అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచితూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ERC) సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నెలకు 500 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగించే ఇళ్లకు యూనిట్‌కు 90 పైసల చొప్పున పెంచారు. ప్రస్తుతం ఈ ధర యూనిట్‌కు రూ.9.05 ఉండగా, వచ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1) నుండి రూ.9.95 పైసలు కానుంది. ప్రభుత్వం రూ.10,060 కోట్లను రాయితీ రూపంలో భరించేందుకు అంగీకరించింది.

వారిపై మాత్రమే రూ.45 కోట్ల భారం
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరెంట్ కనెక్షన్లు 1.83 కోట్లు ఉన్నాయి. గృహ విద్యుత్ వినియోగదారులు 1.45 కోట్ల మంది. ఇందులో 500 యూనిట్లకు పైగా వినియోగించేవారు 1.35 లక్షల మంది ఉన్నారు. ఈ విభాగంలో పెంపు ద్వారా అదనంగా రూ.45 కోట్ల భారం పడనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏపీలో 69,977.18 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమని గుర్తించారు. విద్యుత్ కేంద్రాల నుంచి 66 వేలకు పైగా మిలియన్ యూనిట్లు అందుబాటులో ఉండటంతో మరో దాదాపు 4వేల మిలియన్ యూనిట్ల కొరత ఏర్పడనుంది.

ఛార్జీల్లో సవరణలు
విద్యుత్ ఛార్జీల్లో సవరణలు చేశారు. రైల్వేల నుంచి వసూలు చేసే విద్యుత్ ఛార్జీని రూ.6.50 నుండి రూ.5.50కి తగ్గించారు. విద్యుత్ వాహనాల ఛార్జింగ్‌కు వినియోగించే కరెంట్ ఛార్జీని యూనిట్‌కు రూ.12.25గా నిర్ణయించాలని డిస్కంలు కోరాయి. దీనిని రూ.6.70గా ఖరారు చేశారు.

మరిన్ని సవరణలు..
అత్యధిక విద్యుత్ వాడే పరిశ్రమలకు కనీసం వారి లోడులో 85 శాతం వినియోగం ఉంటే రాయితీ ఇవ్వాలన్న డిస్కంల ప్రతిపాదనను తిరస్కరించారు. రైస్ మిల్లులు, పల్వరైజింగ్ మిల్లులకు ప్రస్తుతం ఉన్న 100HP లోడును 150కి పెంచి ఎల్టీ కేటగిరీలో చేర్చారు. చిన్నతరహా పరిశ్రమల వినియోగదారులకు విధించే కెపాసిటర్ సర్‌ఛార్జీని 25 నుంచి 10 శాతానికి తగ్గించారు.

ఎంత వినియోగిస్తే అంతే ఛార్జ్
ఇదిలా ఉండగా, ఇప్పటి వరకు ఉన్న విధానాన్ని డిస్కంలు ఉపసంహరించాయి. గత ఏడాది విద్యుత్ వినియోగం ఆధారంగా గృహ విద్యుత్ వినియోగదారులను వర్గీకరించే విధానాన్ని డిస్కంలు ఇప్పటి వరకు పాటించాయి. దీనిని ఏప్రిల్ నుండి ఉపసంహరిస్తున్నాయి. ప్రతి నెల ఎంత వినియోగిస్తే అంతే విద్యుత్ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించాయి.

మూడు కేటగిరీల్లో ఛార్జీలు
ఈ విధానం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 1.43 కోట్ల మంది వినియోగదారులకు ప్రయోజనం కలగనుంది. సుమారు రూ.60 కోట్ల భారం తగ్గుతుందని అంచనా. గత విధానం వల్ల వినియోగం తగ్గిన నెలలో కూడా అధిక కేటగిరీ ప్రకారమే ఛార్జీల భారం పడుతుంది. దీంతో విద్యుత్ వినియోగం ఆధారంగా ఛార్జీలు వసూలు చేయాలని ఏపీఈఆర్సీ నిర్ణయించింది. మూడు కేటగిరీల్లో ఛార్జీలు వసూలు చేస్తారు. గత విధానం ప్రకారం ఎక్కువ ఛార్జీ పడుతుంది. కొత్త విధానంలో ఛార్జీలు తగ్గుతాయి.

గృహ వినియోగం ఛార్జీలు
- గ్రూప్ ఏలో 75 యూనిట్ల లోపు అయితే 0-50 వరకు రూ.1.45, 51-75 యూనిట్ల వరకు రూ.2.60 వసూలు చేస్తారు.
- గ్రూప్ బీలో 75 నుండి 225 యూనిట్ల మధ్య 0-50 యూనిట్లకు రూ.2.60, 51-100 యూనిట్లకు రూ.2.60, 101-200 యూనిట్లకు రూ.3.60, 200-225 యూనిట్లకు రూ.6.90 వసూలు చేస్తారు.
- గ్రూప్ సీలో 225 యూనిట్లకు మించితే 0-50 మధ్య యూనిట్లకు రూ.2.65, 51-100 యూనిట్లకు రూ.3.35, 101-200 యూనిట్లకు రూ.5.40, 201-300 యూనిట్లకు రూ.7.10, 301-400 యూనిట్లకు రూ.7.95, 401-500 యూనిట్లకు రూ.8.90 వసూలు చేస్తారు.

500 యూనిట్లు దాటితే మాత్రం..
వినియోగం 500 యూనిట్లు దాటితే మాత్రం యూనిట్‌కు రూ.9.95 వంతున ఛార్జీలు వసూలు చేస్తారు. 500 మీటర్ల కంటే ఎక్కువగా వినియోగించేవారు స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేసుకోవచ్చు. టైమ్ ఆఫ్ డే ప్రకారం ఉదయం గం.10 నుండి గం.12 మధ్య వినియోగించే విద్యుత్‌కు రూ.1 రాయితీ ఇస్తారు. మొత్తంగా 1.45 కోట్ల మందికి పెంపు కనిపించదు. 1.43 లక్షల మందికి స్వల్పంగా పెరుగుతుంది. డిస్కంలకు ప్రభుత్వం రూ.10వేల కోట్ల సబ్సిడీ ఇస్తుంది.

వాణిజ్యానికి అయితే..
వాణిజ్య విద్యుత్ ఛార్జీలు.. 0-50 వరకు రూ.6.90, 51-100 వరకు రూ.7.65, 101-300 వరకు రూ.9.05, 301-500 వరకు రూ.9.60, 500 యూనిట్లకు పైన అయితే రూ.10.15 ఛార్జ్ ఉంటుంది.

విద్యుత్ వాహనాలకు..
ప్రకటనల హోర్డింగ్స్‌కు రూ.12.25, ఫంక్షన్ హాల్స్‌కు రూ.12.25, విద్యుత్ వాహనాలకు రూ.6.70 ఛార్జ్ చేస్తారు.

పరిశ్రమలకు..
పరిశ్రమలకు 75 కేవీ వరకు రూ.670, సీజనల్ పరిశ్రమలకు (75కేవీ) రూ.7.45, సీజనల్ పరిశ్రమలు (20కేవీ) 3.75 ఛార్జ్ చేస్తారు. స్ట్రీట్ లైట్స్, ఎన్టీఆర్ సుజల స్రవంతి, సీపీడల్బ్యూఎస్, పీడబ్ల్యూఎస్‌కు రూ.7 వసూలు చేస్తారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications