EPFO: పీఎఫ్ కాంట్రిబ్యూషన్ తగ్గించుకుంటున్నారా అయితే లక్షల్లో నష్టపోతారు..!
ఉద్యోగం చేసే దాదాపు అందరికీ పీఎఫ్ ఖాతా ఉంటుంది. చందాదారుల జీతంలో నెలనెలా పీఎఫ్ కు కొంత మొత్తాన్ని కేటాయిస్తారు. ఈ మొత్తానికి కేంద్ర ప్రభుత్వం వడ్డీ కూడా చెల్లిస్తోంది. ప్రస్తుతం పీఎఫ్ 8.25 శాతం వడ్డీ చెల్లిస్తోంది. అయితే పీఎఫ్ ఖాతాకు సంబంధించి అనేక మార్పులు జరుగుతున్నాయి. ఈపీఎఫ్ఓకు సంబంధించి 2026 కీలక మార్పులు చేశారు. ఉద్యోగులు తమ వేతనంలో ఎంత శాతం పీఎఫ్ కు కేటాయించాలో ఎంచుకునే అవకాశం కల్పించారు. 9 శాతం లేదా నెలకు రూ.1800, 12 శాతం చెల్లించే అవకాశం ఉంది.
మీరు తక్కువ పీఎఫ్ చెల్లించాలనుకుంటే.. మీ టేక్ హోమ్ జీతం ఎక్కువగా ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల జీతం ఎక్కువ వచ్చినా.. రిటర్మెంట్ తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మీకు ఇంకా ఎంత కాలం సర్వీస్ ఉంది, మీ లక్ష్యాలు ఏమిటని తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. 12 శాతం చెల్లింపు ఉంటే రిటైర్మెంట్ తర్వాత మంచి కార్పస్ వస్తుంది. అయితే హోం లోన్ వాయిదాలు చెల్లించే వారు, పిల్లల చదువులు ఉన్నవారు 9 శాతం కాంట్రిబ్యూషన్ చేస్తే సరిపోతుందని చెబుతున్నారు.

పీఎఫ్ కాంట్రిబ్యూషన్ తగ్గించుకుని.. మిగతా డబ్బను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఎన్పీఎస్ పెట్టుబడి పెట్టొచ్చని సూచిస్తున్నారు. అయితే ఆర్థిక క్రమశిక్షణ ఉన్నవారికే ఇది సాధ్యమని పేర్కొంటున్నారు. అందుకే ఎక్కువ మంది ఉద్యోగులకు 12 శాతం EPF సురక్షితమైన డిఫాల్ట్ ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు. కాగా తాజాగా పీఎఫ్ ఖాతాదారుల ఖాతాల్లో వడ్డీ సొమ్ము జమ జేసింది. చరిత్రలోనే మొదటిసారిగా పూర్తిస్థాయి ఆటోమేషన్ ద్వారా వడ్డీ జమ ప్రక్రియను పూర్తి చేసింది. గతంలో పీఎఫ్ వడ్డీ సాధారణంగా సెప్టెంబర్ లేదా నవంబర్ నెలల్లో సభ్యుల ఖాతాల్లో జమ అయ్యేది. అయితే ఈ ఏడాది కొత్త సాంకేతిక వ్యవస్థ కారణంగా జూలై మధ్య నాటికే వడ్డీ బదిలీ ప్రక్రియ పూర్తి చేశారు.
రూ.1.44 లక్షల కోట్ల వడ్డీని చందాదారుల ఖాతాల్లో జమ చేశారు. దాదాపు 34 కోట్ల ఖాతాలకు వడ్డీ బదిలీ ప్రక్రియను పూర్తి చేసినట్లు EPFO తెలిపింది. ఉదాహరణకు పీఎఫ్ ఖాతాలో రూ.10 లక్షలు ఉంటే.. మీకు 8.25 శాతం వడ్డీతో రూ.82,500 వస్తుంది. అయితే మీ పీఎఫ్ ఖాతాలో వడ్డీ జమ అయిందో లేదో తెలుసుకోవచ్చు. ఉమాంగ్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. మిస్డ్ కాల్ ద్వారా కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. 9966044425కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఎస్ఎంఎస్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.


Click it and Unblock the Notifications