క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ఇదే సమయంలో ఈ కార్డు మోసాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ కార్డు మోసగాళ్ల చేతిలోపడి దుర్వినియోగం అయితే ఆ భారం కార్డుదారు భరించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డు రక్షణకు సంభందించిన బీమాను తీసుకోవడం వల్ల నిర్చింతగా ఉండవచ్చు కదా. ఇందుకోసం చెల్లించే మొత్తం కూడా తక్కువ స్థాయిలోనే ఉండటం వల్ల భారంకూడా పెద్దగా ఉండదు. వాలెట్ పోయినా లేదా దొంగతనానికి గురైనా కూడా ఈ బీమా ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఆ బీమాయే 'వాలెట్ కేర్'. దీన్ని బజాజ్ ఫిన్ సర్వ్ అందుబాటులోకి తెచ్చింది.
ఒక్క ఫోన్ కాల్ తో అన్ని కార్డులు బ్లాక్ చేయొచ్చు...
* పర్సు పోయినా లేదా దొంగతనానికి గురైనా ఒక్కసారిగా ఆందోళన మొదలవుతుంది.
* అందులో ఉన్న కార్డులను ఎలా బ్లాక్ చేయాలి. ఎలా వాటిని మళ్ళీ పొందాలన్న దాని గురించే ఆలోచిస్తుంటాము. అయితే వాలెట్ కేర్ ఇన్సూరెన్సు తీసుకుని ఉంటే అన్ని క్రెడిట్, డెబిట్ కార్డులను ఒక్క ఫోన్ కాల్ తో బ్లాక్ చేయవచ్చు.
* ప్రపంచంలో ఎక్కడినుంచైనా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు
* రూ. 599 చెల్లిస్తే రూ. 2 లక్షల వరకు కవరేజీని బజాజ్ ఫిన్ సెర్ప్ అందిస్తోంది.
* ఎమెర్జెన్సీ ట్రావెల్, హోటల్ అసిస్టెన్స్ తోపాటు పాన్ కార్డు లాంటి ముఖ్యమైన ఐడెంటిటీ కార్డులను ఉచితంగా తిరిగిపొందే సదుపాయాన్ని కల్పిస్తున్నది.
* పర్సు పోయిన సందర్భంలో వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి కార్డులను బ్లాక్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం 24 గంటలు కల్పిస్తున్నారు.

క్రెడిట్ కార్డు మోసాలకు..
* క్రెడిట్ కార్డు మోసాలకు ఈ కార్డు ద్వారా బీమా కవరేజీ పొందవచ్చు. మోసం జరిగినప్పుడు రూ.లక్ష వరకు కవరేజీ పొందవచ్చు.
* దేశీయ, విదేశీ ప్రయాణాల్లో చిక్కుకుపోతే హోటల్ బుకింగ్స్, టికెట్ కొనుగోళ్ళకు సంభందించి రూ. 80,000 వరకు ట్రావెల్ అసిస్టెన్స్ పొందవచ్చని కంపెనీ చెబుతోంది.
* మొబైల్ సిమ్ కార్డును బ్లాక్ చేయవచ్చు. ఐఈ ఎంఐ రిజిస్ట్రేషన్ చేయవచ్చు. విలువైన డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ సర్వీస్ పొందవచ్చు.
*వాలెట్ కేర్ పాలసీ తీసుకోవాలంటే దేశంలోని నివాసి అయి ఉండాలి. 18 ఏళ్ల వయసు దాటాలి.
* ఈ పాలసీకి సంబంధించిన మరింత సమాచారం కోసం బజాజ్ ఫిన్ సెర్ప్ వెబ్ సైట్ చూడవచ్చు. ఎక్కువ కార్డులు వినియోగించే వారు బీమా అంశాన్ని పరిశీలించవచ్చు. జాగరూకతతో ఉండేవారికి ఇలాంటి వాటి అవసరం ఉండకపోవచ్చు.


Click it and Unblock the Notifications