For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI క్రెడిట్ కార్డు బిల్లును ఏటీఎం ద్వారా ఎలా చెల్లించాలి? బెనిఫిట్స్...

|

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వివిధ రకాల క్రెడిట్ కార్డులను అందిస్తోంది. 5 మిలియన్లకు పైగా క్రెడిట్ కార్డులు కలిగిన కస్టమర్లు ఉన్నారు. తమ కస్టమర్లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలోని వివిధ మార్గాల ద్వారా క్రెడిట్ బిల్లు కట్టే వెసులుబాటును ఎస్బీఐ కల్పిస్తోంది. నెఫ్ట్ పేమెంట్, పేనెట్, ఇతర బ్యాంకుల నెట్ బ్యాంకింగ్ అకౌంట్, ఎస్బీఐ నెట్ బుకింగ్ అకౌంట్, ఎస్బీఐ మొబైల్ యాప్, డెబిట్ కార్డు యూపీఐ యాప్, యోనో యాప్.. ఇలా వివిధ మార్గాల్లో చెల్లింపులు చేయవచ్చు. ఇంటర్నెట్ అవసరం లేని ఆఫ్ లైన్ విధానం కౌంటర్ ద్వారా కూడా చెల్లించవచ్చు. అలాగే ఎలక్ట్రానిక్ డ్రాప్ బాక్స్, మాన్యువల్ డ్రాప్ బాక్స్, ఎస్బీఐ ఏటీఎం ద్వారా కూడా చెల్లించవచ్చు.

మీ చేతికి వచ్చే శాలరీ పెరగొచ్చు, పెన్షన్‌కు ఏదో ఒకటిమీ చేతికి వచ్చే శాలరీ పెరగొచ్చు, పెన్షన్‌కు ఏదో ఒకటి

ఇతర బ్యాంకుల క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు

ఇతర బ్యాంకుల క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు

ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి మీ క్రెడిట్ కార్డు బిల్లును ఎలా చెల్లించాలో ఇక్కడ తెలుసుకోండి. మీ క్రెడిట్ కార్డు బిల్లును మీ ఎస్బీఐ డెబిట్ కార్డుతో పాటు కొన్ని ఎంచుకున్న బ్యాంకుల డెబిట్ కార్డుల ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చు.

ఈ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు..

ఈ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు..

మీరు ఇతర బ్యాంకు డెబిట్ కార్డులను ఉపయోగించి ఎస్బీఐ క్రెడిట్ కార్డు చెల్లించాలనుకుంటే నెట్ బ్యాంకింగ్, నెఫ్ట్, ఎలక్ట్రానికి బిల్ పేమెంట్, ఎస్బీఐ ఆటో డెబిట్ ఆప్షన్, ఎస్బీఐ మొబైల్ యాప్ తదితరాల ద్వారా చెల్లించవచ్చు.

చెల్లింపు ప్రాసెస్‌ను బట్టి కాస్త తెలివిగా ఆలోచించాలి

చెల్లింపు ప్రాసెస్‌ను బట్టి కాస్త తెలివిగా ఆలోచించాలి

క్రెడిట్ కార్డు చెల్లింపు ప్రాసెస్‌కు కొన్ని ఒక రోజు కంటే ఎక్కువ సమయం కూడా తీసుకుంటాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త తెలివిగా ఆలోచించాలి.

- ఉదాహరణకు మీరు చివరి తేదీన చెల్లిస్తుంటే తక్షణమే జమ చేసే మార్గాన్ని ఎంచుకోవాలి.

డెబిడ్ కార్డును ఉపయోగించి ఆన్‌లైన్ ద్వారా క్రెడిట్ బిల్లు చెల్లింపు

డెబిడ్ కార్డును ఉపయోగించి ఆన్‌లైన్ ద్వారా క్రెడిట్ బిల్లు చెల్లింపు

ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లు తమ బకాయిలను సులభతరంగా క్లియర్ చేసుకునేందుకు ఎస్బీఐ కార్డు డెబిట్ కార్డు పేమెంట్స్‌ను అందిస్తోంది. ఈ క్రింది కార్డుల్లో దేనినైనా కలిగి ఉంటే ఆన్‌లైన్‌లో ఎస్బీఐ క్రెడిట్ కార్డు చెల్లింపులు చేయవచ్చు.

ఎస్బీఐ క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్స్ కోసం యాక్సెప్టెడ్ డెబిట్ కార్డస్ ఇవే...

