బ్యాంకుల ఈఎంఐ మారటోరియం.. ఏ బ్యాంకుకు ఎలా తెలియజేయాలి?
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి 25వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు 25 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. ఉద్యోగులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ కారణంగా ఆర్బీఐ మూడు నెలల పాటు రుణ చెల్లింపులపై మారటోరియం వెసులుబాటు కల్పించాలని బ్యాంకులకు సూచించింది. బ్యాంకులు తమ తమ కస్టమర్లకు ఈ అవకాశం కల్పిస్తున్నాయి. ఏ బ్యాంకు ఏం చెప్పిందంటే...

ఈ బ్యాంకుల్లో ఆటోమేటిక్‌గా..
- ప్రభుత్వరంగ దిగ్గజం SBIలో ఆటోమేటిక్‌గా మారటోరియం రిలీఫ్ ఉంటుంది. వద్దనుకుంటే బ్యాంకుకు తెలియజేయాలి.
- పంజాబ్ నేషనల్ బ్యాంకులోను ఆటోమేటిక్‌గా రిలీఫ్ ఉంటుంది. వద్దనుకుంటే తెలియజేయాలి.
- కెనరా బ్యాంకులో కస్టమర్ ఎంచుకోవాలి. ఈఎంఐ చెల్లింపును నిలిపివేయాలంటే ఎస్సెమ్మెస్ ద్వారా నో అని పంపాల్సి ఉంటుంది.

డిమాండ్ రిలీఫ్
- IDFC ఫస్ట్ బ్యాంకులో ఈమెయిల్ ద్వారా కస్టమర్లు మారటోరియం అడగవచ్చు.
- HDFC బ్యాంకు కస్టమర్ బ్యాంకుకు తెలియజేసి మారటోరియం ఆప్షన్ ఎంచుకోవచ్చు.
- ఐసీఐసీఐ బ్యాంకు కొన్ని లోన్లపై డిమాండ్ రిలీఫ్ మాత్రమే ఇస్తోంది. బ్యాంకుకు తెలియజేసి ఆప్షన్ ఎంచుకోవచ్చు.
- ఐడీబీఐ బ్యాంకులో ఆటోమేటిక్‌గా రిలీఫఅ ఉంది.
- ఆయా బ్యాంకులకు వెబ్ సైట్‌కు వెళ్లి లేదా బ్యాంకులు ఇచ్చిన ఈమెయిల్ ద్వారా సంప్రదించి ఆప్షన్ ఎంచుకోవచ్చు. కొన్ని బ్యాంకులు ఎస్సెమ్మెస్ రూపంలోను తెలియజేయవచ్చు.

ఈఎంఐ వద్దనుకుంటే...
ఎవరైనా రుణగ్రహీత మారటోరియం వద్దనుకుంటే స్వయంగా లేదా మెయిల్ ద్వారా సంబంధిత బ్యాంకుకు తెలియజేయాలి. ఉదాహరణకు ఎస్బీఐలో ఓ లోన్, హెచ్‌డీఎఫ్‌లో మరో లోన్ ఉంటే.. ఎస్బీఐలో ఆటోమేటిక్‌గా మారటోరియం వర్తిస్తుంది. కాబట్టి వద్దనుకుంటే ఎస్బీఐకి తెలియజేయాలి. కావాలనున్నా మెయిల్ లేదా డిజిటల్ మాధ్యమాల ద్వారా సంబంధిత బ్యాంకు శాఖకు తెలియజేయాలి.


Click it and Unblock the Notifications