నేటితో మే నెల పూర్తవుతుంది. జూన్ నెల ప్రారంభమవుతుంది. అయితే, రేపటి నుంచి ఆధార్ అప్‌డేట్, ఎల్‌పిజి సిలిండర్ ధరలు, డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి పలు మార్పులు కనిపిస్తాయి. ఇవి మన బడ్జెట్ విషయంలో కూడా చాలా మార్పులు తీసుకొస్తాయి. నిత్యం వాడే టూవీలర్ వెహికల్‌కు సంబంధించిన కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ జూన్ 1, 2024 నుంచి మారనున్నాయి. దీంతో పాటు వంటింట్లో వాడే ఎల్‌పిజి సిలిండర్ ధరల నెలవారీ సవరణ కూడా ఒకటో తేదీ నుంచి కొత్త మార్పులు రానున్నాయి. ఆధార్ కార్డు కు సంబంధించిన అప్ డేట్ కూడా రేపటినుంచే అమల్లోకి వస్తోంది. ఇవి ఇంటి బడ్జెట్‌ను పెంచే విధంగా కూడా ఉంటాయి. వీటిలో వచ్చే ప్రధాన మార్పుల గురించి తెలుసుకుందాం.
ఫ్రీగా ఆధార్ అప్‌డేట్..
రేపటి నుంచి ఫ్రీగా ఆధార్‌కార్డ్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు..ఆధార్ కార్డ్ హోల్డర్లు యూఐడీఏఐ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆధార్ కార్డ్ ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవాలనుకునేవారు ఉచితంగానే చేసుకోవచ్చు. ఈ అవకాశం కూడా జూన్ 1 నుంచి జూన్ 14 వరకు ఉంటుంది. ఇక ఆఫ్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవాలనుకునేవారు మాత్రం ప్రతి అప్‌డేట్‌కు 50 రూపాయలు చెల్లించి వినియోగదారులు తమ ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోగలరని యూఐడీఏఐ పేర్కొంది. ఇక, ఈ సేవలు జూన్ 14 వరకు మైధార్ పోర్టల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయని యూఐడీఏఐ తెలిపింది.

ఎల్‌పిజి సిలిండర్ ధరలు..
జూన్ 1వ తేదిన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ ధరల్లో పలు మార్పులు జరగనున్నాయి. ఈ కంపెనీలు మే నెలలో ఎల్‌పీజి సిలిండర్ల ధరలను తగ్గించాయి. ఇక జూన్ నెలలో అవి మరింత తగ్గనున్నాయో, లేక పెరగనున్నాయో రేపటితో తెలిసిపోతుంది.
డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు..
రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం కొత్త నిబంధనలను వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం రేపటి (జూన్ 1,2024) నుంచి ప్రైవేటు శిక్షణ కేంద్రాల్లో డ్రైవింగ్ పరీక్షలు చేయించుకోవచ్చని రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ కేంద్రాలు లైసెన్స్ అర్హత కోసం పరీక్షలు నిర్వహించడానికి.. సర్టిఫికేట్‌లను జారీ చేయడానికి మాత్రమే అధికారం కలిగి ఉంటాయి. వీటితోపాటు జరిమానలను కూడా పెంచింది. అతివేగానికి జరిమానా రూ. 1,000 నుండి రూ. 2,000 వరకు ఉంటుంది. ఒకవేళ, డ్రైవింగ్‌లో మైనర్ పట్టుబడితే మాత్రం అతను రూ.25,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు ఆ వెహికల్ యజమాని రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇక, మైనర్‌కు పాతికేళ్లు వచ్చే వరకు లైసెన్స్‌కు అనర్హుడిగా ప్రకటిస్తారు. ఈ నిబంధనలన్నీ జూన్ 1నుంచి అమల్లోకి రానున్నాయి.


Click it and Unblock the Notifications