సిటీ బ్యాంకు డెబిట్ కార్డు

బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కమ్ ఏటీఎం కార్డు

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర డెబిట్ కార్డు

కేరళ గ్రామీణ్ బ్యాంకు డెబిట్ కార్డు

లక్ష్మీవిలాస్ బ్యాంకు డెబిట్ కార్డు

ఐడీఎఫ్‌సీ బ్యాంకు డెబిట్ కార్డు

శివాలింక్ బ్యాంకు డెబిట్ కార్డు

బ్యాంక్ ఆఫ్ బరోడా డెబిడ్ కార్డు

ప్రగథి కృష్ణా బ్యాంకు డెబిట్ కార్డు

డెబిట్ కార్డు ఉపయోగించి ఎస్బీఐ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించేందుకు స్టెప్స్

డెబిట్ కార్డు ఉపయోగించి ఎస్బీఐ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించేందుకు స్టెప్స్

- ఎస్బీఐ కార్డు పేనెట్ పేజ్ ఓపెన్ చేయాలి.

- అక్కడ మీ పేమెంట్ ఆప్షన్ ఎంచుకోండి.

- డ్రాప్ డౌన్ నుంచి బ్యాంకను ఎంచుోకవాలి.

- Pay Now పైన క్లిక్ చేయాలి.

- అప్పుడు కొత్త పేజీలోకి వెళ్తారు. అక్కడ మీ డెబిట్ కార్డు నెంబర్, వివరాలు ఇవ్వాలి. క్రెడిట్ కార్డు బిల్లు పేమెంట్స్ చేయవచ్చు.

- ఓసారి వివరాలు ఎంటర్ చేశార, సూచనలు పాటిస్తూ పేమెంట్ చేయాలి.

డెబిట్ కార్డు ఉపయోగించి ఆఫ్‌లైన్‌లో చెల్లింపు

డెబిట్ కార్డు ఉపయోగించి ఆఫ్‌లైన్‌లో చెల్లింపు

- ఇంటర్నెట్ యాక్సెస్ లేనప్పుడు ఎస్బీఐ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల కోసం మీరు ఏటీఎం కేంద్రాన్ని సందర్శించవచ్చు. 24x7 యాక్సెస్, దేశంలో ఎక్కడైనా చెల్లించే వెసులుబాటును ఏటీఎం పేమెంట్ ద్వారా చెల్లింపు అందిస్తుంది.

- అయితే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునేందుకు మీకు ఎస్బీఐ డెబిట్ కార్డు ఉండాలి.

- ఇతర బ్యాంకుల డెబిట్ కార్డులు ప్రస్తుతం ఇక్కడ చెల్లించేందుకు అనుమతించడం లేదు.

- ఎస్బీఐ క్రెడిట్ కార్డు, డెబిడ్ కార్డు... రెండు కార్డుల వివరాలు తెలిసి ఉండాలి.

- మీరు ఎస్బీఐ ఏటీఎంకు వెళ్లాక అక్కడ వచ్చే సూచనల ఆధారంగా చెల్లింపు పూర్తి చేయవచ్చు.

ఎస్బీఐ ఏటీఎం ద్వారా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు

ఎస్బీఐ ఏటీఎం ద్వారా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు

- ఎస్బీఐ డెబిట్ కార్డును ఏటీఎం మిషన్‌లోకి ఇన్‌సర్ట్ చేయాలి.

- మీ పిన్ ఎంటర్ చేయాలి.

- బ్యాంకింగ్ ఆప్షన్స్ నుంచి సర్వీసెస్‌ను ఎంచుకోవాలి.

- Bill Payను, SBI Credit Card Billను సెలక్ట్ చేసుకోవాలి. - - ఎస్బీఐ క్రెడిట్ కార్డు నెంబర్ అమౌంట్‌ను, బిల్ అమౌంట్ వేసి Payపైన క్లిక్ చేయాలి.

- దీంతో ఆ మొత్తం డెబిట్ అవుతుంది.

- అయితే ఎస్బీఐ ఏటీఎం చెల్లింపు అయితే ఈ ప్రాసెస్‌కు రెండు రోజుల సమయం పడుతుంది.

డెబిట్ కార్డుతో ఎస్బీఐ క్రెడిట్ కార్డు చెల్లింపుతో ప్రయోజనాలు.

డెబిట్ కార్డుతో ఎస్బీఐ క్రెడిట్ కార్డు చెల్లింపుతో ప్రయోజనాలు.

- ఇలా చెల్లించడం ఎంతో సులభం. కన్వీనెంట్‌గా ఉంటుంది.

- ఆన్‌లైన్ చెల్లింపు ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. లేదంటే బ్యాంకుకు వెళ్లడం, చెక్కు రాయడం వంటి వల్ల సమయం నష్టపోతాం.

- డెబిట్ కార్డుతో చెల్లింపుకు ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఎస్పీఐ పేనెట్ పేజీని సందర్శించి చెల్లించవచ్చు.

- ఇది సురక్షితం.

English summary

SBI క్రెడిట్ కార్డు బిల్లును ఏటీఎం ద్వారా ఎలా చెల్లించాలి? బెనిఫిట్స్... | How to pay SBI credit card bills through atm?

SBI Card, the credit card issuing arm of State Bank of India (SBI), offers a variety of credit cards catering the needs of different groups of people.
Story first published: Sunday, September 8, 2019, 12:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X