యాక్సిస్ బ్యాంకు వియరబుల్ పేమెంట్ డివైస్ 'వియర్ ఎన్ పే'ను ప్రారంభించింది. దీని ధర రూ.750గా ఉంది. ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల వియరబుల్ పేమెంట్ డివైస్‌ను ప్రారంభించింది. గత ఏడాది అక్టోబర్ నెలలో టైటాన్ పే పేరుతో దీనిని తీసుకు వచ్చింది. ఇప్పుడు యాక్సిస్ బ్యాంకు దీనిని అందుబాటులోకి తెచ్చింది. కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్ పరిమితిని రూ.2వేల నుండి రూ.5వేలకు పెంచింది రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI). ఈ నేపథ్యంలో కాంటాక్ట్‌లెస్ సాధనాల వైపు బ్యాంకులు దృష్టి సారించాయి.

డెబిట్ కార్డులా పని చేస్తుంది
ఇందులో భాగంగా గతంలో ఎస్బీఐ, ఇప్పుడు యాక్సిస్ బ్యాంకు భారత్‌లో ధరించగలిగే కాంటాక్ట్‌లెస్ పేమెంట్ డివైస్‌ని లాంచ్ చేసింది. 'వియర్ ఎన్ పే' పేరుతో వచ్చిన ఈ డివైస్ నేరుగా కస్టమర్ల బ్యాంకు అకౌంట్‌కు లింక్ అయి ఉంటుంది. ఓ విధంగా ఇది డెబిట్ కార్డులా పని చేస్తుంది. ఈ డివైస్‌ని తీసుకురావడానికి థేల్స్ అండ్ ట్యాపీ టెక్నాలజీస్‌తో యాక్సిస్ చేతులు కలిపింది. మాస్టర్ కార్డ్ ప్లాట్‌ఫామ్‌పై ఈ డివైస్‌లు అందుబాటులో ఉంటాయి.

అక్కడ ఉపయోగించవచ్చు
ఈ డివైస్‌ను యాక్సిస్ బ్యాంక్ రూ.750కు విక్రయిస్తోంది. మీ అకౌంట్ ఉన్న సమీప బ్రాంచీకి వెళ్లి వీటిని కొనుగోలు చేయవచ్చు. వీటి ద్వారా 10 శాతం క్యాష్ బ్యాక్ ప్రయోజనం ఉంది. ఈ వియరబుల్ కాంటాక్ట్‌లెస్ పేమెంట్ డివైజ్... డెబిట్ కార్డు వలె పని చేస్తుందని, నేరుగా కస్టమర్ బ్యాంకు అకౌంట్‌కు లింక్ అయి ఉంటుందని యాక్సిస్ బ్యాంకు తెలిపింది. వియరబుల్ డివైజ్ కోసం ఎస్బీఐ.. టైటాన్‌తో కలవగా, యాక్సిస్ బ్యాంకు థేల్స్ అండ్ ట్యాపీ టెక్నాలజీతో చేతులు కలిపింది. కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేసే మర్చంట్స్ వద్ద దీనిని ఉపయోగించవచ్చు.

ఎలా పని చేస్తుందంటే?
యాక్సిస్ బ్యాంక్ వియర్ ఎన్ పే యాక్సెసరీస్ బ్యాండ్, కీచెయిన్, వాచీ లూప్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. వీటితో యూజర్లు పేమెంట్ చేయడానికి స్మార్ట్ ఫోన్, వ్యాలెట్లు తీసుకు వెళ్లవలసిన అవసరం లేదు. కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్ కోసం ఈ వియరబుల్ డివైస్‌లు బాగా పని చేస్తాయి. కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్ అంగీకరించే ఏ వ్యాపారి దగ్గరైనా వీటితో పేమెంట్ చేయవచ్చు. రూ.5 వేల వరకు చెల్లింపులు చేయడానికి POS మెషీన్స్ వద్ద ఈ డివైజ్‌ను కదిలించాల్సి ఉంటుంది. ఒకవేళ రూ.5 వేల కంటే ఎక్కువ పేమెంట్స్ అయితే పిన్ నెంబర్ అవసరం.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications