క్రమరహిత క్రెడిట్ కార్డు చెల్లింపుల వల్ల నష్టాలు ఉంటాయి. క్రెడిట్ కార్డు తీసుకుంటే చెల్లింపులు గడువులోగా కచ్చితంగా చెల్లించాలి. లేదంటే భారీ జరిమానా తప్పదు. క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించడంలో విఫలమైతే అతిపెద్ద ఆర్థిక తప్పిదాలలో ఒకటి అవుతుంది. క్రెడిట్ కార్డు ఉపయోగం అనేది మన చెల్లింపుల క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుంది. నిర్ణీత గడువులలో చెల్లింపులు జరిపితే ఎలాంటి చిక్కులు లేవు. కానీ కాస్త ఆలస్యమైన ఆ భారం మోపెడు అవుతుంది. క్రెడిట్ కార్డు చెల్లింపులు ఆలస్యం చేస్తే ఆర్థిక భారంతో పాటు ఇతర ప్రభావం కూడా ఉంటుంది.

ఆలస్య చెల్లింపు రుసుము, ఫైనాన్స్ ఛార్జీలు
క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే రుణం లభించకపోవచ్చు లేదా అధిక వడ్డీ రేటు ఉండవచ్చు. గడువు తేదీలోగా క్రెడిట్ కార్డు మినిమం బ్యాలెన్స్ చెల్లింపులను ఆలస్యంగా చెల్లిస్తే లేట్ పేమెంట్ ఫీజు ఉంటుంది. మినిమం బిల్లు సాధారణంగా బిల్లు మొత్తంలో 5 శాతం వరకు ఉంటుంది. దీనికి అదనంగా మీ క్రెడిట్ కార్డులో ఉన్న ఏదైనా ఈఎంఐతో పాటు వర్తించే ఛార్జీలు కూడా చెల్లించవలసిన కనీస మొత్తానికి కలిపి లెక్కిస్తారు. కనీస మొత్తాన్ని చెల్లించకపోతే లేట్ ఫీగా రూ.1300 ఉంటుంది.
ఇక, మొత్తం క్రెడిట్ కార్డు బిల్లు బకాయిల కంటే తక్కువ చెల్లింపులు జరిపితే చెల్లింపులు జరపని బిల్లు మొత్తంలో 23 శాతం నుండి 49 శాతం వరకు భారీగా ఛార్జీలు వర్తిస్తాయి. మినిమం మొత్తాన్ని గడువులోగా చెల్లిస్తే లేట్ ఫీజు ఉండదు. అయితే చెల్లించాల్సిన మొత్తంపై వర్తించే ఛార్జీ ఉంటుంది.

క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం
ఏదైనా రుణం తీసుకునే సమయంలో బ్యాంకులు మొదట మీ క్రెడిట్ స్కోర్‌ను చూస్తాయి. మీ క్రెడిట్ తిరిగి చెల్లించే హిస్టరీ ఆధారంగా మీ క్రెడిట్ స్కోర్ లెక్కించబడుతుంది. అంటే మీరు చేసే చెల్లింపులు సక్రమంగా లేకుంటే మీ క్రెడిట్ స్కోర్ పైన ప్రభావం ఉంటుంది. చెల్లింపులు సరిగ్గా లేకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గడానికి కారణమవుతుంది. ఈ క్రెడిట్ స్కోర్ భవిష్యత్తులో మీ రుణ అర్హతను, క్రెడిట్ కార్డు అర్హతను దెబ్బతీస్తుంది.

వడ్డీలేని గ్రేస్ పీరియడ్
క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్స్ చేసిన తేదీ నుండి చెల్లింపు గడువు తేదీ వ్యవధి వరకు వడ్డీ వర్తించదు. సాధారణంగా ఇది 18 రోజుల నుండి 55 రోజులు ఉంటుంది. ఈ సమయంలోని క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్స్ పైన వడ్డీ ఉండదు. మీ మొత్తం క్రెడిట్ కార్డు బకాయి మొత్తాన్ని సకాలంలో చెల్లించడంలో విఫలమైతే, కార్డు జారీదారులు వడ్డీలేని కాలాన్ని ఉపసంహరించుకుంటారు. మొత్తం బకాయి చెల్లించే వరకు క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ పైన ఫైనాన్స్ ఛార్జీలు విధిస్తారు. అంటే తదుపరి బిల్లింగ్ చక్రంలో మీ లేటెస్ట్ ట్రాన్సాక్షన్స్ పైన వర్తించే ఫైనాన్స్ ఛార్జీలను వసూలు చేస్తారు.

రుణ ఆఫర్లపై ప్రభావం
క్రెడిట్ స్కోర్, క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా రుణలు తీసుకుంటే ముందుగా ఆమోదించిన రుణాలు, క్రెడిట్ కార్డుల ఆఫర్లను అందిస్తారు. క్రెడిట్ హిస్టరీ బాగా లేకుంటే క్రెడిట్ స్కోర్ పైన ప్రభావం చూపి, అలాంటి ఆఫర్లు రాకుండా పోతాయి. ఇలాంటి ఆఫర్లలో ఉత్పత్తులు తక్కువకు రావడం, ప్రాసెసింగ్ సమయం తక్కువగా ఉండటం వంటివి ఉంటాయి
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications