Passport Application: నేటి కాలంలో చాలా మంది ముందుగానే అవసరం ఉన్నా లేకున్నా పాస్‍పోర్ట్ పొందుతున్నారు. ఉద్యోగంలో భాగంగా విదేశాలకు వెళ్లాల్సిన అవసరం నిత్యకృత్యంగా మారిపోవటంతో పాస్‍పోర్ట్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఇటీవల పాస్‍పోర్ట్ కార్యాలయాల్లో దరఖాస్తులు చేస్తున్నారు.
అయితే ఈ క్రమంలో హైదరాబాదులో చాలా మంది దరఖాస్తుదారులు ప్రూఫ్ ఆఫ్ బర్త్ కింద ఆధార్ కార్డులను అందిస్తున్నారు. వాస్తవానికి గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వ్యక్తులు తమ బర్త్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డును వినియోగించటాన్ని నిలిపివేసిన సంగతి చాలా మందికి తెలియకపోవటమే దీనికి కారణంగా తెలుస్తోంది. అయితే ఇది తెలియక చాలా మంది చేస్తున్న పొరపాటు డాక్యుమెంటేషన్ కారణంగా వారి వీసా ప్రాసెసింగ్ ఆలస్యం అవుతోంది. అపాయింట్‌మెంట్‌లను రీషెడ్యూల్ చేసి, అవసరమైన పత్రాలను మళ్లీ సమర్పించిన తర్వాత కూడా దరఖాస్తుదారులు పది రోజుల వరకు సమయాన్ని నష్టపోతారు. దీంతో పాస్‌పోర్ట్‌ల కోసం వేచి ఉండే సమయం పెరిగిపోతోంది.

అక్టోబర్ 24, 2024లో గౌరవనీయ సుప్రీం కోర్టు ఆధార్ అర్హతపై తీర్పు ఇస్తూ దీనిని జనన ధృవీకరణ పత్రంగా గుర్తించటం కుదరదని స్పష్టంగా వెల్లడించింది. ఈ క్రమంలో స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ ఇందుకోసం వినియోగించవచ్చని వెల్లడించింది. ఆధార్ కేవలం యూనివర్సల్ ఐడెంటిటీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మాత్రమేనని యూఐడీఏఐ వెల్లడించటం దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలో పాస్ పోర్ట్ అధికారులు రెసిడెన్సీ ప్రూఫ్ కింద గుర్తించబడినవి ఇవే..
- యూటిలిటీ బిల్స్(ఎలక్ట్రిసిటీ, ఫోన్, పోస్ట్ పెయిడ్ మెుబైల్)
- ఆదాయపు పన్ను అసెస్మెంట్ ఆర్డర్
- ఓటర్ ఐడి
- గ్యాస్ కనెక్షన్ ప్రూఫ్
- కంపెనీ నుంచి అడ్రస్ సర్టిఫికెట్
- జీవిత భాగస్వామి పాస్ పోర్ట్
- తల్లిదండ్రులు పాస్ పోప్ట్ మైనర్లకు
- ఆధార్ కార్డ్
- రెంట్ అగ్రిమెంట్
- బ్యాంక్ పాస్ బుక్
జనన ధృవీకరణకు అంగీకరించబడే డాక్యుమెంట్లు..
- మున్సిపల్ అధికారుల నుంచి బర్త్ సర్టిఫికెట్
- 10వ తరగతి మార్కుల పత్రం
- ఎల్ఐసీ పాలసీ బాండ్
- ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రికార్డులు
- ఓటర్ ఐడీ
- డ్రైవింగ్ లైసెన్స్
- అనాథాశ్రమం సంస్థ హెడ్ డిక్లరేషన్
పాస్ పోర్టు పొందటంలో జాప్యాలను నివారించటానికి ప్రజలు పైన పేర్కొన్న అధికారికంగా అంగీకరించే డాక్యుమెంట్లను తత్కాల్ లేదా సాధారణ పాస్ పోర్ట్ అప్లికేషన్ సమర్పణ సమయంలో జతచేయాల్సి ఉంటుంది. ఇది సమయాన్ని ఆదాచేయటంతో పాటు చివరి నిమిషంలో జాప్యాలను నివారిస్తుందని దరఖాస్తుదారులు గుర్తుంచుకోవాలి.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

Hyderabad: షాపింగ్, వెల్నెస్, గ్యాస్ట్రోనమీ.. హైదరాబాద్ బ్రాండింగ్ మార్చబోతున్న మూడు కీలక స్తంభాలు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications