హోంలోన్, కారు, గోల్డ్ లోన్: యాక్సిస్ బ్యాంకు అదిరిపోయే పండుగ ఆఫర్లు.. ఇవే..

దసరా, దీపావళి పండుగ సీజన్ కావడంతో ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), ప్రయివేటురంగ బ్యాంకులు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ సహా వివిధ బ్యాంకులు వివిధ ఉత్పత్తులపై పండుగ ఆఫర్లు ప్రకటించాయి. తాజాగా యాక్సిస్ బ్యాంకు కూడా తమ కస్టమర్లకు బంపరాఫర్ ఇచ్చింది. దిల్ సే ఓపెన్ సెలబ్రేషన్స్ పేరుతో హోమ్ లోన్ నుండి బంగారంపై రుణాల వరకు ఆకర్షణీయ రాయితీలు ప్రకటించింది. లక్షకు పైగా బ్రాండెడ్ ఉత్పత్తుల కొనుగోళ్లపై డిస్కౌంట్ ఉంటుందని వెల్లడించింది.

హోమ్ లోన్ 6.9%, వెహికిల్ లోన్ 7.99%

హోమ్ లోన్ 6.9%, వెహికిల్ లోన్ 7.99%

హోమ్ లోన్స్ పైన ఆకర్షణీయ వడ్డీ రేట్లు అందిస్తోంది యాక్సీస్ బ్యాంకు. వడ్డీ రేట్ల తగ్గింపు నుండి క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ల వరకు కస్టమర్లకు వివిధ ప్రయోజనాలు ఇచ్చింది. రుణగ్రహీతలు కేవలం 6.9శాతం వడ్డీతో హోమ్‌లోన్ పొందవచ్చునని తెలిపింది. వాహన రుణాలు 7.99 శాతం వడ్డీ నుండి ప్రారంభమవుతోంది. ఆటో లోన్స్ పైన 100 శాతం ఆన్-రోడ్ రుణాలు అందిస్తోంది. కొన్ని ద్విచక్ర వాహనాలపై నెలకు రూ.278 అతి తక్కువ ఈఎంఐ ఉంది.

యాక్సిస్ డైరెక్ట్ నుండి అదనపు ప్రయోజనాలు

యాక్సిస్ డైరెక్ట్ నుండి అదనపు ప్రయోజనాలు

రిటైల్, కార్పోరేట్ కస్టమర్లు యాక్సిస్ బ్యాంకుతో పాటు అనుబంధ సంస్థలు యాక్సిస్ ఫైనాన్స్, యాక్సిస్ డైరెక్ట్ నుండి ప్రయోజనాలు పొందవచ్చునని తెలిపింది. దీనికి అదనంగా మహూరత్ ట్రేడింగ్ సమయంలో ట్రేడింగ్ పైన 50 శాతం బ్రోకరేజీ క్యాష్ బ్యాక్ అందిస్తోంది యాక్సిస్ డైరెక్ట్. మొదటి ఈక్విటీ సిప్ ట్రాన్సాక్షన్ పైన EDGE రివార్డ్ పాయింట్లు అందిస్తోంది. మొబైల్ యాప్ పైన మొదటి ట్రేడింగ్ పైన కూడా అందిస్తోంది.

యాక్సిస్ డైరెక్ట్ ప్రయోజనాలు

యాక్సిస్ డైరెక్ట్ ప్రయోజనాలు

యాక్సిస్ ఫైనాన్స్ జీరో ప్రాసెసింగ్ ఫీజు, జీరో డౌన్ పేమెంట్‌తో ఆరు నెలల కాల పరిమితిపై లోన్ అందిస్తోంది. ఎంపిక చేసిన జస్ట్-ఇన్-టైమ్ స్టోర్స్‌లలో స్వరోవ్‌స్కీ, సిటిజెన్, సీకో, టిస్సోట్ తదితర బ్రాండ్లపై ఈ ఆఫర్ వర్తిస్తుంది.

కస్టమర్లు 'గ్రాబ్ డీల్స్' ద్వారా పలు ఆఫర్లను పొందవచ్చు. ఎలక్ట్రానిక్స్, దుస్తులు, కిరాణా, ఎంటర్టైన్మెంట్ మరిన్ని విభాగాల్లో ఇది వర్తిస్తుంది.

లక్ష కంటే ఎక్కువ బ్రాండెడ్ ఉత్పత్తులపై డిస్కౌండ్, డీల్స్ ఉన్నాయి.

భాగస్వామ్యం

భాగస్వామ్యం

వివిధ ఉత్పత్తులపై డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ కోసం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వెస్ట్‌సైడ్, మార్క్స్ అండ్ స్పెన్సర్స్, శాంసంగ్, ఎల్జీ, టాటా CLiQ, వర్ల్‌పూల్, హెచ్‌పీ, డీ మార్ట్, మరెన్నో సంస్థలతో యాక్సిస్ బ్యాంకు భాగస్వామ్యం కుదుర్చుకుంది.

యాక్సిస్ బ్యాంకు హోమ్, ఆటో, పర్సనల్, గోల్డ్, బిజినెస్ లోన్లపై ఆకర్షణీయ వడ్డీ రేట్లు అందిస్తోందని యాక్సిస్ బ్యాంకు అధికారి రావి నారాయణ్ (ప్రెసిడెంట్ అండ్ హెడ్ బ్రాంచ్ బ్యాంకింగ్, రిటైల్ లయబిలిటీస్ అండ్ ప్రోడక్ట్స్) అన్నారు.

యాక్సిస్ బ్యాంకు ఆఫర్లు..

యాక్సిస్ బ్యాంకు ఆఫర్లు..

1) హోమ్ లోన్స్ ప్రారంభ వడ్డీ రేటు 6.90%

2) కారు లోన్ ప్రారంభ వడ్డీ రేటు 7.99%. 100% ఆన్ రోడ్ రుణాలు

3) టూ-వీలర్ రుణాలపై రూ.278 (రూ.10,000కు) అతి తక్కువ ఈఎంఐ కూడా ఉంది. 48 నెలల కాలపరిమితి ఉంటుంది. 100% ఆన్-రోడ్ ఫండింగ్.

4) పర్సనల్ లోన్ వడ్డీ రేటు 10.49% నుండి ప్రారంభం. EMI రూ.2,149 (రూ.1 లక్షకు) నుండి ప్రారంభం.

5) చదువుల కోసం రుణాలపై ప్రారంభ వడ్డీ రేటు 10.50% ఉంది. లోన్ పోర్టబులిటీ ఉంది.

6) గోల్డ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజు 0.25%. రూ.2 లక్షల వరకు ఇది వర్తిస్తుంది.

7) బిజినెస్ లోన్ ప్రాసెసింగ్ ఫీజు పైన 25 శాతం డిస్కౌంట్.

8) రూ.10 లక్షల కంటే అధికంగా ఉన్న ఈఎంఐ ఆధారిత డాక్టర్ లోన్ పైన వడ్డీ 10.75% ఉంది. 0.5% ప్రాసెసింగ్ ఫీజు.

9) వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ ప్రాసెసింగ్ ఫీజు పైన 50% తగ్గింపు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+