చాలా మందికి సొంత కారు ఉండాలి అని కలలు కంటుంటారు. దీని కోసం ఎక్కువ శాతం కారు లోన్ పై ఆధారపడతారు. 2024 ఏడాది ముగిసి కొత్త సంవత్సరం రాబోతోంది. చాల కార్ల తయారీదారులు ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లను అందించే టైం కూడా ఇదే. ఎదో ఒక కారులే అని కొంటే తరువాత ఆర్థికంగా భారీ దెబ్బ తీస్తుంది. ఇలాంటి మంచి సమయంలో మీకు ఎలాంటి కారు కావాలో ఎందుకు కావాలో అర్ధం చేసుకోని దానికి సరైన కారుని సెలెక్ట్ చేసుకొని తీసుకుంటే ఉత్తమం. లోన్ ద్వారా కార్ తీసుకోవాలనుకుంటే ఇండియాలోని కొన్ని ప్రముఖ బ్యాంకులు అందించే లోన్ ఆఫర్‌లు వాటి పై వడ్డీ అఫర్ సంబంధించిన వివరాలు ఇదిగో...
ఎస్బిఐ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్ లోన్ స్కీమ్, లాయల్టీ కార్ లోన్ స్కీమ్, అష్యూర్డ్ కార్ లోన్, ఎలక్ట్రిక్ వెహికల్ లోన్ మొదలైన లోన్స్ అందిస్తుంది. SBI రిజిస్ట్రేషన్ ఖర్చు, బీమాతో సహా ఆన్-రోడ్ ధరలో 90% వరకు లోన్ అందిస్తుంది. వృత్తి ఇంకా ఆదాయాన్ని బట్టి రిపేమెంట్ వ్యవధి 8 సంవత్సరాల వరకు ఉంటుంది.

హెచ్డీఎఫ్సి: స్టెప్ అప్ EMI, బెలూన్ EMI అప్షన్స్ ద్వారా ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ అప్షన్స్ ఉన్నాయి. ఎక్కువ పేపర్ వర్క్ డాకుమెంట్స్ అవసరం కాకుండా ముందే ఉన్న కస్టమర్లకు టాప్ అప్ లోన్ సౌకర్యం కూడా అందిస్తుంది. 21-65 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికీ ఇంకా కనీసం రూ.3 లక్షల సంవత్సర ఆదాయం ఉన్నవారు ఈ లోన్ పొందవచ్చు. లోన్ రీపేమెంట్ కాలం 7 సంవత్సరాలు.
ఫెడరల్ బ్యాంక్: ఫ్రీ పర్సనల్ ఆక్సిడెంట్ ఇస్యూరెన్స్ ద్వారా ప్రై పేమెంట్ పెనాల్టీ లేకుండా రూ. 10 లక్షల వరకు లోన్ అందిస్తుంది. కార్ ఎక్స్-షోరూమ్ ధరలో 100% వరకు. అత్యధికంగా రూ.10 లక్షల లోన్ 7 సంవత్సరాల రేపేమెంట్ ద్వారా పొందవచ్చు.
యూనియన్ బ్యాంక్: కొత్త కార్లు, పాత కార్ల కోసం 3 సంవత్సరాల వరకు ఆటో లోన్‌లను అందిస్తుంది. కంపెనీ ఉద్యోగులకు ఆన్-రోడ్ ధర కంటే 10% తక్కువ లోన్ అందిస్తుంది. భారతీయులు, NRIలు ప్రీ పేమెంట్ పెనాల్టీ లేకుండా ఈ లోన్‌ను పొందవచ్చు. 18-77 సంవత్సరాల వయస్సు గల వారు 7 సంవత్సరాల సీలింగ్ లేకుండా కొత్త ఇంకా సెకండ్ హ్యాండ్ కార్ల కోసం కొత్త కార్ లోన్‌లను పొందవచ్చు.
కెనరా బ్యాంక్: కెనరా బ్యాంక్ కారు లోన్స్ కూడా అందిస్తుంది. సంబంధిత ఖర్చులతో సహా 90% వరకు లోన్ అందుబాటులో ఉంటుంది . కనీసం రూ. 3 లక్షల సంవత్సర ఆదాయం ఉన్నవారు 7 సంవత్సరాల వరకు ఎలాంటి సీలింగ్ లేకుండా లోన్ పొందవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా: వివిధ రకాల లోన్స్ అందిస్తుంది. కనీస క్రెడిట్ స్కోర్ 725 ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తుంది. 21-70 సంవత్సరాల వయస్సు గల వారికి ప్రీ-క్లోజింగ్ చార్జెస్ లేకుండా లోన్స్ అందిస్తుంది. ఇందులో 7 సంవత్సరాల వరకు 5 కోట్ల రూపాయల వరకు లోన్స్ లభిస్తాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్: ఆకర్షణీయమైన లోన్స్ అందించడానికి ప్రముఖ కార్ కంపెనీలతో బ్యాంక్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. వ్యక్తులు ఇంకా వ్యాపారాలు ఫిక్స్డ్/ఫ్లోటింగ్ రేట్ల వద్ద లోన్స్ పొందవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు కోటి రూపాయల వరకు లోన్స్ అందించడానికి PNB ప్రైడ్ కార్ లోన్ స్కీమ్ కూడా ప్రవేశపెట్టింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications