ప్రముఖ రైడ్ హైలింగ్ సంస్థ ఉబెర్... త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీలో బస్సు సర్వీసులను ప్రారంభించనుంది. ఈ మేరకు కంపెనీ ఇప్పటికే ప్రయోగాత్మకంగా మంగళవారం ఈ సేవను ప్రారంభించింది. వినియోగదారుల నుంచి స్పందన చూసిన తర్వాత పూర్తి స్థాయిలో ఉబెర్ యాప్ లో ఏసి బస్సులను బుక్ చేసుకొనే సదుపాయం అందుబాటులోకి తేనుంది. ఢిల్లీ లోని ప్రధాన రహదారుల్లో క్రమం తప్పకుండా తిరిగే ఏసీ బస్సుల్లో సీట్లను బుక్ చేసుకొనే సదుపాయం తొలుత కల్పించనుంది.
ఈ ప్రయోగం విజయవంతం అయితే... మిగితా పెద్ద నగరాల్లో కూడా బస్సు సీట్ బుకింగ్ సేవలను విస్తరించే ఏర్పాట్లు చేయనుంది. ఇప్పటికే ఇలాంటి సర్వీస్ ను ఉబెర్ ఈజిప్ట్ రాజధాని కైరో లో గతేడాది అక్టోబర్ లో ప్రవేశ పెట్టింది. ఉబెర్ బస్సు అప్ సేవలు అన్ని రకాల ఆండ్రాయిడ్ డివైస్ లు, అన్ని రకాల నెట్వర్క్స్ లో అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు ప్రముఖ వార్త సంస్థ ఐఏయెన్ఎస్ ఒక కథనంలో వెల్లడించింది.

షటిల్ సర్వీస్...
ఉబెర్ బస్సు సర్వీస్ లు అచ్ఛం ప్రస్తుతం అందుబాటులో ఉన్న షటిల్ సర్వీస్ లాగే పనిచేస్తాయి. పాసెంజర్ ను ఒక చోటు నుంచి మరో చోటుకు చేరవేస్తాయి.ఉబెర్ బస్సు సర్వీస్ ను కొత్తగా ప్రారంభించాం. ఈ సర్వీస్ ఎలా పనిచేస్తుందో పరిశీలించి తద్వారా కొత్త విషయాలను తెలుసుకొంటాం. ఒక వేల ఈ సర్వీస్ కు ఆదరణ లభిస్తే ఢిల్లీ వంటి నగరాల్లో దీనిని ప్రవేశపెడతాం అని ఉబెర్ సీఈఓ దార ఖోస్రోవిషాహి న్యూ ఢిల్లీ లో తెలిపారు. అయితే, ఈ బస్సు చార్జీలు ఎలా ఉంటాయో ఇంకా ఉబెర్ స్పష్టత ఇవ్వలేదు.

ఎలా పనిచేస్తుందంటే...
ఉబెర్ యాప్ లోకి లాగిన్ అయ్యి ... డెస్టినేషన్ ఎంచుకోవాలి. తర్వాత ఉబెర్ బస్సు ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. చార్జీలను రివ్యూ చేసుకున్నాక రిక్వెస్ట్ బటన్ ను ప్రెస్ చేయాలి. ట్రిప్ డీటెయిల్స్ వెల్లడించేందుకు ఉబెర్ 5 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఇదే మార్గం లో ప్రయాణించే ఇతర ప్రయాణికులతో మిమ్మల్ని అనుసంధానించేందుకు ఉబెర్ ఈ సమయాన్ని తీసుకొంటుంది. అలాగే, మీరు వెళ్లాల్సిన మార్గం కాకుండా ఇతర రూట్ల ఎంపిక జరగకుండా ఈ సమయంలో ఉబెర్ అనలిటిక్స్ వినియోగిస్తుంది. బస్సు బుక్ చేసుకున్నాక .. అది వచ్చేంత వరకు మీరు దానిని ట్రాక్ చేసుకోవచ్చు.

2 నిమిషాలే ఆగుతుంది...
ప్రయాణికులు ఎంచుకొన్న పిక్ అప్ పాయింట్ కు ఎంపిక చేసుకొన్న సమయానికంటే కొంత ముందుగా చేరుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు ఎంచుకున్న సమయానికి పిక్ అప్ పాయింట్ కు చేరుకోలేక పోతే... మీ కోసం 2 నిమిషాలు బస్సు వెయిట్ చేస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బస్సులో ఎక్కగానే బార్ కోడ్ స్కాన్ చేసి మీ టికెట్ ను డ్రైవర్ కు చూపించాల్సి ఉంటుంది. చార్జీలను నగదు రూపంలో లేదా ఉబెర్ యాప్ ద్వారా కూడా పే చేయవచ్చు.

నోటిఫికెషన్స్...
ప్రయాణికులు బస్సులో కూర్చున్న తర్వాత ... వారు దిగాల్సిన డెస్టినేషన్ పాయింట్ గురించిన నోటిఫికేషన్ ఉబెర్ ఎప్పటికప్పుడు ఇస్తుంటుంది. మీరు ఎంచుకున్న దిగాల్సిన చోటుకంటే మెరుగైన చోటు ఉంటె కూడా అది మీకు తెలియజేస్తుంది. దిగాల్సిన చోటు వచ్చే కాస్త ముందే మీకు నోటిఫికేషన్ ఇస్తుంది. అంతే కాకుండా మీరు దిగిన తర్వాత అక్కడి నుంచి చేరుకోవాల్సిన చోటుకు ఎలా నడిచి వెళ్ళొచ్చో కూడా తెలుపుతుంది. సో, మరేందుకు ఆలస్యం... ఉబెర్ బస్సు ఎక్కేయక?
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications