వైఫై నెట్ వర్క్‌ను వినియోగించుకొని వాట్సాప్, స్కైప్, గూగుల్ డుయో కాల్స్ చేసుకోవడం తెలిసిందే. అయితే భారతీ ఎయిర్ టెల్ తమ ప్రీపెయిడ్, పోస్ట్ పేయిడ్ కస్టమర్లకు సరికొత్త అవకాశాన్ని తెచ్చింది. ఈ వైఫైతో సాధారణ కాల్స్ చేసుకునే సదుపాయాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల్లో కల్పించింది. ఈ మేరకు భారతీ ఎయిర్ టెల్ ప్రకటన చేసింది.

ఏపీ, తెలంగాణ సహా ఈ 6 రీజియన్లలో...
వైఫైతో సాధారణ కాల్స్ చేసుకునే వెసులుబాటును ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ముంబై, కోల్‌కతా టెలికం సర్కిల్స్‌లలో ఈ అవకాశం కల్పించింది. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీ-NCR ప్రాంతంలో దీనిని ప్రారంభించారు. ఇప్పుడు మరో ఆరు రీజియన్లకు దీనిని విస్తరించారు. ఇది ఎయిర్‌టెల్ మొబైల్ సబ్‌స్క్రైబర్స్ అందరికీ వర్తిస్తుంది. ఆరు టెలికం సర్కిల్స్‌లోని ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు ఇది అందుబాటులో ఉంటుంది.

ప్రత్యేక యాప్ అవసరం లేదు...
ఆరు రీజియన్లలో భాగంగా ఏపీ, తెలంగాణలకు వైఫై కాల్స్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. ఇళ్లు, కార్యాలయాల్లో ఉన్నప్పుడు, వైఫై సదుపాయం ఉంటే ఎయిర్‌టెల్ స్మార్ట్ ఫోన్ల వినియోగదారులు అదనపు ఖర్చు లేకుండానే కాల్స్ చేసుకోవచ్చు. ఇందు కోసం ప్రత్యేక యాప్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతానికి ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ హోమ్ బ్రాడ్ బ్యాండుకే..
తెలుగు రాష్ట్రాలలో తొలిసారి ఎయిర్‌టెల్ వీవో వైఫై సదుపాయాన్ని ప్రవేశ పెట్టిందని భారతీ ఎయిర్‌టెల్ ఏపీ, తెలంగాణ సీఈవో అవన్‌నీత్ సింగ్ పూరి తెలిపారు. తొలుత ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ హోమ్ బ్రాడ్ బ్యాండుకే ఈ సదుపాయం కల్పిస్తున్నామని, ఆ తర్వాత ఇతర బ్రాడ్ బాండ్ సర్వీసులు, వైఫై హాట్ స్పాట్ కేంద్రాలలోను వినియోగించుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.

వైఫై ఏ ఫోన్లలో...
ఈ ఫోన్లలో వైఫై సౌకర్యం అందుబాటులో ఉంటుంది..
- ఐఫోన్ మోడల్స్ 6S, iPhone 11 Pro, iPhone 11, iPhone XR, iPhone XS, iPhone XS Max, iPhone X, iPhone 8 and iPhone 8 Plus, iPhone 7, iPhone 7 Plus, iPhone 6s, iPhone 6s Plus, iPhone SE
- షియోమీ - Redmi K20, Redmi K20 Pro and POCO F1
- శాంసంగ్ S10, S10 , S10e, M20 and One Plus 6 and 6T, J6, A10s, On6, M30s,
- వన్ ప్లస్ OnePlus 7, OnePlus 7 Pro, OnePlus 7T, OnePlus 7T Pro

ఎలా వినియోగించాలి?
- స్మార్ట్ ఫోన్ నుంచి కాల్ చేసేందుకు వీలవుతుందో లేదో ఎయిర్‌టెల్ డాట్ ఇన్/వైఫై కాలింగ్‌లో చెక్ చేసుకోవాలి.
- ఆ తర్వాత వైఫై కాలింగ్‌కు ఉపకరించే తాజా వర్షన్‌కు ఆపరేటింగ్ సిస్టంను అప్ గ్రేడ్ చేయాలి.
- ఫోన్ సెట్టింగ్స్‌లో వైఫై కాలింగ్ ఫీచర్‌ను ఆన్ చేయాలి.
- VoLTE సదుపాయాన్ని ఆన్ చేసి ఉంచుకుంటే ఈ కాల్స్ చేసుకోవచ్చు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications