Ration Card హోల్డర్లకు డిసెంబర్ 31 చివరి అవకాశం.. తెలుగు ప్రజలారా మేల్కోండి..!!
Ratio Card e-KYC: భారతదేశంలో కోట్ల మంది ప్రజలు ఇప్పటికి ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న ఆహార ధాన్యాలపై ప్రతి నెల ఆధారపడి ఉంటుంది. అనేక రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలు, కేంద్రం అందించే వివిధ నిత్యావసర సరకులను సబ్సిడీ ధరలకు ఇవ్వటానికి చాలా కీలకంగా రేషన్ కార్డులను ఆధారంగా ఉపయోగిస్తుందని తెలిసిందే.
అయితే ఈ ప్రక్రియలో ఎలాంటి అంతరాయం లేకుండా సబ్సిడీ కింద కార్డు హోల్డర్లు రేషన్ అందుకోవటానికి తప్పనిసరిగా రేషన్ కార్డుల ఈకేవైసీని అప్‌డేట్ చేయటం చాలా ముఖ్యం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల మంది కార్డు హోల్డర్లు ఈ విషయాన్ని ఇప్పుడు సీరియస్‌గా తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. దీనికింద కార్డులో ఉన్న ప్రతి వ్యక్తి తన ఈకేవైసీ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయటం తప్పనిసరి. గతంలో దీనికి చివరి తేదీని ప్రభుత్వం అక్టోబర్ 31గా ఉంచగా.. ప్రస్తుతం దీనిని డిసెంబర్ 31కి పొడిగించింది. అనేక సమస్యలతో పాటు లబ్ధిదారుల నుంచి అనుకున్న స్థాయిలో స్పందన లభించకపోవటంతో ప్రభుత్వం గడువును పెంచినట్లు వెల్లడించింది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా రేషన్ కార్డులకు వినియోగదారుల ఆధార్ కార్డులను లింక్ చేసే ప్రక్రియ పూర్తయింది. అయినప్పటికీ ఆహార పంపిణీ విషయంలో 2-4 శాతం తప్పులు దొర్లుతున్నాయని తెలుస్తోంది. 100 శాతం తప్పులను నివారించటానికి తాజాగా ప్రభుత్వం రేషన్ కార్డ్ హోల్డర్లను ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని కోరుతోంది. ఈ ప్రక్రియ కింద కార్డ్ హోల్డర్లు తమ ఆధార్ నంబర్‌లను కొత్త 4G e-POS మెషీన్‌లలో నమోదు చేయాలి. ఈ క్రమంలో ధృవీకరణ కోసం వేలిముద్రలను తప్పనిసరిగా స్కాన్ చేయాలి. గడచిన కొన్ని నెలలుగా సర్వర్ సమస్యలు ప్రక్రియను సజావుగా పూర్తి చేయటంలో అంతరాయాలు కలిగిస్తున్నాయి. దీంతో విసిగిపోయిన లబ్ధిదారులు ప్రక్రియను పూర్తి చేయటం నిలిపివేశారు.
అనేక రేషన్ కార్డుల్లో చనిపోయిన వ్యక్తుల పేర్లను తొలగించకపోవటం.. పెళ్లి తర్వాత కార్డులో ఇంటిపేర్ల మార్పు, కొత్త సభ్యులను యాడ్ చేయటంలో అలసత్వం వంటి సమస్యలను నిరోధించాలని ప్రభుత్వం తాజాగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయటాన్ని తప్పనిసరిగా మార్చింది. చాలా చోట్ల వేలిముద్ర గుర్తింపు సరిగా పనిచేయకపోవటంతో.. ఐరిస్ స్కాన్‌లను ఉపయోగించి రిజిస్ట్రేషన్లు పూర్తి చేయటంతో ప్రాసెసింగ్ వేగాన్ని మెరుగుపడిందని తెలుస్తోంది. ఈ ప్రక్రియను వీలైనంత వేగవంతం చేయాలని ఆహార పంపిణీ శాఖ దుకాణాల యజమానులను ఆదేశించింది. ఈ క్రమంలో ఏవైనా సమస్యలుంటే అడ్మినిస్ట్రేషన్‌కి నివేదించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఇందుకోసం ప్రజలు నేరుగా వారి రేషన్ దుకాణానికి వెళ్లి వారి KYCని అప్‌డేట్ చేయవచ్చు. రేషన్ షాపుల్లో వేలిముద్రలు నమోదు చేసుకుంటే వివరాలు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయి.


Click it and Unblock the Notifications