TCS: గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన టీసీఎస్ స్టాక్.. మిగతా ఐటీ స్టాక్స్ కూడా..!
ఏఐ రాకతో భారత ఐటీ కంపెనీల పని అయిపోయిందని చాలా మంది భావించారు. దీంతో భారత ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీ షేర్లు తగ్గుతూ వస్తున్నాయి. అయితే తాజాగా టాటా ఐటీ స్టాక్స్ లాభాల బాట పట్టాయి. సోమవారం టీసీఎస్ 6 శాతానికి పైగా పెరిగింది. గత సెషన్ లో టీసీఎస్ ప్రైస్ రూ.20269 వద్ద ముగిసింది. సోమవారం మార్కెట్ ప్రారంభం కాగానే స్టాక్ ప్రైస్ 6 శాతం పెరిగింది. దీంతో రూ.2190 కు చేరుకుంది. దీంతో టీసీఎస్ మార్కెట్ వాల్యూ పెరిగింది. గత సెషన్ టీసీఎస్ మార్కెట్ విలువ రూ.7.95 లక్షల కోట్లు ఉండగా.. సోమవారం నిమిషాల వ్యవధిలో రూ.45 వేలకు కోట్లకు పైగా పెరిగింది.
టీసీఎస్ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 7.95 లక్షల కోట్లుగా ఉండగా ఇవాళ ఒక్కరోజే నిమిషాల వ్యవధిలో రూ. 45 వేల కోట్లకుపైగా పెరిగింది. టీసీఎస్ మొదటి త్రైమాసిక ఫలితాలు బాగుండడంతో షేర్ ధర పెరిగినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా టీసీఎస్ కూడా ఏఐపై దృష్టి సారిస్తోంది. వచ్చే రోజుల్లో 6 వేల నుంచి 9 వేల మంది అత్యంత నిపుణులతో ఫార్వర్డ్ డెప్లాయింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు టీసీఎస్ ప్రకటించింది. ఇందుకోసం ఆ కంపెనీ భారీగా ఖర్చు చేస్తోంది. దీంతో కూడా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది.

కంపెనీ జులై 9న టీసీఎస్ మొదటి త్రైమాసికం ఫలితాల్ని ప్రకటించింది. ఇది అంచనాల్ని మించి ఫలితాలు ఉన్నాయి. టీసీఎస్ కార్యకలాపాల ఆదాయం 14 శాతం పెరిగి రూ. 72,275 కోట్లకు పెరిగింది. లాభం కూడా పెరిగి రూ. 13349 కోట్లకు చేరింది. అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ టీసీఎస్ రాణించింది. భవిష్యత్ లో కూడా మరింత గా బలంగా పని చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఇవాళ టీసీఎస్ ఒక్కటే కాకుండా మిగతా ఐటీ స్టాక్స్ కూడా రాణించాయి. జులై 13నే క్యూ1 ఫలితాల్ని ప్రకటించనున్న హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ ధర కూడా 5 శాతం వరకు పెరిగింది. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా షేర్లు కూడా 3 శాతానికిపైగా పెరిగాయి. విప్రో స్టాక్ 2 శాతానికిపైగా వృద్ధి సాధించింది.
కాగా టీసీఎస్, ఇన్ఫోసిస్ తమ గరిష్టాల నుంచి భారీగా పడిపోయాయి. ఈ సంవత్సరం జనవరి 30న టీసీఎస్ షేరు ప్రైస్ రూ.3,169 వద్ద ఉండేది. ఇప్పుడు రూ.2190 వద్ద కొనసాగుతోంది. ఇన్ఫోసిస్ షేర్ ప్రైస్ ఈ సంవత్సరం జనవరి 21న 1659 ఉండగా.. ప్రస్తుతం రూ.1102 వద్ద ట్రేడవుతోంది. ఏఐ వల్ల భారతీయ ఐటీ పరిశ్రమ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications