రూపాయల మధ్యలో ఉన్నాయట. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ వంటి రంగాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందట. అందుకే నెలవారీ వాయిదాలు చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట.

Read more about: loan లోన్
English summary

విద్యా రుణాలు తగ్గుతున్నాయ్... కారణాలు ఏమిటో తెలుసా? | Banks education loans coming down

Banks are rethinking while lending education loans. Disbursal of education loans has declined steeply. The stress in education loans has been rising steadily since 2017. with this banks education loan disbursal slowdown.
Story first published: Sunday, December 15, 2019, 13:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X