ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్‌కు(ABCL) చెందిన లైఫ్ ఇన్సురెన్స్ సబ్సిడరీ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సురెన్స్(ABSLI) ప్రీమియం రేట్లను మారుస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ప్రతి ఒక్కరు టర్మ్ ఇన్సురెన్స్ తీసుకోవడం ప్రయోజనకరం. లైఫ్ ఇన్సురెన్స్, హెల్త్ ఇన్సురెన్స్ ఉన్నప్పటికీ టర్మ్ ఇన్సురెన్స్ కచ్చితంగా ఉండాలి. ఇది ఎంత తక్కువ వయసులో తీసుకుంటే ప్రీమియం కూడా అంత తక్కువగా ఉంటుంది.
టర్మ్ ఇన్సురెన్స్ తీసుకున్న తర్వాత పాలసీదారుకు ఏదైనా అయితే ఇన్సురెన్స్ మొత్తం పాలసీదారు కుటుంబానికి అందుతుంది. అందుకే చాలామంది టర్మ్ ఇన్సురెన్స్ తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇలాంటి టర్మ్ ఇన్సురెన్స్‌లో ఆదిత్య బిర్లా సన్ లైఫ్ కూడా ముఖ్యమైనది. ఇది తాజాగా ప్రీమియం రేట్లను తగ్గించింది.

ప్రీమియం రేట్లు ఎంత తగ్గాయంటే
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ తాజాగా టర్మ్ ఇన్సురెన్స్ ప్రీమియం రేట్లను 15 శాతం వరకు తగ్గిస్తూ ప్రకటన చేసింది. ఈ ప్లాన్ సాధారణంగా వేరే కంపెనీలు ఇచ్చే ట్రెడిషనల్ ఇన్సురెన్స్ ప్లాన్ కాదని, ప్రతి కస్టమర్ నిర్దిష్టమైన భద్రత అవసరాలను తీర్చేదిగా ఉంటుందని ఆదిత్య బిర్లా తెలిపింది. ఈ ప్లాన్ ప్రకారం కస్టమర్‌కు అరవై సంవత్సరాలు దాటితే సర్వైవల్ బెనిఫిట్ ఆప్షన్ ద్వారా ఒక గ్యారంటీ ఆదాయం ఉండటం దీని ప్రత్యేకత.
ఇదే ఇన్సురెన్స్‌లో జాయింట్ లైఫ్ ప్రొటక్షన్, క్రిటికల్ ఇల్-నెస్ వంటి వాటిని కూడా కవర్ చేస్తారు. కస్టమర్లకు బెస్ట్ ఇన్సురెన్స్ ప్లాన్ అందించడం కోసం ఈ టర్మ్ ఇన్సురెన్స్ ప్లాన్ ప్రీమియంను తగ్గించినట్లు తెలిపింది. ఫ్యామిలీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం ఇది బెస్ట్ ప్లాన్ అని బిర్లా సన్ లైఫ్ ఇన్సురెన్స్ ఎండీ తెలిపారు.

టర్మ్ ఇన్సురెన్స్‌లో అనుకూలతలు
ఈ టర్మ్ ఇన్సురెన్స్‌లో పలు అనుకూలతనలు ఉన్నాయి. కస్టమర్ తన ఆదాయం, ఖర్చుల ఆధారంగా కవర్ చేసుకునే వెసులుబాటును అందిస్తుంది. జాయింట్ లైఫ్ ప్రొటెక్షన్, క్రిటికల్ ఇల్‌నెస్ కవర్, కొన్ని రైడర్ ఆప్షన్స్ వంటి వాటి నుండి ఎంచుకోవచ్చు. వివిధ రకాల ప్రయోజనాలను మీ కుటుంబ సభ్యులకు విస్తరించవచ్చు. తాజాగా, టర్మ్ ఇన్సురెన్స్ ప్లాన్ రేటు తగ్గింపుతో పాటు ఈ ప్లాన్ కస్టమర్లకు వివిధ చెల్లింపు నిబంధనలు, పాలసీ వ్యవధులు, డెత్ బెనిఫిట్ పే-అవుట్ ఎంపికలను అందిస్తుంది. ఇవి కస్టమర్ల వ్యక్తిగత రక్షణ అవసరాలకు సరిపోతాయి.

టర్మ్ ఇన్సురెన్స్ ప్లాన్స్
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సురెన్స్‌లో ఏబీఎస్ఎల్ఐ లైఫ్ షీల్డ్ ప్లాన్, ఏబీఎస్ఎల్ఐ డిజిషీల్డ్ ప్లాన్, ఏబీఎస్ఎల్ఐ సరల్ జీవన్ బీమా వంటివి ఉన్నాయి. ఏబీఎస్ఎల్ఐ లైఫ్ షీల్డ్ ప్లాన్ మీ కుటుంబ అవసరాలకు అనుగుణంగా 8 విభిన్న ఆప్షన్స్ నుండి ఎంచుకునే సౌకర్యం ఉంది.
ఏబీఎస్ఎల్ఐ డిజిషీల్డ్ ప్లాన్ మీ వివిధ అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవడానికి పది ప్లాన్ ఎంపికలను అందించే సమగ్ర ప్రణాళిక.
సరల్ జీవన్ బీమా మీ కుటుంబానికి దీర్ఘకాలిక లక్ష్యాలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి, ఒకేసారి పెద్ద మొత్తంలో అందించే సాధారణ బీమా పథకం.
కరోనా మహమ్మారి ఊహించిన దాని కంటే ఎక్కువ కాలం కొనసాగిందని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారని, తమ ఉత్పత్తి ధరల్లో సవరణలు చేయడానికి ముందు మహమ్మారిని గమనిస్తున్నామని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సురెకరోనా మహమ్మారి ఊహించిన దాని కంటే ఎక్కువ కాలం కొనసాగిందని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారని, తమ ఉత్పత్తి ధరల్లో సవరణలు చేయడానికి ముందు మహమ్మారిని గమనిస్తున్నామని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సురెన్స్ ఎండీ, సీఈవో కమలేష్ రావ్ అన్నారు. న్స్ ఎండీ, సీఈవో కమలేష్ రావ్ అన్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications