EPS: ఎంప్లాయ్ పెన్షన్ స్కీమ్ కనీస పెన్షన్ రూ.1000 నుంచి రూ.7500 పెంపు..!

ఈపీఎఫ్ఓ చందాదారులకు త్వరలో శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ పరిధిలోని ఉద్యోగులకు అందించే నెలవారీ కనీస పెన్షన్ పెంచే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కనీస పెన్షన్ రూ.1000 గా ఉంది. దీన్ని రూ.7500లకు పెంచాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. కనీస పెన్షన్‌తో పాటు డియర్‌నెస్ అలవెన్స్ అంశం తాజాగా పార్లమెంట్ లో చర్చ జరిగింది. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ సమాధానం చెప్పింది. ప్రజా ప్రతినిధులు, వివిధ ట్రేడ్ యూనియన్లు, స్టాక్ హోల్డర్స్ నుంచి ఈపీఎస్ కనీస పెన్షన్ పెంచాలని ప్రతిపాదనలు వచ్చినట్లు పేర్కొంది.

అయితే కనీస పెన్షన్ పెంచాలనే అంశంపై కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. సామాజిక భద్రతా అవసరాలు, పెన్షన్ నిధి దీర్ఘకాలిక సుస్థిరత మధ్య సమతుల్యతను పాటించేలా నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది. నెలకు రూ.7,500 కనీస పింఛనుతో పాటు డియర్‌నెస్ అలవెన్స్ (DA) ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్. దీనిపై ప్రభుత్వం నిర్ణయం ఏమిటో చెప్పాలని ఎంపీ భాసాహెబ్ రాజారామ్ వాక్‌చౌరే లోక్‌సభ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.1000 కనీస పెన్షన్ వృద్ధులకు సరిపోతుందా అని అడిగారు. ఇందుకు సంబంధించి నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనలపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. కనీస పెన్షన్ కు సంబంధించి నిర్ణయం ఎప్పుడు ప్రకటిస్తారో చెప్పాలని వాక్‌చౌరే కోరారు.

PF

ఇందుకు సంబంధించి కేంద్ర కార్మిక శాఖ, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శోభా కరాంద్లాజే మాట్లాడారు. ఇప్పుడు నెలకు రూ. 1,000గా ఉన్న కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని కోరుతూ ప్రజా ప్రతినిధులతో పాటు కార్మిక సంఘాలు, వివిధ వర్గాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. ఉద్యోగుల పింఛను పథకం అనేది ఒక నిర్ధారిత విరాళమని.. నిర్వచిత ప్రయోజనం గల సామాజిక భద్రతా పథకమని మంత్రి పేర్కొన్నారు. దీనిలో పింఛను ప్రయోజనాలు పింఛను నిధికి చెల్లించిన విరాళాలు, ఫండ్ ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉంటాయని తెలిపారు.

ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ 1995 ప్రకారం పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.1000 ఇస్తున్నారు. అయిత రూ.1000 తో ఎలా బతుకుతారని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఈ పెన్షన్ కంటే.. రాష్ట్రాల్లో ఇచ్చే పింఛన్లు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి. కనీస పెన్షన్ రూ.1000 నుంచి రూ.7,500 లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ కనీస పెన్షన్ పెంపు పై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. అయితే దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+